Breaking News

జే పీ అపార్ట్మెంట్ లో నెలకొన్న డ్రైనేజీ సమస్యను పరిష్కరిస్తాం…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
పాత రాజరాజేశ్వరి పేట లోని ,జేపీ అపార్ట్ మెంట్ లో నెలకొన్న డ్రైనేజీ సమస్యను పరిష్కరిస్తామని పశ్చిమ ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్ అన్నారు. ఎమ్మెల్యే సుజనా చౌదరి ఆదేశాలతో జేపీ అపార్ట్మెంట్స్ వాసుల విజ్ఞప్తి మేరకు అప్రాంతంలో పొంగిపొర్లుతున్న డ్రైనేజీలను శుక్రవారం
ఈ ఈ శ్రీనివాస్, విఎంసి ఇంజనీరింగ్ అధికారులు టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి షేక్ రఫీ, క్లస్టర్ ఇన్చార్జ్ ధనేకుల వెంకట సుబ్బారావు, టీడీపీ డివిజన్ అధ్యక్షుడు పెద్దిన శ్యామ్ సుందర్ తదితరులతో కలిసి ప్రత్తిపాటి శ్రీధర్ పరిశీలించారు.

స్థానికులతో మాట్లాడారు జేపీ అపార్ట్మెంట్లో నెలకొన్న టెక్నికల్ సమస్యను పరిష్కరించడానికి తీసుకోవలసిన చర్యల గురించి ఈ ఈ శ్రీనివాస్ తో చర్చించారు. డ్రైనేజీ సమస్యను త్వరితగతిన పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే సుజనా చౌదరి ఈ ప్రాంతంలో సీ సీ రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీల నిర్మాణం చేపట్టారని పశ్చిమ అభివృద్ధికి కట్టుబడి ఉన్నారని తెలిపారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

రొయ్య మేత ధరల తగ్గింపుపై చర్యలు తీసుకోండి

-రూ.100 కోట్లతో ప్రాన్ ప్రొడ్యూసర్స్ కమిటీ ఏర్పాటుకు మద్దతివ్వండి -ఆక్వా ఉత్పత్తుల ఎగుమతులకు సహకరించండి -పొగాకు రైతులను తక్షణం ఆదుకోవాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *