విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
సెంట్రల్ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బోండా ఉమామహేశ్వర రావు ఆశీస్సులతో సెంట్రల్ నియోజకవర్గం పాత గవర్నమెంట్ ప్రసూతి హాస్పిటల్లో ఈరోజు డొక్కా సీతమ్మ చారిటబుల్ ట్రస్ట్ అన్నదాన కార్యక్రమానికి ఉమా అన్నయ్య తనయుడు బోండా రవితేజ అన్నదాన కార్యక్రమాని వచ్చి వడ్డన చేయడం జరిగింది. గత మూడు సంవత్సరాలుగా ఈ డొక్కా సీతమ్మ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా జరిగే అన్నదాన కార్యక్రమానికి స్వయంగా ట్రస్ట్ మెంబర్స్ ఎంతో రుచికరంగా క్వాలిటీ గా వండి ప్రతి ఒక్కరికి ఎంతో అభిమానంగా ప్రేమగా పెట్టడం జరుగుతుంది. నేను అడగగానే ఎంతో అభిమానంతో మేమున్నాము అంటూ, నాకు ధైర్యాన్నిచ్చి నాకు ప్రత్యక్షంగానూ పరోక్షంగానూ సహాయ సహకారాలు అందిస్తున్న ప్రతి ఒక్కరికి డొక్కా సీతమ్మ చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకురాలు, సెంట్రల్ టిడిపి మహిళా అధికార ప్రతినిధి అవుటుపల్లి విజయ కుమారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ట్రస్టు సభ్యులు ఉపాధ్యక్షురాలు గుబ్బల జ్యోతిశ్వరి, కార్య నిర్వహణ అధికారి పల్లా ఉమామహేశ్వరి, కోశాధికారి యర్రోజు అభిలాష్, రాయచూర్ జయరాజు, చెన్నూరి రాణి, పారుమూరి దుర్గ, గిరిజ మొదలైన వారు పాల్గొనడం జరిగింది.
Prajavartha Online Telugu News