ఇంద్రకీలాద్రి, నేటి పత్రిక ప్రజావార్త:
ప్రముఖ సినీ దర్శకుడు బోయపాటి శ్రీను కుటుంబ సమేతంగా మంగళవారం ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన శ్రీ కనకదుర్గమ్మను భక్తిశ్రద్ధలతో దర్శించుకున్నారు. దసరా శరన్నవరాత్రి ఉత్సవాల పవిత్ర వేళ అన్నపూర్ణాదేవి అలంకారంలో దర్శనమిస్తున్న జగన్మాతను దర్శించుకుని ఆధ్యాత్మిక అనుభూతిని పొందారు. అమ్మవారి దివ్యమంగళ రూపం, ఆలయంలోని భక్తిపూర్వక వాతావరణం దర్శనానికి ప్రత్యేక శోభను చేకూర్చాయి. దర్శనం అనంతరం మీడియా పాయింట్లో మాట్లాడుతూ ఒకప్పుడు దసరా పండుగ అంటే మైసూర్ గుర్తుకు వచ్చేదన్నారు. ప్రస్తుతం అదే స్థాయిలో విజయవాడ నగరంలో జరుగుతున్న విజయవాడ ఉత్సవ్, సరస్ బజార్ వంటి కార్యక్రమాల నిర్వహణతో విజయవాడ ఖ్యాతి దేశవ్యాప్తంగా విస్తరిస్తుందన్నారు. దేవస్థానం పాలకమండలి చైర్మన్ బొర్రా గాంధీ బోయపాటి శ్రీనుకు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా శరన్నవరాత్రుల వేళ జగన్మాత సన్నిధిలో భక్తితో గడిపిన ఈ సందర్భం ఆధ్యాత్మిక ప్రాధాన్యతను సంతరించుకుంది.
Prajavartha Online Telugu News