-జనసేన మైనార్టీ నాయకులు గయాసుద్దీన్ హామీ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
స్థానిక 40 వ డివిజన్ బాల భాస్కర నగర్ వద్ద నిర్మాణంలో ఉన్న వారాహి అమ్మవారి ఆలయం అభివృద్ధికి తన వంతు సహకారం అందిస్తానని జనసేన పార్టీ మైనార్టీ నాయకులు షేక్ గయాసుద్దీన్ (ఐజా) హామీ ఇచ్చారు. బుధవారం స్థానికుల అభ్యర్థన మేరకు వారాహి అమ్మవారి గుడి నిర్మాణ ప్రాంతాన్ని ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా స్థానికులు ఆయనను శ్రీ వారాహి అమ్మ వారి దేవస్థానం నిర్మాణానికి సహకారం అందించవలసిందిగా కోరారు. దీనిపై స్పందించిన గయాసుద్దీన్ మాట్లాడుతూ వారాహి అమ్మవారి దేవస్థానం నిర్మాణానికి తన వంతు సహకారం అందిస్తానని చెప్పారు.
Prajavartha Online Telugu News