Breaking News

పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలి…

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలో విభిన్న వాతావరణ పరిస్థితులు నెలకొంటున్నట్లు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. ఓ వైపు ఎండ తీవ్రత, మరోవైపు పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. శుక్రవారం ప్రకాశం జిల్లా కొప్పెరపాడులో 43.8 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైందని తెలిపారు. అలాగే 28 జిల్లాలకు గాను 19 జిల్లాల పరిధిలోని 72 మండలాల్లో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు రికార్డు అయినట్లు ఆయన వెల్లడించారు.

శనివారం(16-05-26) విజయనగరం, మన్యం, పోలవరం, పల్నాడు, మార్కాపురం, ప్రకాశం, కర్నూలు, నంద్యాల, వైఎస్సార్ కడప జిల్లాల్లో 40-42°C మధ్య గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదైందుకు అవకాశం ఉందన్నారు. ఆదివారం 19 మండలాల్లో తీవ్ర వడగాలులు, 30 మండలాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని పేర్కొన్నారు.

మరోవైపు నైరుతి, పశ్చిమమధ్య బంగాళాఖాతంలోని బలపడిన అల్పపీడనంకు అనుబంధంగా ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉందని ఏపీఎస్డీఎంఏ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. దీని ప్రభావంతో శనివారం మన్యం, అల్లూరి, పోలవరం, అనకాపల్లి, తూర్పుగోదావరి, ఏలూరు, పల్నాడు, మార్కాపురం, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి, కడప జిల్లాల పరిధిలో కొన్నిచోట్ల మేఘావృతమైన వాతావరణం, మరికొన్నిచోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.

పొలాల్లో పనిచేసే రైతులు, పశుకాపరులు మరింత అప్రమత్తంగా ఉండాలని, ఆకాశం మేఘావృతమై ఉరుములు వినిపించిన వెంటనే సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలన్నారు. చెట్ల క్రిందకు వెళ్లొద్దని విజ్ఞప్తి చేశారు.

శుక్రవారం ప్రకాశం(జి) కొప్పెరపాడులో 43.8°C, నంద్యాల(జి) కొత్తపల్లె, ఎన్టీఆర్(జి) తొర్రగుడిపాడులో 42.7°C, పల్నాడు(జి) గండిగనుమలలో 42.6°C, అనంతపురం(జి) రాయదుర్గం, కర్నూలు (జి) నగరడోనలో 42.2°C, కృష్ణా(జి) ఉయ్యూరులో 42.1°C, మార్కాపురం(జి) అర్ధవీడులో 42°C, మన్యం(జి) మక్కువ, వైఎస్సార్ కడప(జి) జమ్మలమడుగులో 41.8°C, బాపట్ల(జి) చీరాల, పశ్చిమగోదావరి(జి) తాడేపల్లిలో 41.7°C, ఏలూరు(జి) కుక్కునూరు, పోలవరం (జి) కూనవరంలో 41.6°C, విజయనగరం(జి) మెంటాడలో41.5 డిగ్రీల చొప్పున గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వెల్లడించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

16 నెలలు… 16కు పైగా విజయాలు…

-స్పష్టమైన మార్పు చూపించిన ‘స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర’ కార్యక్రమం -ఇదే స్ఫూర్తితో పనిచేయాలని ప్రభుత్వ యంత్రాంగానికి సీఎం చంద్రబాబు పిలుపు -ప్రజల సహకారంపై …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *