Breaking News

ఉత్త‌మ ఫొటోగ్రాఫ‌ర్ల‌కు జిల్లాస్థాయి పుర‌స్కారాలు

– మూడు విభాగాల్లో ప్ర‌పంచ ఫొటోగ్ర‌ఫీ డే పోటీలు
– ఎంట్రీలు పంపేందుకు చివ‌రితేదీ ఆగస్టు 5
– జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ‌

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రతి ఫ్రేమ్ ఒక జ్ఞాపకం.. కాలం మరచిపోయినా… ఫొటో మాత్రం ఆ క్షణాన్ని సజీవంగా ఉంచుతుంది. మ‌ధుర క్ష‌ణాల‌ను శాశ్వతం చేసే ఫొటోగ్ర‌ఫీలో విశేష ప్ర‌తిభ‌క‌న‌బ‌రిచిన ఫొటోగ్రాఫ‌ర్ల‌కు ఆగస్ట్ 19 న ప్ర‌పంచ ఫొటోగ్ర‌ఫీ దినోత్స‌వం సంద‌ర్భంగా జిల్లాస్థాయిలో పుర‌స్కారాలు ప్ర‌దానం చేయ‌నున్న‌ట్లు జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ తెలిపారు.
ప్ర‌పంచ ఫొటోగ్ర‌ఫీ సంద‌ర్భంగా నిర్వ‌హించే పోటీల‌కు సంబంధించిన పోస్ట‌ర్ల‌ను క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ సమాచార శాఖ అధికారులు, ఫొటో జ‌ర్న‌లిస్టుల‌తో క‌లిసి గురువారం క‌లెక్ట‌రేట్‌లో ఆయన ఛాంబర్ నందు ఆవిష్క‌రించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ ఎన్‌టీఆర్ జిల్లా ప‌రిధిలోని ఫోటో జర్నలిస్టులు, ఔత్సాహిక ఫోటోగ్రాఫర్లు, స్టూడియో ఫొటోగ్రాఫ‌ర్లు పోటీల్లో పాల్గొనవచ్చున‌ని.. ఫొటోగ్రాఫ‌ర్లు ఆగస్టు 5వ తేదీలోగా త‌మ ఎంట్రీలు పంపాల్సి ఉంటుంద‌న్నారు. మూడు విభాగాల్లో పోటీలు నిర్వ‌హించ‌నున్నామ‌ని.. మొద‌టి విభాగంలో జిల్లాకు సంబంధించి ఆంధ్ర‌ప్ర‌దేశ్ వార‌స‌త్వం, ప‌ర్యాట‌కం, సంస్కృతి అంశాల్లో ఫొటో ఎంట్రీలు పంపొచ్చ‌న్నారు. రెండో విభాగంలో యువ‌త‌, పీ4, ఆర్థికాభివృద్ధి-సంక్షేమం అంశాలు, మూడో విభాగంలో అత్యుత్త‌మ న్యూస్ ఫొటో పోటీ ఉంటుంద‌న్నారు. ప్ర‌తి విభాగంలో ప్ర‌థ‌మ బహుమతి గా రూ. 10 వేలు,ద్వితీయ బహుమతి కింద రూ. 7 వేలు తృతీయ బహుమతి గా రూ. 4 వేలు నగదు బ‌హుమ‌తుల‌తో పాటు రూ. 2 వేలు చొప్పున ఆరుగురికి ప్రోత్సాహ‌క నగదు బ‌హుమ‌తులు అందించ‌నున్న‌ట్లు వివ‌రించారు. ఒక ఫొటోగ్రాఫ‌ర్ ఒక విభాగం నుంచి మూడు ఫొటోలు, అదేవిధంగా మొత్తం మూడు విభాగాల నుంచి తొమ్మిది ఫొటోలు పంప‌వ‌చ్చ‌న్నారు. 2025, జూన్ 12 నుంచి 2026, జులై 31 మ‌ధ్య తీసిన ఫొటోలై ఉండాల‌ని.. ఫొటో సైజు 12X10 ఉండాల‌ని, ఫొటోలు ఎన్‌టీఆర్ జిల్లాలో మాత్ర‌మే తీసి, ప‌బ్లిసిటీకి మాత్ర‌మే ఉప‌యోగించేవిగా ఉండాల‌ని వివ‌రించారు. వాట‌ర్ మార్క్‌, మార్ఫింగ్ వంటి వాటిని అనుమ‌తించ‌డం జ‌ర‌గ‌దని.. ఉత్త‌మ ఫొటోల ఎంపిక విష‌యంలో న్యాయ‌నిర్ణేత‌ల‌దే తుది నిర్ణ‌యమ‌ని తెలిపారు.ఒరిజిన‌ల్ ఫొటో ఎంట్రీల‌ను డీపీఆర్‌వో కార్యాల‌యం, స్టేట్ గెస్ట్ హౌస్‌, విజ‌య‌వాడ‌-520002 చిరునామాకు నేరుగా లేదా పోస్ట‌ల్ ద్వారా స‌మ‌ర్పించ‌వచ్చన్నారు.
ఇతర వివరాలకు కె.రవి, డివిజ‌న‌ల్ పీఆర్‌వో (9010156550)ను సంప్రదించాలని కలెక్టర్ సూచించారు.
కార్య‌క్ర‌మంలో సమాచార శాఖ డీఐపీఆర్వో కేవీ ర‌మ‌ణ‌రావు, డీపీఆర్‌వో టి.నాగేశ్వ‌ర‌రావు, డివిజ‌న‌ల్ పీఆర్‌వో కె.ర‌వి, విశ్రాంత ఎ వి సూపర్వైజర్ వీవీ ప్ర‌సాద్‌, ఫొటో జ‌ర్న‌లిస్టులు సీహెచ్ విజ‌య‌భాస్క‌ర్‌, సీహెచ్ నారాయ‌ణ‌రావు, కేవీఎస్ గిరి, జీఎన్ రావు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

రొయ్య మేత ధరల తగ్గింపుపై చర్యలు తీసుకోండి

-రూ.100 కోట్లతో ప్రాన్ ప్రొడ్యూసర్స్ కమిటీ ఏర్పాటుకు మద్దతివ్వండి -ఆక్వా ఉత్పత్తుల ఎగుమతులకు సహకరించండి -పొగాకు రైతులను తక్షణం ఆదుకోవాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *