– ప్రతి నెలా రు. 86 లక్షల అదనపు భారం
– పేదలు ఇబ్బంది పడకూడదనే సీఎం నిర్ణయం
– మంత్రి కొండపల్లి శ్రీనివాస్
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
ఎన్టీఆర్ భరోసా పెన్షన్ స్కీం క్రింద తీవ్రమైన కిడ్నీ సమస్యలతో డయాలసిస్ చేయించుకుంటోన్న బాధితులు, కిడ్నీ, కాలేయ, గుండె మార్పిడి చేయించుకున్న వారికి రాష్ట్ర వ్యాప్తంగా 895 కొత్త పెన్షన్లు మంజూరైనట్టు రాష్ట్ర సూక్ష్మ, చిన్న, మధ్యతరహ పరిశ్రమలు, గ్రామీణ పేదరిక నిర్మూలన, ప్రవాసాంధ్రుల సాధికారత సంబంధాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ గురువారం పేర్కొన్నారు. పైన పేర్కొన్న వారితో పాటు ద్వైపాక్షిక బోదకాలు, కుష్టుతో పాటు ధీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతోన్న అర్హులైన పేదలు ఎవ్వరూ ఇబ్బంది పడకూడదనే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ 895 మందికి కొత్తగా పెన్షన్లు మంజూరు చేస్తూ నిర్ణయం తీసుకున్నారని మంత్రి తెలిపారు. ఈ పెన్షన్లతో నెలకు ప్రభుత్వంపై రు. 86,34,000 అదనపు భారం పడుతుందన్నారు. వీరికి ప్రతి నెలా 1వ తేదీనే స్వర్ణ గ్రామం / స్వర్ణ వార్డు సిబ్బంది వారి ఇళ్లకే వెళ్లి పెన్షన్ సొమ్ము అందజేస్తారని మంత్రి తెలిపారు.
Prajavartha Online Telugu News