-వర్షాలు లేని సమయంలో కూడా కృష్ణ డెల్టాకు నీళ్ల అందించిన విజనరీ లీడర్ చంద్రబాబు
-1300 కోట్లు తో 11 నెలల సమయంలో 13 లక్షల ఎకరాలకు నీరు ఇచ్చిన ప్రాజెక్ట్ పట్టిసీమ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గం ఇబ్రహీంపట్నం ప్రాంతంలోని కృష్ణ గోదావరి పవిత్ర సంగమం వద్ద కృష్ణా నదికి వైభవంగా జలహారతి ఇచ్చారు సీఎం చంద్రబాబు ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు తో పాటు మంత్రి రామానాయుడు మంత్రి అనగాని సత్యప్రసాద్ మంత్రి సత్య కుమార్ యాదవ్, విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని చిన్ని, ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ ( తాతయ్య), జిల్లా కలెక్టర్ లక్ష్మీషా, సీనియర్ ఐఏఎస్ శశిభూషణ్ కుమార్, టిడిపి జిల్లా పార్టీ అధ్యక్షురాలు గద్దె అనురాధ, మాజీ మంత్రి దేవినేని ఉమ తదితరులు పాల్గొన్నారు
ఈ సందర్భంగా ఎంపీ కేశినేని చిన్ని మాట్లాడుతూ పట్టిసీమ ప్రాజెక్టు ద్వారా గోదావరి జలాలు కృష్ణమ్మ చెంతకు చేరి కృష్ణా డెల్టాను సస్యశ్యామలం చేయడానికి కూటమి సర్కార్ కృషి చేసింది అని అన్నారు. వర్షాలు లేని సమయంలో కూడా కృష్ణ డెల్టా కు నీళ్ళు అందించిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబుదేనని తెలిపారు.1300 కోట్లతో 11 నెలల సమయంలో 13 లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చిన విజనరీ లీడర్ చంద్రబాబు అని అన్నారు. శ్రీశైలం నాగార్జునసాగర్ లకు నీటి ప్రవాహం తగ్గినప్పటికీ పట్టిసీమ ద్వారా వస్తున్న గోదావరి జలాలు డెల్టా రైతులకు అండగా నిలిచేలా కృషిచేసిన మహానుభావుడు చంద్రబాబు అని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ కు ఏదైనా బ్రాండ్ ఉంది అంటే అది సిబిఎన్ బ్రాండ్ అని ఎంపీ చిన్ని అన్నారు. చంద్రబాబు చేతుల మీదగానే గతంలో పులిచింతల ఇప్పుడు పట్టిసీమ రాబోయే రోజుల్లో చింతలపూడి కూడా ప్రారంభమవుతుందని ధీమా వ్యక్తం చేశారు కృష్ణా జలాలు సద్వినియోగం చేసుకునే అవకాశం చంద్రబాబు వల్లనే సాధ్యపడిందని తెలిపారు
కృష్ణ గోదావరి జలాలు సద్వినియోగం చేసుకున్న ఏకైక వ్యక్తి సీఎం చంద్రబాబెనని అన్నారు. గోదావరి కృష్ణ కలిపిన వ్యక్తి దేశంలో ఎవరైనా ఉన్నారంటే అది చంద్రబాబె అని తెలిపారు. మావిగన్ అని ముసలి కన్నీరు కార్చే వారికి ప్రజల గతంలోనే తగిన బుద్ధి చెప్పిన ఇప్పటికీ అదే విధానంలో వెళ్తున్నారని ప్రజలు మళ్ళీ బల్లగుద్ది చెప్తున్నది ఒకే ఒక్క అంశం అమరావతి ఈ రాష్ట్రానికి ఏకైక రాజధాని అని అది జీర్ణించుకోలేక మావిగన్ అంటూ ఏదేదో మతిలేని మాటలు మాట్లాడుతున్నారని విమర్శించారు.నందిగామ జగ్గయ్యపేట ప్రాంతం నుంచి చిలకలూరిపేట వరకు అంత రాజధాని ప్రాంతమేనని ఆయన అన్నారు ఈ రాజధాని ప్రాంతంలో ఉన్న మా బిడ్డలకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు వస్తున్నాయి అంటే అది ముఖ్యమంత్రి చంద్రబాబు దార్శనికత మరియు చొరవ మాత్రమేనని అన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు చేసే ప్రయత్నంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యలుగా మారి ఎంతో కొంత తోడ్పాటును అందించేందుకు సిద్ధంగా ఉన్నారని ముసలి కన్నీరు కార్చే వారి మాటలు ఎవరు నమ్మే పరిస్థితిలో లేరని ఎంపీ చిన్ని స్పష్టం చేశారు.
Prajavartha Online Telugu News