Breaking News

నగరంలో గొలగాని ఛారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఘనంగా మెగాస్టార్ పుట్టినరోజు వేడుకలు

విజ‌య‌వాడ‌, నేటి పత్రిక ప్రజావార్త :
నగరంలో గొలగాని ఛారిటబుల్ ట్రస్ట్ చైర్మన్, ప్రవాసాంధ్రుడు గొలగాని రవికృష్ణ ఆధ్వర్యంలో మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు వేడుకలు శనివారం ఘనంగా జరిగాయి. గాంధీనగర్ లోని ఎస్ కే సి వి ట్రస్ట్ ఆధ్వర్యంలోని విద్యార్థులకు అన్నదానం నిర్వహించారు. అలాగే చదువులో ప్రతిభను కనబరిచిన 20 మంది విద్యార్థులకు ఒక్కొక్కరికి 500 రూపాయలు చొప్పున మొత్తంగా 10,000 రూపాయల నగదుపురస్కారాలను అందజేశారు. మెగాస్టార్ చిరంజీవి పేరిట కేక్ ని కట్ చేసి పంపిణీ చేశారు. ఇక్కడి కార్యక్రమంలో చిరంజీవి అభిమాన సంఘం రాష్ట్ర నాయకులు సోడిశెట్టి కృష్ణ ప్రసాద్, లకనం శ్యాంప్రసాద్, ఇల్లూరి సుగుణబాబు, కటికి రాకేష్ నాథ్, రాష్ట్ర చిరంజీవి యువత నాయకులు పాల్గొని మాట్లాడుతూ గొలగాని రవికృష్ణ సామాజిక సేవలను ప్రశంసించారు. ఎస్ కే సి వి ట్రస్ట్ లో లైఫ్ మెంబర్ గా భారీ విరాళాన్ని రవికృష్ణ గతంలో అందజేశారని కొనియాడారు. అలాగే వన్ టౌన్ లోని జరిగిన మరో మెగా ఫాన్స్ కార్యక్రమంలో దివ్యాంగులకు గొలగాని రవికృష్ణ తరుపున జి సి టి ట్రస్టు ప్రతినిధులు 10,000 రూపాయల నగదు అందజేశారు.

 

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ఇంటింటా నెట్‌జీరో… ఆదర్శ గ్రామాలే లక్ష్యం

-ఇంటి నుంచే పర్యావరణ పరిరక్షణకు శ్రీకారం -అలవరం కోడూరులో నెట్‌జీరో విధానాన్ని పరిశీలించిన సీఎం చంద్రబాబు మాడుగుల, నేటి పత్రిక …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *