కొక్కిలగడ్డలో శ్రీ మల్లేశ్వరస్వామిని దర్శించుకున్న మంత్రి నారా లోకేష్

మోపిదేవి, నేటి పత్రిక ప్రజావార్త :
కృష్ణా జిల్లా, మోపిదేవి మండలం, కొక్కిలగడ్డలో బుధవారం జడ్పీ పాఠశాల భవనాన్ని ప్రారంభించిన అనంతరం గ్రామంలోని శ్రీ గంగా భ్రమరాంబ సమేత శ్రీ మల్లేశ్వరస్వామి దేవాలయాన్ని రాష్ట్ర మానవ వనరులు, ఐటీ, ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్స్, ఆర్టిజిఎస్ శాఖల మంత్రి నారా లోకేష్ సందర్శించారు. ముందుగా ఆలయానికి చేరుకున్న మంత్రి లోకేష్ కు ఆలయ పండితులు ఘనస్వాగతం పలికారు. అనంతరం శ్రీ గంగా భ్రమరాంబ సమేత శ్రీ మల్లేశ్వరస్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు మంత్రి లోకేష్ కు స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్మిక, కర్మాగారాలు, బాయిలర్లు, వైద్య బీమా సేవల శాఖ మంత్రి, జిల్లా ఇన్చార్జి మంత్రి శ్రీ వాసంశెట్టి సుభాష్, జిల్లా కలెక్టర్ డీకే బాలాజి, జిల్లా ఎస్పీ వి విద్యాసాగర్ నాయుడు, ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణరావు, శాసనమండలి చీఫ్ విప్ పంచుమర్తి అనురాధ జాయింట్ కలెక్టర్ ఎం నవీన్, బందరు పార్లమెంటు సభ్యుడు వల్లభనేని బాలశౌరి, జోనల్ కోఆర్డినేటర్ మంతెన సత్యనారాయణ రాజు, ఎమ్మెల్యేలు మండలి బుద్ధప్రసాద్, తెనాలి శ్రావణ్ కుమార్, గళ్లా మాధవి, భాష్యం ప్రవీణ్, వెనిగండ్ల రాము, కాగిత కృష్ణ ప్రసాద్, బోడె ప్రసాద్, గౌడ కార్పొరేషన్ చైర్మన్ వీరంకి వెంకట గురుమూర్తి, జిల్లా ప్రధాన కార్యదర్శి గోపు సత్యనారాయణ, అవనిగడ్డ నియోజకవర్గ పరిశీలకులు కనపర్తి శ్రీనివాస్, డీసీఎంఎస్ ఛైర్మన్ బండి రామకృష్ణ, యువ నాయకుడు మండలి రాజా తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *