Breaking News

జపాన్ దేశం నందు ఉద్యోగ అవకాశాలు

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ద్వారా జపాన్ దేశం లో ఉద్యోగాల కొరకు శ్రీ సిటీ , తిరుపతి జిల్లా నందు అర్హత కలిగిన యువతి యువకులకు ట్రైనింగ్ మరియు జపాన్ దేశం నందు ఉద్యోగ అవకాశాలు కల్పించబడును .

1: జపాన్ దేశం నందు మ్యానుఫ్యాక్చరింగ్ ,క్యారేజ్ గివింగ్, కన్స్ట్రక్షన్, హాస్పిటాలిటీ, ఆటోమొబైల్ (Manufacturing /Caregiving/ Construction/Hospitality/Automobile) సంబంధిత సెక్టార్లలో ఉద్యోగ అవకాశాలు కల్పించబడును.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో జపాన్ దేశంలోని ఉద్యోగ అవకాశాల కొరకు శ్రీ సిటీ, తిరుపతి జిల్లా నందు ట్రైనింగ్ కల్పించబడును. కావున అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు క్రింద తెలుపబడిన రిజిస్ట్రేషన్ లింకులో రిజిస్ట్రేషన్ చేసుకోగలరు.

జపాన్ దేశంలో ఉద్యోగ అవకాశాలు కొరకు అప్లై చేసే యువతి యువకులకు వయస్సు 18 నుంచి 30 సంవత్సరాల లోపు ఉండాలి.

విద్యార్హతలు : పదవ తరగతి/ఇంటర్మీడియట్ /ఐటిఐ డిప్లమా /డిగ్రీ/ఏఎన్ఎం/ జిఎన్ఎం( SSC/Intermediate/ITI/Diploma/Degree/ANM/GNM) విద్యార్హత కలిగి ఉండాలి మరియు బేసిక్ ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ కలిగి ఉండాలి.

ట్రైనింగ్ తర్వాత ఉద్యోగానికి ఎంపికైనవారికి నెలకు 1,03,996/- + నుంచి 1,45,000/- వేతనం పొందవచ్చు.

రిజిస్ట్రేషన్ చివరి తేదీ:31-05-2026.

రిజిస్ట్రేషన్ ఫీజు: 2,00,000/-(ట్రైనింగ్ చార్జెస్ 50,000/-& ఇంటర్నేషనల్ ప్లేస్మెంట్ సపోర్ట్ చార్జెస్ 1,50,000/-)

ఎడ్యుకేషన్ లోన్ ఫెసిలిటీ కలదు.

ఆసక్తి గల అభ్యర్థులు పాస్పోర్ట్, అనుభవం సంబంధిత విద్యా ధృవపత్రాలతో రిజిస్ట్రేషన్ కొరకు ఈ క్రింద వెబ్సైట్ లో నమోదు చేసుకోవలసినదిగా కోరుచున్నాము
https://naipunyam.ap.gov.in/user-registration?page=program-registration

మరిన్ని వివరములుకు ఫోన్ నంబర్లు :+919160912690,9988853335 ను సంప్రదించండి.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

16 నెలలు… 16కు పైగా విజయాలు…

-స్పష్టమైన మార్పు చూపించిన ‘స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర’ కార్యక్రమం -ఇదే స్ఫూర్తితో పనిచేయాలని ప్రభుత్వ యంత్రాంగానికి సీఎం చంద్రబాబు పిలుపు -ప్రజల సహకారంపై …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *