గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
గుంటూరు నగరంలో ప్రజా సౌకర్యార్ధం ప్రధాన రోడ్లు, డ్రైన్లు, ఫుట్ పాత్ లపై ఆక్రమణల తొలగింపు చేపట్టామని, ఆక్రమణదారులు స్వచ్చందంగా తొలగించుకోవాలని, లేకుంటే తొలగింపులో జరిగే నష్టానికి వారే భాధ్యత వహించాలని నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ స్పష్టం చేశారు. శుక్రవారం కమిషనర్ ఆదేశాల మేరకు పట్టణ ప్రణాళిక అధికారులు, కార్యదర్శులు నగరంలోని పట్టాభిపురం, కొరెటెపాడు రింగ్ రోడ్ ల్లోని పలు ప్రాంతాల్లో ఆక్రమణల తొలగించారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరంలో ట్రాఫిక్ సమస్య, వర్షాల వలన వచ్చే నీరు ఆక్రమణల కారణంగా డ్రైన్లలోకి వెళ్లడానికి వీలు లేక రోడ్ల మీద ఉంటుందన్న వివిధ ప్రజా సంఘాలు, ప్రజల నుండి అందిన ఫిర్యాదుల మేరకు ప్రధాన రోడ్లు, డ్రైన్ల మీద ఆక్రమణల తొలగింపు చేపట్టామనన్నారు. ప్రజలు ఇబ్బందులు పడే అవకాశం ఉన్నందున ఆక్రమణలను స్వచ్చందంగా తొలగించుకోవాలని, తొలగించుకోని వాటిని నగరపాలక సంస్థ అక్రమ ఆక్రమణల నిర్మూలణ దళం తొలగిస్తుందన్నారు. ఆక్రమణల తొలగింపు నిరంతర ప్రక్రియగా చేపట్టాలని, తొలగించిన వాటి వివరాలను రోజువారీ నివేదిక ఇవ్వాలని పట్టణ ప్రణాళిక అధికారులకు స్పష్టం చేశామన్నారు. ప్రజా సౌకర్యార్ధం ఆక్రమణదారులు నగరపాలక సంస్థకు సహకరించి, ఆక్రమణలను స్వచ్చందంగా తొలగించుకోవాలని కోరారు.
Prajavartha Online Telugu News