-భూములిచ్చిన రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుంది
-జాయింట్ కలెక్టర్ ఆర్. గోవిందరావు
సత్యవేడు, నేటి పత్రిక ప్రజావార్త :
పరిశ్రమ ఏర్పాటుకు సత్యవేడు మండలంలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన భూ సేకరణకు గ్రామస్తులు సహకరించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ ఆర్.గోవిందరావు పేర్కొన్నారు. శుక్రవారం సత్యవేడు మండలంలో సత్యవేడు తహశీల్దార్ కార్యాలయంలో ఇరుగళం, కోళ్లడం గ్రామస్థులతో భూ సేకరణకు సంబంధించి భూమి రేటు పై సూళ్లూరుపేట ఆర్డిఓ దేవేంద్రరెడ్డితో కలసి జిల్లా జాయింట్ కలెక్టర్ గ్రామ సభ నిర్వహించారు.
ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం సూళ్ళూరుపేట రెవెన్యూ డివిజన్, సత్యవేడు మండల పరిధిలో పరిశ్రమల ఏర్పాటుకు అవసరమైన భూ సేకరణను చేపట్టిందని, ఇందుకు గానూ కోళ్లడం, ఇరుగుళం గ్రామంలో భూ సేకరణ చేపడుతున్నట్లు తెలిపారు. భూసేకరణకు గ్రామస్తులు సకరించాలని, భూములు సమర్పించిన గ్రామస్థులను ప్రభుత్వం ఆదుకుంటుందని, నిబంధనల మేరకు భూ పరిహారం చెల్లించడం జరుగుతుందన్నారు.
ఈ కార్యక్రమంలో సత్యవేడు తహశీల్దార్ శివ ప్రసాద్, రెవెన్యూ సిబ్బంది, గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News