-విజయవాడ క్యాంప్ ఆఫీస్ నుండి సిఎం క్యాంప్ కార్యాలయం
-10 కి. మీ సైకిల్ పై ప్రయాణం
-పోలవరం నిర్వాసితులకు పరిహారం పంపిణీ కార్యక్రమం లో పాల్గొన్న మంత్రి నిమ్మల
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
నో వెహికల్ డే సందర్భంగా రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు విజయవాడ క్యాంపు కార్యాలయం నుండి ఉండవల్లి సిఎం క్యాంపు కార్యాలయం వరకు సైకిల్ తొక్కుకుంటూ వెళ్లారు.
మండుటెండలో దాదాపు 10 కి.మీ సైకిల్ తొక్కుకుంటూ సిఎం క్యాంపు కార్యాలయానికి చేరుకున్నారు. సిఎం చంద్రబాబు చేతుల మీదుగా పోలవరం నిర్వాసితులకు 307 కోట్ల పరిహారం, పట్టాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొనేందుకు సైకిల్ పై వెళ్లారాయన.
పెట్రోల్, డీజిల్, విద్యుత్ వాడకాన్ని తగ్గించి, పొదుపు చేయాలని ప్రధాని మోధీ ఇచ్చిన పిలుపు మేరకు తక్షణం స్పందించిన మంత్రి నిమ్మల తన వంతు భాద్యతగా కాన్యాయ్ ని పక్కనపెట్టి సైకిల్ పై మీటింగ్ కు హాజరయ్యారు.
దేశ భవిష్యత్ కోసం, భవిష్యత్ తరాల కోసం ఇంధనం పొదుపు చేయమని ప్రధాని పిలుపు ఇస్తే, వైసిపి నేతలు అవహేళనగా మాట్లాడటం భాదాకరమని నిమ్మల వ్యాఖ్యానించారు.
Prajavartha Online Telugu News