శ్రీ అభయాంజనేయస్వామివారి దేవస్థానంలో ఘనంగా ద్వితీయ వార్షికోత్సవ వేడుకలు

దుగ్గిరాల, నేటి పత్రిక ప్రజావార్త :
గుంటూరు జిల్లా, దుగ్గిరాలనందు శ్రీ అభయాంజనేయస్వామివారి దేవస్థానం నందు ద్వితీయ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని వేడుకలు ఘనంగా నిర్వహించారు. శుక్రవారం దుగ్గిరాల నుండి విజయవాడ వెళ్ళే మెయిన్‌రోడ్డులో శ్రీ అభయాంజనేయస్వామివారి 42 అడుగుల భారీ విగ్రహం నెలకొల్పబడి రెండు సంవత్సరాలు నిండిన సందర్భంగా ద్వితీయ వార్షికోత్సవ వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా శ్రీ అభయాంజనేయా ట్రస్ట్ అధ్యక్షులు జూటూరి శ్రీను మాట్లాడుతూ విగ్రహ ప్రతిష్టాపన తరువాత ద్వితీయ వార్షికోత్సవ వేడుకల దైవ కార్యక్రమాన్ని అందరి సహకారంతో దిగ్విజయంగా జరగడానికి సహకరించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతాభివందనాలు తెలియజేస్తున్నానని, అందరికీ స్వామివారి కృపాకటాక్షాలు కలగాలని ఆకాంక్షించినట్లు తెలిపారు. భవిష్యత్‌లో మరింత అభివృద్ధి చేసి భక్తులకు అన్ని విధాలు సౌకర్యవంతమైన విధంగా తీర్చిదిద్దే ఆలోచనలో వున్నట్లు తెలిపారు. ఈ రోజు భక్తులకు ప్రసాద వితరణ కావించామన్నారు. దేవాలయంలోని శ్రీ అభయాంజనేయ స్వామికి అర్చకుడు కె.వినయ్‌కుమార్‌శర్మ పూజాకార్యక్రమాలు, అభిషేకం, అలంకారం నిర్వహించగా పలువురు హనుమాన్ చాలీసా పారాయణం, వివిధ రకాలైన పూలతో, తమలపాకులు, తదితర పండ్లతో ప్రత్యేక పూజలు చేశారు. ‘వైఖానసాగమ ప్రవర’ శ్రీమాన్ అద్దేపల్లి హరికృష్ణచే పూర్ణాహుతి, నివేదన హారతి, మంత్రపుష్పం, తీర్థప్రసాద వితరణ చేశారు. ఈ సందర్భంగా గణపతి, లక్ష్మీ గణపతి, నవగ్రహ, మన్యుసూక్త హామాలు నిర్వహించారు. భారీ సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామి వారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించి స్వామివారి కృపకు పాత్రులయ్యారు. ఈ కార్యక్రమంలో తాడిశెట్టి వెంకటేశ్వరరావు, తాడిశెట్టి శ్రీను, ముద్రబోయిన జగన్, పుసుపులేటి గణేష్, వెంకట్రావు, కటారి సురేష్, కె.వెంకటేశ్వరరావు, పి.లక్ష్మణరావు, ముద్రబోయిన గోపీ, కఠారి సురేష్, కూరపాటి ప్రవీణ్, కమిటీ సభ్యులు, స్థానికులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *