Breaking News

మెరుగైన వైద్యం కోసం ఎల్ ఓ సీ అందజేత

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఎం ఎల్ ఏ సుజనా చౌదరి చొరవతో ముఖ్యమంత్రి సహాయనిది నుంచి మంజూరైన ఎల్ ఓ సీ (లెటర్ ఆఫ్ క్రెడిట్) ను ఎన్డీయే కార్యాలయంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి ఆషా, మార్కెట్ యార్డ్ డైరెక్టర్ పితాని పద్మ, కూటమి నేతలు నంద కుమారి,బొల్లేపల్లి కోటేశ్వరరావు, ప్రభు చరణ్ బాధిత కుటుంబ సభ్యులకు అందజేశారు.

46 వ డివిజన్, చిట్టి నగర్ కు చెందిన మేకల వెంకట రమణ (51) గాల్ స్టోన్ సమస్యతో బాధపడుతూ ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఆమెకు మరింత మెరుగైన వైద్యం అందించాలని శస్త్ర చికిత్స చేయాలని తెలపడంతో వైద్యం సాయం కోసం దరఖాస్తు చేసుకోగా మంజూరైన రూ 2 లక్షల 10 వేల విలువైన ఎల్ ఓ సీ ను కూటమి నేతలు అందజేశారు. త్వరితగతిన స్పందించి ఎల్ ఓ సీ ను అందజేసిన ఎం ఎల్ ఏ సుజనా చౌదరి కు బాధిత కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

రొయ్య మేత ధరల తగ్గింపుపై చర్యలు తీసుకోండి

-రూ.100 కోట్లతో ప్రాన్ ప్రొడ్యూసర్స్ కమిటీ ఏర్పాటుకు మద్దతివ్వండి -ఆక్వా ఉత్పత్తుల ఎగుమతులకు సహకరించండి -పొగాకు రైతులను తక్షణం ఆదుకోవాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *