Breaking News

చీఫ్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ సేవలు అభినందనీయం

-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ నగరపాలక సంస్థ చీఫ్ మెడికల్ హెల్త్ ఆఫీసర్‌గా డాక్టర్ కె. అర్జునరావు అందించిన సేవలు ప్రశంసనీయమని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అన్నారు. సాధారణ బదిలీలలో భాగంగా సివిల్ సర్జన్ డాక్టర్ కె. అర్జునరావు ఆంధ్రప్రదేశ్ వైద్య, ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖలో జాయింట్ డైరెక్టర్ (కమ్యూనికేబుల్ డీజీసెస్ కంట్రోల్ ప్రోగ్రాము )గా బదిలీ అయిన సందర్భంగా బుధవారం ఉదయం నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలోని కమిషనర్ ఛాంబర్‌లో ఆయనను శాలువాతో సత్కరించి ఘనంగా అభినందించారు.

ఈ సందర్భంగా కమిషనర్ ధ్యానచంద్ర మాట్లాడుతూ, విజయవాడ నగరపాలక సంస్థలో ప్రజారోగ్య విభాగం నగర పరిపాలనకు వెన్నెముక వంటిదని, ఆ శాఖకు అధిపతిగా డాక్టర్ అర్జునరావు సమర్థవంతమైన నాయకత్వాన్ని అందించారని అన్నారు. నగర పారిశుధ్య నిర్వహణ, దోమల నివారణ చర్యలు, ప్రజారోగ్య సేవల మెరుగుదల, ప్రత్యేక ఆరోగ్య కార్యక్రమాల అమలులో ఆయన చిత్తశుద్ధితో పనిచేసి విశేష ఫలితాలు సాధించారని కొనియాడారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

రొయ్య మేత ధరల తగ్గింపుపై చర్యలు తీసుకోండి

-రూ.100 కోట్లతో ప్రాన్ ప్రొడ్యూసర్స్ కమిటీ ఏర్పాటుకు మద్దతివ్వండి -ఆక్వా ఉత్పత్తుల ఎగుమతులకు సహకరించండి -పొగాకు రైతులను తక్షణం ఆదుకోవాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *