-ఉపాధి మరియు శిక్షణ శాఖ సంచాలకులు జి. గణేష్ కుమార్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఈ ఏడాది జూలై 2026లో జరగనున్న ఆల్ ఇండియా ట్రేడ్ టెస్ట్ (AITT) పరీక్షలకు అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు రాష్ట్ర ఉపాధి మరియు శిక్షణ శాఖ సంచాలకులు జి. గణేష్ కుమార్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.
నేషనల్ కౌన్సిల్ ఫర్ వొకేషనల్ ట్రైనింగ్ (NCVT) పరిధిలోని క్రాఫ్ట్స్మెన్ ట్రైనింగ్ స్కీమ్ (CTS) కింద, జూలై 2026 యాన్యువల్ సిస్టమ్ ద్వారా నిర్వహించే ఆల్ ఇండియా ట్రేడ్ టెస్ట్ (AITT) కోసం అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరుతున్నామన్నారు.
2024-26 బ్యాచ్ లో రెండేళ్ల కోర్సులో రెండో సంవత్సర విద్యార్థులు,
2025-27 బ్యాచ్ లో రెండేళ్ల కోర్సులో మొదటి సంవత్సర విద్యార్థులు.
2025-26 బ్యాచ్ లో ఏడాది కోర్సు మరియు ఆరు నెలల కోర్సు (బ్యాచ్-II)
బ్యాచ్లకు చెందిన అభ్యర్థులు ఈ పరీక్షలకు హాజరుకావచ్చునన్నారు.
రెగ్యులర్ విద్యార్థులు ఒక్కో సబ్జెక్టుకు రూ. 100/- చెల్లించవలసి ఉంటుందని అన్నారు.
విద్యార్థులు తమ సంబంధిత ప్రభుత్వ లేదా ప్రైవేట్ ఐటిఐ (ITI) ప్రిన్సిపాళ్ళకు నగదు రూపంలో ఫీజు చెల్లించి రశీదు పొందవలసి ఉంటుందన్నారు.
జరిమానా లేకుండా ఫీజు చెల్లించడానికి చివరి తేదీ (15.06.2026)
జూన్ 15 అని, రూ.10/- ఆలస్య రుసుముతో ఫీజు చెల్లించడానికి చివరి తేదీ (20.06.2026) జూన్ 20 సాయంత్రం 5:00 గంటల వరకు అని పేర్కొన్నారు.
పూర్తి చేసిన దరఖాస్తు ఫారాలను, ఫీజు రశీదుతో కలిపి నిర్ణీత గడువులోగా సంబంధిత ఐటిఐ కార్యాలయాల్లో సమర్పించాలని సూచించారు. ఒకసారి చెల్లించిన ఫీజు తిరిగి ఇవ్వబడదని రాష్ట్ర ఉపాధి మరియు శిక్షణ శాఖ సంచాలకులు జి. గణేష్ కుమార్ ఆ ప్రకటనలో తెలిపారు.
Prajavartha Online Telugu News