Breaking News

మొదటి ఏడాది లోనే ఓ అండ్ ఎం పనులకు 708 కోట్లు

-మూడో విడత లో 397 కోట్ల తో పనులు
-జూన్ మొదటి వారం లోగా కాలువల తవ్వకం పనులు పూర్తి చేయాలి
-మంత్రి నిమ్మల రామానాయుడు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఐదేళ్ల జగన్ అరాచక పాలనలో కాలువల వ్యవస్థ అస్తవ్యస్తమైపోయిందని రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఆవేదన చెందారు. నిర్వహణ పనులు నీటికి వదిలేసారని ఆయన ధ్వజమెత్తారు. ఓఅండ్ఎం పనులు, వెలిగొండ ప్రాజెక్టు పనుల పురోగతి పై ఇరిగేషన్ అధికారులతో మంత్రి నిమ్మల రామానాయుడు శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కూటమి ప్రభుత్వం వచ్చాక మొదటి సంవత్సరంలోనే రెండు విడతలుగా ఓఅండ్ఎం పనుల కోసం708 కోట్లు కేటాయించినట్లు చెప్పారు. నేడు కాలువల్లో తూడు, గుర్రపుడెక్క, పూడికతీత, వంటి అత్యవసర, మరమ్మత్తులు పనుల కోసం 397 కోట్లు కేటాయించా మన్నారు.

గత 5ఏళ్ళ వైసిపి పాలనలో కాలువల్లో తూడు,గుర్రపుడెక్క, పూడికతీత వంటి కనీస నిర్వహణ పనులు చేయలేదన్నారు. ఆ కారణంగానే అన్నదాతలకు అపార నష్టం జరిగిందన్నారు.
అత్యవసర పనులు కోసం 10లక్షలు దాటితే, కాలయాపన లేకుండా, 7 రోజుల్లోనే షార్ట్ టెండర్లు పిలిచేలా కేబినెట్ ఆమోదించిన విషయాన్ని తెలియజేశారు. మొత్తం 6,502 పనుల్లో 5,943 పనులు సుమారు 91 శాతం సాగు నీటి సంఘాల ద్వారానే పనులు జరుగనున్నాయని వివరించారు.
ఖరీఫ్ నాటికి ఓఅండ్ఎం పనులు పూర్తిచేసేలా సిఈ స్దాయి నుండి కిందిస్దాయి అధికారులు వరకు పర్యవేక్షణ చేయాలని సూచించారు.

ఓఅండ్ఎం పనులకు సంబందించి, ప్రతి వారం, పనుల వివరాలు, వర్క్ ప్రోగ్రెస్ రిపోర్టు అందించాలని నిమ్మల ఆదేశించారు. జలధారకు, ఓఅండ్ఎం పనులను కూడా సమన్వయం చేసి, భూగర్భ జలాలు పెంచడానికి కృషి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈనెలలో జలధారపై కేంద్ర జలశక్తి మంత్రి సి. ఆర్.పాటిల్, ముఖ్యమంత్రి చంద్రబాబు, కలెక్టర్లు, ఇరిగేషన్ అధికారుతో కాన్ఫరెన్స్ నిర్వహిస్తారన్నారు.ఈ సమీక్ష లో ఇరిగేషన్ స్పెషల్ చీప్ సెక్రటరీ శశిభూషణ్, కడా కమిషనర్ ప్రశాంతి, ఇరిగేషన్ అడ్వైజర్ వెంకటేశ్వరరావు, ఈఎన్సి నరసింహమూర్తి, సీఈలు, ఎస్ ఈలు, ఈఈ లు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

16 నెలలు… 16కు పైగా విజయాలు…

-స్పష్టమైన మార్పు చూపించిన ‘స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర’ కార్యక్రమం -ఇదే స్ఫూర్తితో పనిచేయాలని ప్రభుత్వ యంత్రాంగానికి సీఎం చంద్రబాబు పిలుపు -ప్రజల సహకారంపై …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *