Breaking News

ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖకు అంతర్జాతీయ గౌరవం.. ‘బెస్ట్ టూరిజం ప్రమోషన్ స్టేట్’గా ఎంపిక

-మంత్రి కందుల దుర్గేష్‌కు ప్రతిష్ఠాత్మక ‘మెట్రో ఎక్స్‌పెడిషన్ – GTM టూరిజం అవార్డు 2026’ ఆహ్వానం
-జూన్ 4న తిరువనంతపురంలో అవార్డు ప్రదానోత్సవం..ఫలించిన మంత్రి కందుల దుర్గేష్ కృషి..పర్యాటక రంగంలో సత్ఫలితాలిస్తోన్న వినూత్న సంస్కరణలు, విప్లవాత్మక మార్పలు
-సీఎం చంద్రబాబునాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ల దిశానిర్దేశంలో పర్యాటక శాఖకు విస్తృత ప్రచారం కల్పించామని పేర్కొన్న మంత్రి కందుల దుర్గేష్
-22 నెలల కాలంలో పర్యాటక రంగంలో మంత్రి కందుల దుర్గేష్ దార్శనికతకు దక్కిన గుర్తింపు..సరికొత్త ప్రచార శైలి, సృజనాత్మక ఆలోచనలతో జాతీయ స్థాయి ప్రశంసలు అందుకున్న ఏపీ పర్యాటక శాఖ
-ఇది కూటమి ప్రభుత్వ దార్శనికతకు దక్కిన అరుదైన గౌరవమని వెల్లడి..కేరళ వేదికగా అందుకోబోయే జాతీయ అవార్డు ఏపీ పర్యాటక శాఖ చేస్తున్న వినూత్న ప్రయోగాలకు దక్కిన అసలైన గుర్తింపుగా అభివర్ణించిన మంత్రి దుర్గేష్
-కూటమి సర్కార్ సంకల్పం.. పర్యాటక రంగానికి నూతన జవజీవాలు!..డిజిటల్ విప్లవం మరియు అంతర్జాతీయ స్థాయి బ్రాండింగ్‌తో నేడు ఇంటింటికీ చేరువైన ఏపీ పర్యాటకం
-“అంతర్జాతీయ స్థాయి మౌలిక సదుపాయాలు, మెరుగైన భద్రతా ప్రమాణాలతో పర్యాటకుల మనసు గెలుచుకుంటున్న నవ్యాంధ్ర పర్యాటకం.”
-“కేరళలో అందకోబోయే జాతీయ అవార్డు ఏపీ పర్యాటక వైభవానికి ముగింపు కాదు.. ఇది ప్రపంచ స్థాయి విజయాలకు ఒక ఘనమైన ఆరంభం!” అని పేర్కొన్న మంత్రి దుర్గేష్
-పర్యాటక శాఖ ఉన్నతాధికారులను సచివాలయంలో అభినందించిన మంత్రి కందుల దుర్గేష్

అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త :
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దార్శనికత, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పర్యావరణ స్పృహ, మంత్రి కందుల దుర్గేష్ అంకితభావం.. ఈ ముగ్గురి సమిష్టి కృషి ఏపీ పర్యాటక రంగాన్ని గ్లోబల్ మ్యాప్‌పై సగర్వంగా నిలబెట్టింది. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ పర్యాటక రంగం మరో అంతర్జాతీయ స్థాయి మైలురాయిని అధిగమించింది. దక్షిణాదిలోనే అతిపెద్ద ట్రావెల్ అండ్ ట్రేడ్ ఎక్స్‌పో అయిన గ్లోబల్ ట్రావెల్ మార్కెట్ (GTM 2026) వారు ఆంధ్రప్రదేశ్‌ను “బెస్ట్ టూరిజం ప్రమోషన్ స్టేట్” (ఉత్తమ పర్యాటక ప్రచార రాష్ట్రం)గా ఎంపిక చేశారు. ఈ మేరకు ప్రతిష్ఠాత్మకమైన ‘మెట్రో ఎక్స్‌పెడిషన్ – GTM టూరిజం అవార్డు 2026’ స్వీకరించాల్సిందిగా రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ కు నిర్వాహకులు అధికారిక ఆహ్వానం పంపారు. కేరళలోని తిరువనంతపురం, కోవలంలో ఉన్న ‘ది లీలా’ హోటల్‌లో జూన్ 4వ తేదీ సాయంత్రం 5 గంటలకు నిర్వహించనున్న వేడుకలో ఈ అవార్డును ప్రదానం చేయనున్నారు. ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ గురువారం వెలగపూడి సచివాలయం బ్లాక్ లోని తన ఛాంబర్ లో పర్యాటక శాఖ ఉన్నతాధికారులను అభినందించారు. జూన్ 3 నుండి 5 వరకు జరిగే ఈ ఎక్స్‌పోలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న టూరిజం బోర్డులు, హాస్పిటాలిటీ బ్రాండ్‌లు మరియు పరిశ్రమల ప్రతినిధులు పాల్గొననున్నారు. ఇటువంటి వేదికపై ఆంధ్రప్రదేశ్‌కు అవార్డు దక్కడం రాష్ట్ర పర్యాటక అభివృద్ధికి నిదర్శనం. మంత్రి కందుల దుర్గేష్ ఆధ్వర్యంలో పర్యాటక శాఖ సాధించిన ఈ విజయ పరంపరపై శాఖాధికారులు మరియు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

మంత్రి కందుల దుర్గేష్ కృషికి గుర్తింపు:

ఆంధ్రప్రదేశ్ పర్యాటక రంగాన్ని బలోపేతం చేయడంలో, రాష్ట్ర సంస్కృతి, వారసత్వం, పర్యాటక ప్రాంతాలను జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రమోట్ చేయడంలో మంత్రి కందుల దుర్గేష్ కనబరిచిన దార్శనిక నాయకత్వం మరియు అంకితభావానికి ఈ అవార్డు దక్కింది. ప్రత్యేకించి పర్యాటక శాఖ మంత్రిగా కందుల దుర్గేష్ బాధ్యతలు చేపట్టిన నాటి నుండి క్షేత్రస్థాయిలో పర్యవేక్షిస్తూ, మౌలిక సదుపాయాల కల్పనలో వేగం పెంచారు. రీజినల్ ఇన్వెస్టర్ల సదస్సులు, రోడ్ షోలు, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఆయన వినిపించిన పర్యాటక వాణికి ఇన్వెస్టర్లు ఫిదా అయ్యారు. ఫలితంగా కేవలం 18 నెలల కాలంలోనే 100కు పైగా సంస్థలతో ఎంవోయూలు కుదుర్చుకోవడం విశేషం. ఈ క్రమంలో రాష్ట్రానికి ఏకంగా రూ. 20,000 కోట్లకు పైగా పెట్టుబడులను ఆకర్షించి అసాధారణ విజయాన్ని నమోదు చేశారు. అదే విధంగా పర్యాటక శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అజయ్ జైన్, టూరిజం ఎండీ ఆమ్రపాలి కాట మరియు రాష్ట్ర పర్యాటక శాఖ బృందం చేపట్టిన వినూత్న కార్యక్రమాలు, గమ్యస్థానాల అభివృద్ధి మరియు పర్యాటక రంగానికి మంత్రి కందుల దుర్గేష్ ఇస్తున్న ప్రాధాన్యతను జీటీఎం మేనేజింగ్ ఎడిటర్ సిజి నాయర్ తన ఆహ్వాన పత్రికలో ప్రత్యేకంగా ప్రశంసించారు.

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి పర్యాటక రంగాన్ని రాష్ట్ర ప్రగతికి చోదక శక్తిగా గుర్తించి చేపట్టిన విప్లవాత్మక మార్పులు నేడు జాతీయ స్థాయి గుర్తింపును తెచ్చిపెట్టాయని మంత్రి దుర్గేష్ అన్నారు.పర్యాటక శాఖ చేపట్టిన వినూత్న ప్రచార కార్యక్రమాలకు ప్రశంసలతో పాటు ప్రతిష్టాత్మక అవార్డు వరించిందని పేర్కొన్నారు.సరికొత్త ప్రచార శైలి, సృజనాత్మక ఆలోచనలతో జాతీయ స్థాయి ప్రశంసలు అందుకోవడం ఏపీ పర్యాటక శాఖ సాధించిన అద్భుత విజయం. కేరళ వేదికగా దక్కబోయే అవార్డు ఆంధ్రప్రదేశ్ వైభవానికి మకుటాయమానం.””సముద్ర తీరాల సొగసు నుంచి ఆధ్యాత్మిక క్షేత్రాల వైభవం వరకు.. ప్రతి ప్రాంతాన్ని ఒక అంతర్జాతీయ పర్యాటక హబ్‌గా తీర్చిదిద్దుతున్న కూటమి ప్రభుత్వ కృషి అజరామరమని హర్షం వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ…భవిష్యత్ అంతా టూరిజం దే అని విశ్వసించి, పర్యాటక రంగాన్ని ‘మిషన్ మోడ్’లో అభివృద్ధి చేయాలన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు లక్ష్యం, పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్‌షిప్ విధానంలో తెచ్చిన సంస్కరణలు ఈ విజయానికి పునాది వేశాయి. ముఖ్యంగా పర్యాటక రంగానికి పారిశ్రామిక హోదా కల్పించడం, అత్యుత్తమ పర్యాటక పాలసీ 2024-29ని విడుదల చేయడం, హోమ్ స్టే, కారవాన్ టూరిజం, ల్యాండ్ అలాట్ మెంట్, బి అండ్ బీ వంటి అనుబంధ పాలసీలు, టెంట్ సిటీల ఏర్పాటు ఇవన్నీ ఒక చారిత్రక మైలురాయిగా చెప్పవచ్చు.”పర్యాటకాన్ని కేవలం వినోదంగా చూడకుండా, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా మార్చాలనే సీఎం చంద్రబాబు నాయుడు దార్శనికత ఈ రంగానికి నూతనోత్తేజం ఇచ్చింది.” దీనికి తోడు ఉపముఖ్యమంత్రి కొణిదల పవన్ కళ్యాణ్ గారు పర్యాటక ప్రాంతాల పరిరక్షణ మరియు పర్యావరణ హిత పర్యాటకం పై చూపిన ప్రత్యేక శ్రద్ధ ఈ రంగానికి అదనపు బలాన్ని చేకూర్చింది. అంతేగాక గతంలో ఎన్నడూ లేని విధంగా కేంద్ర ప్రభుత్వం 8 పర్యాటక ప్రాజెక్టులకు దాదాపు రూ.430 కోట్లు కేటాయించి ఏపీ పర్యాటకాభివృద్ధికి బాటలు వేయడం విశేషం. “కూటమి ప్రభుత్వ హయాంలో ఏపీ పర్యాటకం కేవలం విహారయాత్ర కాదు.. అది రాష్ట్ర ఆర్థిక ప్రగతికి అసలైన గమ్యస్థానం. నాయకుల సంకల్పం – అధికారుల కార్యాచరణ వెరసి ఆంధ్రప్రదేశ్ నేడు ఇన్వెస్టర్ల స్వర్గధామంగా నిలుస్తోందనడంలో అతిశయోక్తి లేదన్నారు.

రాష్ట్ర పర్యాటక వైభవాన్ని చాటిచెప్పేలా రూపొందించిన సరికొత్త ఆవిష్కరణలు పరిశీలిస్తే…1053 కి.మీ పొడవైన సుదీర్ఘ సముద్ర తీరాన్ని అంతర్జాతీయ స్థాయి వసతులతో కూడిన బీచ్ రిసార్టులుగా తీర్చిదిద్దడం.. తిరుమల, శ్రీశైలం, విజయవాడ, అరసవల్లి వంటి ప్రముఖ పుణ్యక్షేత్రాలను అనుసంధానిస్తూ భక్తులకు మెరుగైన దర్శనం, వసతి సౌకర్యాలు కల్పించడం.. అరకు లోయ, గండికోట, లంబసింగి, సూర్యలంక బీచ్ వంటి ప్రాంతాల్లో సాహస క్రీడలు, కారవాన్ టూరిజం ప్రవేశపెట్టడం… కొండపల్లి టాయ్ ఫెస్టివల్ వంటి స్థానిక కళలను, లేపాక్షి వంటి చారిత్రక కట్టడాలను ప్రపంచానికి పరిచయం చేయడం.. టెంపుల్ టూరిజంతో పాటు ఎకో, అడ్వెంచర్, హెరిటేజ్, కల్చర్, బీచ్, రివర్, వెల్ నెస్, క్రూయిజ్ తదితర విభిన్న టూరిజం ప్రక్రియలను పరిచయం చేయడం, ప్రత్యేకించి సోషల్ మీడియా మరియు అంతర్జాతీయ ప్లాట్‌ఫామ్స్‌పై ఏపీ పర్యాటక సౌందర్యాన్ని ‘బ్రాండ్ ఏపీ’గా ప్రదర్శించి పర్యాటకులను ఆకర్షించడం, ఏడాది పొడవునా పర్యాటక శోభ ఉండేలా విశాఖ, అనకాపల్లి, అరకు ఉత్సవ్, గండికోట ఉత్సవ్, ఫ్లెమింగో ఫెస్టివల్, అమరావతి ఆవకాయ్ ఫెస్టివల్, ఆత్రేయపురం బోట్ ఫెస్టివల్, విజయవాడ, కొండవీడు ఉత్సవ్ తదితర పర్యాటక పండుగలతో విస్తృత ప్రచారం కల్పించడం ఈ అవార్డు వరించడానికి కారణాలయ్యాయని మంత్రి దుర్గేష్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు

మంత్రి దుర్గేష్ ఆధ్వర్యంలో పర్యాటక శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అజయ్ జైన్, ఎండీ ఆమ్రపాలి కాట మరియు టూరిజం అధికారుల బృందం సమన్వయంతో డిజిటల్ మార్కెటింగ్ చేపట్టడం వల్ల యాత్రికులు, పర్యాటకుల సంఖ్య గణనీయంగా పెరిగింది. ఈ చర్యల వల్ల రాష్ట్రానికి పెట్టుబడులే కాకుండా, స్థానిక యువతకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయి.కేరళలో అందుకోబోయే ఈ అవార్డు ఆంధ్రప్రదేశ్ పర్యాటక వైభవానికి కేవలం ఆరంభం మాత్రమేనని పర్యాటక శాఖ వర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

16 నెలలు… 16కు పైగా విజయాలు…

-స్పష్టమైన మార్పు చూపించిన ‘స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర’ కార్యక్రమం -ఇదే స్ఫూర్తితో పనిచేయాలని ప్రభుత్వ యంత్రాంగానికి సీఎం చంద్రబాబు పిలుపు -ప్రజల సహకారంపై …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *