విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ఆదేశాల మేరకు బుడమేరు కాలువ ప్రక్షాళన కార్యక్రమాన్ని నిరంతరాయంగా నిర్వహిస్తున్నట్లు విజయవాడ నగరపాలక సంస్థ బయాలజిస్ట్ శ్రీ సూర్యకుమార్ నాయక్ తెలిపారు.
ఈ కార్యక్రమంలో భాగంగా అంబాపురం ప్రాంతంలో లాంగ్ ఆర్మ్ సహాయంతో కాలువలో పేరుకుపోయిన పూడిక, గుర్రపుడెక్కులు, కలుపు మొక్కలు, తేలియాడే వ్యర్థాలను తొలగించే పనులను చేపడుతున్నారు. అలాగే ప్రతిరోజూ బోట్ల సహాయంతో కాలువలో తేలియాడే చెత్త, ప్లాస్టిక్ వ్యర్థాలు మరియు ఇతర అవాంఛనీయ పదార్థాలను తొలగిస్తూ నీటి ప్రవాహానికి ఎలాంటి ఆటంకం కలగకుండా చర్యలు తీసుకుంటున్నారని బయాలజీ అన్నారు.
వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని కాలువలో నీటి ప్రవాహాన్ని మెరుగుపరచడం, వరద ముప్పును తగ్గించడం లక్ష్యంగా ఈ పనులను నిరంతర పర్యవేక్షణలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రజలు కూడా కాలువల్లో చెత్త వేయకుండా నగర పరిశుభ్రతకు సహకరించాలని బయాలజిస్ట్ సూర్య కుమార్ నాయక్ విజ్ఞప్తి చేశారు.
Prajavartha Online Telugu News