Breaking News

రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలల్లో ఘనంగా ప్రపంచ యువ నైపుణ్యాల దినోత్సవ వేడుకలు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 2992 వృత్తి విద్య పాఠశాలల్లో బుధవారం “ప్రపంచ యువ నైపుణ్యాల దినోత్సవం” (World Youth Skills Day) వేడుకలు ఘనంగా నిర్వహించారు. సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులలో మార్కెట్ అవసరాలకు తగిన నైపుణ్యాలు, స్వయం ఉపాధి మరియు వ్యాపార ఆలోచనలను (Entrepreneurship) పెంపొందించడం తదితర అంశాలపై అతిథులు ప్రసంగించారు. ‘స్కిల్ ఫర్ ఏ షేర్డ్ ఫ్యూచర్’’ అంశంపై క్విజ్ పోటీలు, రోల్ ప్లే, “నా ట్రేడ్ – నా కల” డ్రాయింగ్ పోటీలు, కెరీర్ గైడెన్స్, గ్యాలరీ వాక్ నిర్వహించారు.
సందర్శించిన అధికారులు
-సమగ్ర శిక్ష ఏఎస్పీడీ డా. ఎం.ఆర్.ప్రసన్నకుమార్, సూపరిండెంట్ సాయి ఎన్టీఆర్ జిల్లా విజయవాడలోని కేబీసీ బాయ్స్ హైస్కూలును సందర్శించి విజేతలకు బహుమతులు పంపిణీ చేశారు.
-స్టేట్ జీసీడీవో వి.ఎస్.ఎన్.మూర్తి తో పాటు లాహీ సంస్థ నుండి వి.దీపికరాణి ఏలూరు జిల్లా Z.P. హైస్కూల్, కొవ్వలి, గోపన్నపాలెం పాఠశాలల్లో ఆటోమోటివ్, BFSI, అగ్రికల్చర్ ట్రేడ్, ఎలక్ట్రానిక్స్ ల్యాబ్‌లను సందర్శించి విద్యార్థులతో ముచ్చటించారు.
-లెండ్ ఎ హాండ్ ఇండియా (లాహీ) సంస్థ నుండి సుశాంత్ రాజ్ గన్నవరం ZP గర్ల్స్ హైస్కూల్లో ‘బ్యూటీ & వెల్‌నెస్’ ట్రేడ్ విద్యార్థులతో మాట్లాడి, వారికి నైపుణ్య విద్యా అవకాశాలపై అవగాహన కల్పించారు. విజేతలకు సర్టిఫికెట్లు పంపిణీ చేశారు.
-ఒకేషనల్ విభాగం నుండి సి.శ్రీలత, యు.ఉషారాణి, దివ్యశ్రీ బాపట్ల జిల్లా ఈపురుపాలెం ZPHS గర్ల్స్ హైస్కూల్ సందర్శించి విజేతలకు సర్టిఫికెట్లు పంపిణీ చేశారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

రొయ్య మేత ధరల తగ్గింపుపై చర్యలు తీసుకోండి

-రూ.100 కోట్లతో ప్రాన్ ప్రొడ్యూసర్స్ కమిటీ ఏర్పాటుకు మద్దతివ్వండి -ఆక్వా ఉత్పత్తుల ఎగుమతులకు సహకరించండి -పొగాకు రైతులను తక్షణం ఆదుకోవాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *