Breaking News

ఈ నెల 20 నుండి నగరంలో కమర్షియల్ వ్యర్ధాల సేకరణ ఏజన్సీలు రద్దు… కమిషనర్ మయూర్ అశోక్

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు గుంటూరు నగరంలో షాప్స్, హోటల్స్, ఇతర వ్యాపార, వాణిజ్య సంస్థల నుండి చెత్త సేకరణ చేసి, ఫీజులు వసూళ్లు చేసే క్యూబ్ ఎనర్జీ, రామసేతు ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంస్థల కమర్షియల్ గార్బేజ్ సేకరణ, యూజర్ చార్జీల వసూళ్ల అనుమతులు ఈ నెల 20వ తేదీ నుండి రద్దు చేస్తున్నామని, అప్పటి నుండి చెత్త సేకరణ ఫీజులు ఎవ్వరికీ ఇవ్వాల్సిన అవసరం లేదని నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, గుంటూరు నగరపాలక సంస్థకు త్వరలో 2 వందల ఈ-ఆటోలు అందుబాటులోకి రానున్నాయని, వాటి ద్వారా నగరంలో ప్రతి వార్డ్ లో నూరు శాతం చెత్త సేకరణకు ప్రణాళిక సిద్దం చేశామని తెలిపారు. ఆటోలు అందుబాటులోకి వచ్చే వరకు డివిజన్ల వారీగా శానిటరీ ఇన్స్పెక్టర్లు కమర్షియల్ సంస్థల నుండి వ్యర్ధాలను రోజువారీగా డిపార్ట్మెంటల్ సేకరణకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కనుక నగరంలోని వ్యాపార, వాణిజ్య సంస్థలు ఈ నెల 20వ తేదీ నుండి వ్యర్ధాల సేకరణకు ఎవ్వరికీ, ఎటువంటి ఫీజులు చెల్లించాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

రొయ్య మేత ధరల తగ్గింపుపై చర్యలు తీసుకోండి

-రూ.100 కోట్లతో ప్రాన్ ప్రొడ్యూసర్స్ కమిటీ ఏర్పాటుకు మద్దతివ్వండి -ఆక్వా ఉత్పత్తుల ఎగుమతులకు సహకరించండి -పొగాకు రైతులను తక్షణం ఆదుకోవాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *