Breaking News

ముంబయి ఆసుపత్రి నుంచి పవన్ కళ్యాణ్ డిశ్చార్జ్

-హైదరాబాద్ లోని నివాసానికి చేరుకోనున్న ఉప ముఖ్యమంత్రివర్యులు
-వైద్యుల సూచన మేరకు మూడు వారాల తరువాత నుంచి ఫిజియోథెరపీ

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
ముంబయిలోని కోకిలాబెన్ ధీరూభాయ్ అంబానీ ఆసుపత్రిలో కుడి భుజానికి శస్త్ర చికిత్స చేయించుకున్న రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యణ్ కొద్దిసేపటి క్రితం ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. శస్త్ర చికిత్స నుంచి కోలుకుంటున్న ఆయన డిశ్చార్జ్ అనంతరం నేరుగా హైదరాబాద్ లోని తన నివాసానికి చేరుకుంటారు. మూడు వారాల తరువాత నుంచి ఫిజియోథెరపీ చేయించుకోవాలని వైద్యులు సూచించారు. ఆపరేషన్ చేసిన భుజం సాధారణ స్థితికి చేరుకోవడానికి నాలుగు నెలల సమయం పడుతుందని వైద్యులు వెల్లడించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

రొయ్య మేత ధరల తగ్గింపుపై చర్యలు తీసుకోండి

-రూ.100 కోట్లతో ప్రాన్ ప్రొడ్యూసర్స్ కమిటీ ఏర్పాటుకు మద్దతివ్వండి -ఆక్వా ఉత్పత్తుల ఎగుమతులకు సహకరించండి -పొగాకు రైతులను తక్షణం ఆదుకోవాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *