Breaking News

కనకదుర్గమ్మకు కాణిపాకం ఆలయం పట్టు వస్త్రాలు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
దసరా ఉత్సవాల సందర్భంగా కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి ఆలయం తరఫున సోమవారం సాయంత్రం శ్రీ కనకదుర్గమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. కాణిపాకం దేవస్థానం ఈవో పెంచల కిషోర్‌ ఆధ్వర్యంలో ఆలయ ధర్మకర్తలు, అర్చకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కాణిపాకం ఆలయ బృందానికి శ్రీ కనకదుర్గమ్మ ఆలయ చైర్మన్‌ బొర్రా రాధాకృష్ణ, ఈవో శీనానాయక్‌ స్వాగతం పలికారు. అనంతరం అమ్మవారి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనం తర్వాత ఆలయ మర్యాదల్లో భాగంగా వేద పండితులు ఆశీర్వచనం అందజేశారు. ఆలయ అధికారులు ప్రసాదం, అమ్మవారి చిత్రపటాన్ని బృంద సభ్యులకు అందించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ఏపీ-తమిళనాడు ముఖ్యమంత్రులు చంద్రబాబు-విజయ్ భేటీ

-గోదావరి-కావేరి నదుల అనుసంధానంపై చర్చ -చెన్నై తాగునీటి అవసరాలు తీర్చాలని కోరిన తమిళనాడు సీఎం అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త: …