Breaking News

సమస్యల పరిష్కారమే ప్రజా దర్బార్ లక్ష్యం..

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రజా సమస్యలు నేరుగా తెలుసుకుని వాటిని పరిష్కరించేందుకే ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నామని 40 వ డివిజన్ టీడీపీ, బీజేపీ అధ్యక్షులు పీవీ చిన సుబ్బయ్య, నక్కిట్ల రాజా అన్నారు. ఎమ్మెల్యే సుజనా చౌదరి ఆదేశాలతో కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్, కూటమి నేతలతో కలిసి భవానిపురం ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ నిర్వహించారు. ప్రజలు వివిధ సమస్యలపై వినతులు సమర్పించారు. వచ్చిన అర్జీలను స్వయంగా పరిశీలించి అక్కడికక్కడే సంబంధిత శాఖల అధికారులతో ఫోన్ లో మాట్లాడి సమస్యను పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నారు. రాజకీయాలకతీతంగా , ప్రజాసేవే ధ్యేయంగా ప్రజా సమస్యలు నేరుగా తెలుసుకుని పరిష్కరిస్తున్నామని 40వ డివిజన్ టీడీపీ అధ్యక్షుడు పీవీ చిన సుబ్బయ్య, బీజేపీ అధ్యక్షుడు నక్కిట్ల రాజా అన్నారు.

మాజీ కార్పొరేటర్ పైడిమాల సుభాషిణి, కూటమి నేతలు కామ దేవరాజ్, కొప్పుల గంగాధర్, పోతిన భేసు కంఠేశ్వరుడు బొల్లేపల్లి కోటేశ్వరరావు, బొడ్డుపల్లి శ్రీనివాసరావు, పట్నాల హరిబాబు తదితరులు పాల్గొని ప్రజల నుంచి వినతులు స్వీకరించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

రొయ్య మేత ధరల తగ్గింపుపై చర్యలు తీసుకోండి

-రూ.100 కోట్లతో ప్రాన్ ప్రొడ్యూసర్స్ కమిటీ ఏర్పాటుకు మద్దతివ్వండి -ఆక్వా ఉత్పత్తుల ఎగుమతులకు సహకరించండి -పొగాకు రైతులను తక్షణం ఆదుకోవాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *