Breaking News

ఆంధ్రప్రదేశ్లోని చీరాలలో ప్రతిష్ఠాత్మక నోవోటెల్ బీచ్ ప్రంట్ హోటల్ ప్రాజెక్టుకు అకోర్ – శ్రీ భ్రమర గ్రూప్ ఒప్పందం

-రూ.250 కోట్ల ప్రీమియం బీచ్ ప్రంట్ అభివృద్ధి ప్రాజెక్టుతో ఆంధ్రప్రదేశ్ తీరప్రాంత పర్యాటక, ఆతిథ్య రంగాలకు కొత్త ఊపు

న్యూఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్లో వేగంగా అభివృద్ధి చెందుతున్న పర్యాటక రంగంలో మరో కీలక మైలురాయిగా, ప్రపంచ ప్రఖ్యాత హాస్పిటాలిటీ సంస్థ అకోర్ (Accor) మరియు శ్రీ భ్రమర గ్రూప్ సంయుక్తంగా చీరాల సమీపంలోని గవినివారిపాలెంలో బంగాళాఖాతం తీరాన ప్రీమియం నోవోటెల్ బీచ్ ప్రంట్ హోటల్ అభివృద్ధి కోసం వ్యూహాత్మక భాగస్వామ్య ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి.

ఈ బ్రాండ్ సంతకం కార్యక్రమం 2026 జూలై 17న న్యూఢిల్లీలోని పుల్మస్ హోటల్లో ఘనంగా నిర్వహించబడింది. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ తీరప్రాంతంలో అంతర్జాతీయ బ్రాండ్తో నిర్మితమవుతున్న అతిపెద్ద హాస్పిటాలిటీ ప్రాజెక్టులలో ఒకటికి అధికారికంగా శ్రీకారం చుట్టబడింది.

సుమారు రూ.250 కోట్ల పెట్టుబడితో చేపట్టనున్న ఈ ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్ పర్యాటక రంగంపై పెట్టుబడిదారుల విశ్వాసాన్ని ప్రతిబింబించడమే కాకుండా, ప్రపంచ స్థాయి తీరప్రాంత పర్యాటక కేంద్రాలను అభివృద్ధి చేయాలనే రాష్ట్ర ప్రభుత్వ దృష్టికి అనుగుణంగా రూపుదిద్దుకుంటోంది. ఈ ప్రాజెక్టు ఉపాధి అవకాశాల సృష్టి, ప్రైవేట్ పెట్టుబడుల ఆకర్షణ, స్థిరమైన ఆర్థికాభివృద్ధికి దోహదం చేయనుంది.

ఆంధ్రప్రదేశ్ తీరంలో మరో ప్రతిష్ఠాత్మక మైలురాయి
చీరాల సమీపంలోని గవినివారిపాలెంలో 3.15 ఎకరాల విస్తీర్ణంలో సముద్ర తీరాన నిర్మించబడనున్న ఈ నోవోటెల్ హోటల్ కు బంగాళాఖాతం యొక్క అద్భుతమైన సముద్ర దృశ్యాలు అందుబాటులో ఉంటాయి. గుంటూరు, విజయవాడ, బాపట్ల, ఒంగోలు తదితర ప్రధాన నగరాలకు రహదారి, రైల్వే మరియు సమీప విమానాశ్రయాల ద్వారా ఉత్తమ రవాణా సౌకర్యం కలదు.

విస్తారమైన సముద్ర తీరం, సహజ సౌందర్యంతో చీరాల ఆంధ్రప్రదేశ్లో ప్రముఖ విహార పర్యాటక కేంద్రంగా వేగంగా ఎదుగుతోంది. పర్యాటక మౌలిక సదుపాయాల అభివృద్ధిపై రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక దృష్టితో ఈ ప్రాంతం ప్రీమియం హోటళ్లు, డెస్టినేషన్ వెడ్డింగ్స్, అంతర్జాతీయ సదస్సులు, వినోద పర్యాటకానికి అనువైన కేంద్రంగా రూపుదిద్దుకుంటోంది.

నోవోటెల్ చీరాల బీచ్ ప్రంట్ ఈ ప్రాంతాన్ని జాతీయ పర్యాటక పటంలో నిలబెట్టడంతో పాటు స్థానిక సామాజిక, ఆర్థికాభివృద్ధికి దీర్ఘకాలిక ప్రయోజనాలను అందించే ప్రధాన ప్రాజెక్టుగా అవతరించనుంది.

ప్రపంచ స్థాయి హాస్పిటాలిటీ కేంద్రం
ఈ హోటల్లో సుమారు 225-250 ఆధునిక గదులు మరియు సూట్లు అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా నిర్మించబడనున్నాయి.

ప్రాజెక్టులో ప్రధానంగా:
-బహుళ ప్రత్యేక రెస్టారెంట్లు మరియు ఆల్-డే డైనింగ్ సౌకర్యాలు
-అత్యాధునిక బాత్రూమ్ మరియు కాన్ఫరెన్స్ హాళ్లు
-స్విమ్మింగ్ పూల్, స్పా మరియు వెల్నెస్ సెంటర్
-పూర్తిస్థాయి ఫిట్నెస్ సెంటర్
-సుందరంగా అభివృద్ధి చేసిన బీచ్ ప్రంట్ వినోద ప్రదేశాలు
-ప్రీమియం అతిధి సౌకర్యాలు మరియు విశాల పార్కింగ్

ఈ హోటల్ విశ్రాంతి పర్యాటకులు, వ్యాపార ప్రయాణికులు, కుటుంబ విహారయాత్రలు, డెస్టినేషన్ వెడ్డింగ్స్ మరియు అంతర్జాతీయ సమావేశాలకు అనువైన ప్రీమియం కేంద్రంగా అభివృద్ధి చేయబడుతోంది.

ఈ ప్రాజెక్టు ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి అవకాశాలను విస్తృతంగా సృష్టించడంతో పాటు స్థానిక ఆర్ధిక వ్యవస్థను బలోపేతం చేయడం, వ్యవస్థాపకతను ప్రోత్సహించడం మరియు రాష్ట్ర పర్యాటక రంగానికి మరింత ఊతమివ్వనుంది.

శ్రీ భ్రమర గ్రూప్ దూరదృష్టి
ఈ ప్రాజెక్టును ఆంధ్రప్రదేశ్లో ప్రముఖ రియల్ ఎస్టేట్ మరియు మౌలిక సదుపాయాల సంస్థ అయిన శ్రీ భ్రమర గ్రూప్ అభివృద్ధి చేస్తోంది. నాణ్యమైన నివాస, వాణిజ్య మరియు సమగ్ర అభివృద్ధి ప్రాజెక్టులను విజయవంతంగా అమలు చేసిన సంస్థగా ఇది గుర్తింపు పొందింది.

తన హాస్పిటాలిటీ విభాగమైన శ్రీ భ్రమర రిసార్ట్స్ ద్వారా స్థిరమైన అభివృద్ధి, అత్యుత్తమ నిర్మాణ నైపుణ్యం మరియు ప్రపంచ స్థాయి అతిథి సేవలను సమన్వయం చేస్తూ అంతర్జాతీయ ప్రమాణాల పర్యాటక కేంద్రాలను నిర్మించడమే సంస్థ లక్ష్యం.

ఈ సందర్భంగా శ్రీ భ్రమర గ్రూప్ చైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్ గల్లా రామచంద్రరావు మాట్లాడుతూ:

“నోవోటెల్ చీరాల బీచ్ ప్రంట్ ఒప్పందం మా ప్రయాణంలో ఒక చారిత్రాత్మక మైలురాయి. చీరాలకు అపారమైన పర్యాటక సామర్థ్యం ఉంది. ప్రపంచ ప్రఖ్యాత అకోర్ సంస్థతో కలిసి ఈ ప్రాజెక్టును చేపట్టడం మాకు గర్వకారణం. అత్యుత్తమ అతిథి అనుభవాలతో పాటు స్థానిక ఉపాధి, సమాజాభివృద్ధి మరియు రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి ఈ ప్రాజెక్టు దోహదపడుతుంది.”

ఆంధ్రప్రదేశ్ అకోర్ విస్తరణ
ఈ హోటల్ను అకోర్కు చెందిన ప్రపంచ ప్రఖ్యాత నోవోటెల్ బ్రాండ్ నిర్వహించనుంది. ఆసియా-పసిఫిక్, యూరప్, మధ్యప్రాచ్యం, ఆఫ్రికా మరియు అమెరికా దేశాలలో బలమైన గుర్తింపు కలిగిన ఈ బ్రాండ్ ఆధునిక రూపకల్పన, కుటుంబాలకు అనువైన సేవలు, అత్యుత్తమ సమావేశ సదుపాయాలు మరియు అంతర్జాతీయ ప్రమాణాల సేవలకు ప్రసిద్ది చెందింది.

ఈ సందర్భంగా అకోర్ సౌత్ ఆసియా సీఈఓ రంజు అలెక్స్ మాట్లాడుతూ:

“శ్రీ భ్రమర గ్రూప్ ఈ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టులో భాగస్వామ్యం కావడం మాకు ఆనందంగా ఉంది. ఆంధ్రప్రదేశ్ హాస్పిటాలిటీ రంగానికి అపార అవకాశాలు ఉన్నాయి. చీరాల అందమైన సముద్ర తీరం దీనిని ప్రత్యేక పర్యాటక గమ్యస్థానంగా నిలబెడుతోంది. నోవోటెల్ చీరాల బీచ్ ప్రంట్ ద్వారా నాణ్యమైన హాస్పిటాలిటీ సేవలతో పాటు భారతదేశ అభివృద్ధి చెందుతున్న పర్యాటక మార్కెట్ల స్థిరమైన అభివృద్ధికి మేము తోడ్పడతాము.”

వ్యూహాత్మక భాగస్వామ్యం
శ్రీ భ్రమర గ్రూప్ తరపున చైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్ గల్లా రామచంద్రరావు, అకోర్ తరఫున బల్విందర్ సహ్రావత్, వైస్ ప్రెసిడెంట్- బిజినెస్ డెవలప్మెంట్ (ఇండియా & సౌత్ ఆసియా), మరియు సైరస్ మదస్, డైరెక్టర్ డెవలప్మెంట్ ఈ ఒప్పందంపై సంతకాలు చేశారు.

ఈ కార్యక్రమంలో అకోర్ సౌత్ ఆసియా సీఈఓ రంజు అలెక్స్, గుంటూరు ఎమ్మెల్యే గల్లా మాధవి,  భ్రమర గ్రూప్ డైరెక్టర్ (ఆపరేషన్స్) సాగిరాజు యశ్వంత్ ప్రదీప్, డైరెక్టర్ (సివిల్) కమ్మ రవీంద్రబాబు, అలాగే ఏపీపీఎఫ్సీఎస్ లిమిటెడ్ డైరెక్టర్ మరియు ప్రాజెక్టు చీఫ్ కన్సల్టెంట్ & అడ్వైజర్ లక్ష్మీనారాయణ కత్రగడ్డ తదితర ప్రముఖులు పాల్గొన్నారు.

భవిష్యత్తు దిశగా
నిర్మాణం పూర్తయిన అనంతరం నోవోటెల్ చీరాల బీచ్ ప్రంట్ ఆంధ్రప్రదేశ్లో అత్యంత ప్రతిష్టాత్మక హాస్పిటాలిటీ గమ్యస్థానంగా అవతరించి దేశీయ, విదేశీ పర్యాటకులను ఆకర్షించనుంది. రాష్ట్రాన్ని ప్రముఖ తీరప్రాంత పర్యాటక గమ్యస్థానంగా నిలబెట్టడంలో ఈ ప్రాజెక్టు కీలక పాత్ర పోషించనుంది.

ఇది కేవలం ఒక హోటల్ పెట్టుబడి మాత్రమే కాదు; ప్రాంతీయ అభివృద్ధి, ఉపాధి కల్పన, స్థిరమైన పర్యాటకాభివృద్ధికి దోహదపడే అభివృద్ధి ప్రేరక శక్తిగా నిలుస్తుంది. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు దీర్ఘకాలిక విలువను సృష్టించాలనే అకోర్ మరియు శ్రీ భ్రమర గ్రూప్ల ఉమ్మడి సంకల్పానికి ఇది నిదర్శనం.

శ్రీ భ్రమర గ్రూప్ గురించి
శ్రీ భ్రమర గ్రూప్ ఆంధ్రప్రదేశ్కు చెందిన ప్రముఖ రియల్ ఎస్టేట్ మరియు మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ. నివాస, వాణిజ్య మరియు సమగ్ర అభివృద్ధి ప్రాజెక్టులతో పాటు, శ్రీ భ్రమర రిసార్ట్స్ ద్వారా అంతర్జాతీయ ప్రమాణాల పర్యాటక గమ్యస్థానాల అభివృద్ధిలో సంస్థ ముందుకు సాగుతోంది.

అకోర్ మరియు నోవోటెల్ గురించి
అకోర్ ప్రపంచవ్యాప్తంగా 110కి పైగా దేశాలలో వేలాది హోటళ్లను నిర్వహిస్తున్న ప్రముఖ హాస్పిటాలిటీ సంస్థ. నోవోటెల్ అకోర్కు చెందిన ప్రధాన ప్రీమియం మిడిస్కిల్ బ్రాండ్గా ప్రపంచవ్యాప్తంగా ఆధునిక రూపకల్పన, నాణ్యమైన సేవలు, కుటుంబాలకు అనువైన సౌకర్యాలు మరియు అత్యాధునిక వ్యాపార సదుపాయాల ద్వారా విశేష గుర్తింపు పొందింది.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

రొయ్య మేత ధరల తగ్గింపుపై చర్యలు తీసుకోండి

-రూ.100 కోట్లతో ప్రాన్ ప్రొడ్యూసర్స్ కమిటీ ఏర్పాటుకు మద్దతివ్వండి -ఆక్వా ఉత్పత్తుల ఎగుమతులకు సహకరించండి -పొగాకు రైతులను తక్షణం ఆదుకోవాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *