Breaking News

అతి త్వరలో అమరావతి కి బుల్లెట్ ట్రైన్ – ఎంపీ చిన్ని

-డబల్ ఇంజన్ సర్కార్ పవర్ తో ఏపీకి 75 అమృత్ భారత్ స్టేషన్లు
-హైడ్రోజన్ పవర్ తో నడిచే అత్యాధునిక రైలుతోపాటు రాయనపాడుసహా పలు రైల్వే స్టేషన్ లను వర్చువల్ గా ప్రారంభించిన ప్రధాని మోడీ
-దేశవ్యాప్తంగా 1000 స్టేషన్లను అమృత్ భారత్ కింద అభివృద్ధి చేసే దిశగా ఎన్డీఏ
-కార్యక్రమంలో మంత్రి సత్య కుమార్ యాదవ్, ఎంపీ కేశినేని చిన్ని, ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్, జిల్లా కలెక్టర్ లక్ష్మీ షా, రైల్వే డిఆర్ఎం మోహిత్ సోనోకీయ, రైల్వే ఏడిఆర్ఎం పిఇ ఎడ్విన్, మరియు కూటమి నేతలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు

రాయనపాడు, నేటి పత్రిక ప్రజావార్త :
ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గం రాయనపాడు ప్రాంతం లో అమృత్ భారత్ పథకం కింద ఏర్పాటైన రాయనపాడు శాటిలైట్ రైల్వే స్టేషన్ ను భారత దేశ ప్రధాని నరేంద్ర మోడీ వర్చువల్ గా ప్రారంభించారు ఈ కార్యక్రమంలో, మంత్రి సత్య కుమార్ యాదవ్ ఎంపి కేశినేని చిన్ని మరియు ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ తో కలిసి ముఖ్య అతిథిగా ఎంపీ పాల్గొన్నారు. ముందుగా కార్యక్రమానికి హాజరైన ఎంపీ కేశినేని చిన్నికి రైల్వే అధికారులు ఘన స్వాగతం పలికారు. అనంతరం కార్యక్రమంలో భాగం గా ఏర్పాటు చేసిన పలు సాంస్కృతిక కార్యక్రమాలను ఎంపీ ఇచ్చింది ప్రత్యక్షంగా వీక్షించారు అనంతరం వర్చువల్ గా ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా స్టేషన్ ను ప్రారంభించిన అనంతరం స్టేషన్ లోపల ఏర్పాటు చేసిన టికెట్ కౌంటర్స్ ప్లాట్ఫార్మ్స్ ఏసీ వెయిటింగ్ హాల్స్ ను మంత్రి, ఎమ్మెల్యే రైల్వే అధికారులు, జిల్లా కలెక్టర్ తో కలిసి ఎంపీ చిన్ని పరిశీలించారు.

ఈ సందర్భంగా ఎంపీ చిన్ని మాట్లాడుతూ డబల్ ఇంజన్ సర్కార్ పవర్ ద్వారా ఇవాళ 75 స్టేషన్లు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి చేతుల మీదగా ప్రారంభమవుతున్నాయని
భారతదేశంలో తయారైన హైడ్రోజన్ పవర్ తో నడిచే రైలు కూడా ఇవాళ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఓపెన్ చేయడమేఅన్నిటికన్నా గొప్ప విషయం అని తెలిపారు.సుమారు 1000 అమృత్ భారత్ స్టేషన్లు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చాక 72 స్టేషన్లు ఒక్కఆంధ్రప్రదేశ్ కే వచ్చాయంటే ఆంధ్రప్రదేశ్ కు ఎన్డీఏ గవర్నమెంట్ ఇచ్చే గౌరవం ఏంటో ప్రతి ఒక్కరికి అర్ధమవుతుంది అని అన్నారు.రాయనపాడు అంటేనే రైల్వే వారి వేగన్ వర్క్ షాప్ ఇక్కడ ఉండేది.రాయనపాడు ప్రాంతంలో ఎన్నో రైల్వే లైన్లు వెళతాయి రైల్వే ఉద్యోగులు ఎక్కువగా నివసించే ప్రాంతంగా కూడా ఇదే ఈ ప్రాంతంలో ఒక అమృత్ భారత్ స్టేషన్ 25 కోట్ల రూపాయలతో ఖర్చు పెట్టి ఇవాళ ప్రారంభించడం ఇవాళ ఈ ప్రాంతానికి ఒక వన్నెతెచ్చిన విషయం అని అన్నారు.మంత్రి సహకారంతో నేను ఈ ప్రాంతంలో దాదాపు మూడు ఆర్ఓబిలు ఒక ఆర్ యు బి కూడా తీసుకొచ్చాం

ఈ ప్రాంతమంతా పరిశీలించి నేను స్థానిక ఎమ్మెల్యే కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ ను కలిసి రాయనపాడు ఆర్ఓబి ఈలప్రోలు ఆర్ ఓ బి కొండపల్లి ఎస్టీ కాలనీ ఆర్ యు బి గొల్లపూడి ఆర్ఓబి కూడా తీసుకువచ్చామని రామవరప్పాడు గుణదల, గుణదల్లో రెండు ఆర్ఓబీలు రామవరప్పాడు స్టేషన్ అమృత్ భారత్ స్టేషన్ కావాలని కోరడం జరిగింది అని తెలియచేసారు.విజయవాడ మెయిన్ రైల్వే స్టేషన్ కి 835 కోట్లతో కేంద్ర ప్రభుత్వం అభివృద్ధి చేయాలనుకున్నప్పుడు వైబుల్ గ్యారెంటీ కింద 235 కోట్లు కేంద్ర ప్రభుత్వం రైల్వే శాఖ వారు సహాయంతో మూడుసార్లు టెండర్ వేశారని అయిన ఎవరు ముందుకు రాలేదని అన్నారు.నా పార్లమెంట్లో మూడు రైల్వే స్టేషన్లు అమృత్ భారత్ కింద వెళుతుంది అంటే అంతకంటే మరో అదృష్టం నాకు లేదు అని అన్నారు

కొండపల్లి రైల్వే స్టేషన్ లో త్రాగునీరు ప్లాట్ఫామ్ లు టాయిలెట్స్ సరిగా లేవని డిఆర్ఎమ్ కు తెలిపిన వెంటనే 10 కోట్లు శాంక్షన్ చేయడం జరిగింది అని తెలిపారు.సార్ థాంక్యూ వెరీమచ్ ఫర్ కొండపల్లి కొండపల్లి రైల్వే స్టేషన్ అభివృద్ధికి కూడా ఎమ్మెల్యే తో కలిసి కృషి చేస్తానని హామీ ఇచ్చారు రైళ్ల కనెక్టివిటీ పెంచాలని డిఆర్ఎం ను విజ్ఞప్తి చేస్తున్నట్లు తెలిపారు.గొల్లపూడి నుండి రాయన పాడు వచ్చే రోడ్డు కూడా రైల్వే అధికారులు పరిశీలించి రోడ్డును కూడా బాగు చేయించవలసిందిగా కోరుతున్నాం అని తెలియచేసారు ముఖ్యమంత్రి చంద్రబాబు అనునిత్యం రాష్ట్రం కోసం తప్పించే వ్యక్తి అని మన రాజధాని అమరావతిలో త్వరలో బుల్లెట్ ట్రైన్ ను చూద్దామని ఆశిస్తున్నట్లు తెలిపారు.అతి త్వరలో బుల్లెట్ ట్రైన్ కూడా ఈ ప్రాంతం చూడబోతుంది అని అన్నారు ఈ అన్ని విషయాలపై సహకరిస్తున్న ప్రధాని నరేంద్ర మోడీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

రొయ్య మేత ధరల తగ్గింపుపై చర్యలు తీసుకోండి

-రూ.100 కోట్లతో ప్రాన్ ప్రొడ్యూసర్స్ కమిటీ ఏర్పాటుకు మద్దతివ్వండి -ఆక్వా ఉత్పత్తుల ఎగుమతులకు సహకరించండి -పొగాకు రైతులను తక్షణం ఆదుకోవాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *