Breaking News

అభివృద్ధి కార్యక్రమాలకు కేరాఫ్ అడ్రస్ గా కూటమి ప్రభుత్వం – ఎంపీ చిన్ని

-తూర్పు నియోజకవర్గంలో 14 కోట్ల తో అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు
-త్వరలో కొండ ప్రాంతాలలో నివాసముంటున్న వారికీ ఇళ్ల పట్టాలు రెగ్యులరైజేషన్
-విజయవాడ తూర్పు నియోజకవర్గం లోని 2,3,4,5 డివిజన్లలో రోడ్డు పనులకు శంకుస్థాపనలు చేసిన ఎంపీ కేశినేని చిన్ని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ తూర్పు నియోజకవర్గం లోని 2,3,4,5 డివిజన్ల లో రోడ్డు పనులకు విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్ మరియు తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ కలిసి రోడ్డు పనులకు శంకుస్థాపనలు చేశారు.

ఈ సందర్భంగా ఎంపీ కేశినేని చిన్ని మాట్లాడుతూ ఈరోజు విజయవాడ తూర్పు నియోజకవర్గం లో 14 కోట్లతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశామని రోడ్లు వేసిన డ్రైనేజీ పనులు చేసిన ఇతర అభివృద్ధి పనులు ఏది చేయాలన్న ఆ పనులు జరగాలన్న ఒక్క తెలుగుదేశం మరియు కూటమి ప్రభుత్వంలోనేనని ఎంపీ చిన్ని అన్నారు. ఈ అభివృద్ధి కార్యక్రమాల విషయంలో ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ తో కలిసి ముఖ్యమంత్రి కార్యాలయమును ఎప్పటికప్పుడు అప్రమత్తం చేసి అభివృద్ధికి కావలసిన నిధులు మంజూరు చేసే విధంగా ఎప్పటికప్పుడు నిరంతర ప్రయత్నం చేస్తూనే ఉన్నామని తెలిపారు. కొండ ప్రాంతంలో ఉన్న ప్రజలకు త్వరలో గొప్ప శుభవార్త చెప్పబోతున్నామని కొండ ప్రాంతాల్లో నివాసం ఉండే ప్రజలకు త్వరలో ఇళ్ల పట్టాలు రెగ్యులరైజ్ చేయబోతున్నామని దీని ద్వారా ఎంతోమంది కొండ ప్రాంత ప్రజలకు మేలు జరగబోతుందని వారి చిరకాల కోరిక తీర్చిన ప్రభుత్వంగా కూటమి సర్కార్ నిలుస్తుందని అన్నారు.

నేడు రాయనపాడు రైల్వే స్టేషన్ కూడా అత్యంత వైభవోపేతంగా కూటమి ప్రభుత్వ సహాయ సహకారాలతో గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ యొక్క లక్ష్యంతో రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు చొరవతో రాయనపాడు రైల్వే స్టేషన్ అభివృద్ధి చేసినట్లు ఎంపీ తెలిపారు వచ్చే మార్చి లేదా ఏప్రిల్ నెలలో గుణదల రైల్వే స్టేషన్ ను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేతుల మీదుగా ప్రారంభించుకుంటామని తెలిపారు త్వరలో రెండు ఆర్వో బీ లు కూడా ప్రారంభిస్తున్నామని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విజయవాడ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని నిర్ణయించుకున్నాయని,పదవిని అనుభవించిన నాయకులు ఈ తూర్పు నియోజకవర్గ ప్రాంతంలో చాలామంది ఉన్న వారు ఎవరు ఈ ప్రాంతం అభివృద్ధిని పట్టించుకోలేదని అన్నారు విజయవాడ ప్రాంతం అనగానే అభివృద్ధి కార్యక్రమాలకు నిధులు మంజూరు అభివృద్ధిలో ముందుండి నడిపిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు

ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ జాస్తి సాంబశివరావు, హైకోర్టు అడ్వకేట్ లీగల్ సెల్ నాయకులు ఎర్నేని వేదవ్యాస్, దేవానంద్, ముమ్మినేని ప్రసాద్, స్థానిక డివిజన్ అధ్యక్షుడు గాబ్రియల్, బచ్చలకూరి అజయ్ కుమార్, సుగసాని రత్న శ్రీకృష్ణ ప్రసాద్ బాబురావు, నర్రా సుబ్బారావు, శ్యాం ప్రసాద్ నాగభూషణం, కిషోర్, షరీఫ్ ఆంజనేయులు, భీమేశ్వరరావు, వంశీకృష్ణ, పూర్ణ, సుధాకర్ కొండ,నాగ శేషు, నాగూర్, దిలీప్,గణేష్ నాగ దుర్గ, తదితరులు పాల్గొన్నారు..

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

రొయ్య మేత ధరల తగ్గింపుపై చర్యలు తీసుకోండి

-రూ.100 కోట్లతో ప్రాన్ ప్రొడ్యూసర్స్ కమిటీ ఏర్పాటుకు మద్దతివ్వండి -ఆక్వా ఉత్పత్తుల ఎగుమతులకు సహకరించండి -పొగాకు రైతులను తక్షణం ఆదుకోవాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *