Breaking News

​రేపు ఇంద్రకీలాద్రికి భారత రాష్ట్రపతి రాక – భద్రతా కారణాల దృష్ట్యా కీలక మార్పులు

-​రేపు మధ్యాహ్నం 1:00 గంట నుండి కొండపైకి వాహనాల రాకపోకలు పూర్తిగా నిలుపుదల
​-మధ్యాహ్నం నుండి ప్రోటోకాల్ దర్శనాలు మరియు రాత్రి 7:45 స్లాట్ రద్దు
-​రేపు ఉదయం 6:00 నుండి 9:00 గంటల వరకు మాత్రమే ప్రోటోకాల్ దర్శనాలు.
-భక్తులు సహకరించాలని పాలకమండలి చైర్మన్ బొర్రా రాధాకృష్ణ (గాంధీ), ఈవో వి.కె. శీనా నాయక్ విజ్ఞప్తి

​ఇంద్రకీలాద్రి, నేటి పత్రిక ప్రజావార్త:
శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో అత్యంత వైభవంగా జరుగుతున్న దసరా శరన్నవరాత్రి మహోత్సవాల సందర్భంగా రేపు (బుధవారం, 14.10.2026) గౌరవ భారత రాష్ట్రపతి వారు ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన జగన్మాత శ్రీ కనకదుర్గ అమ్మవారి దర్శనార్థం విచ్చేయనున్నారు. రాష్ట్రపతి పర్యటన మరియు అత్యున్నత భద్రతా ప్రమాణాల దృష్ట్యా కొండపై వాహనాల రాకపోకలు, ప్రోటోకాల్ దర్శన వేళల్లో మార్పులు చేసినట్లు ఆలయ చైర్మన్ బొర్రా రాధాకృష్ణ (గాంధీ), కార్యనిర్వహణాధికారి వి.కె. శీనానాయక్ సంయుక్త ప్రకటనలో వెల్లడించారు.

రాష్ట్రపతి పర్యటన భద్రత దృష్ట్యా రేపు మధ్యాహ్నం 01:00 గంట నుండి కొండపైకి అన్ని రకాల వాహనాల రాకపోకలను పూర్తిగా నిలుపుదల చేయడమైనది.
రేపు మధ్యాహ్నం నుండి ఎలాంటి ప్రోటోకాల్ దర్శనాలు అనుమతించబడవు. అలాగే రేపు రాత్రి 07:45 గంటల నుండి కేటాయించిన ప్రోటోకాల్ స్లాట్‌ను కూడా పూర్తిగా రద్దు చేస్తూ,
రేపు ఉదయం 06:00 గంటల నుండి 08:00 గంటల వరకు ఉండే ప్రోటోకాల్ దర్శనాలు ఒక గంట సమయం పెంచి 9 వరకు అనుమతించినట్లు తెలిపారు.
బుధవారం సాయంత్రం వేళలకు ప్రోటోకాల్ దర్శనం టికెట్లు లేదా అనుమతులు కలిగి ఉన్న భక్తులు, ప్రముఖులు ఈ మార్పును గమనించి, తప్పనిసరిగా రేపు ఉదయం 06:00 నుండి 09:00 గంటల లోపు స్లాట్‌లోనే విచ్చేసి అమ్మవారి దర్శనం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

​రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో కల్పించిన భద్రతా చర్యలకు ప్రోటోకాల్ ప్రముఖులు, అధికారులు, ప్రజాప్రతినిధులు మరియు భక్తులు దేవస్థానంకు సంపూర్ణ సహకారం అందించాలని చైర్మన్ బొర్రా రాధాకృష్ణ (గాంధీ), ఈవో వి.కె. శీనానాయక్ కోరారు.
సామాన్య భక్తులకు ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ఏపీ-తమిళనాడు ముఖ్యమంత్రులు చంద్రబాబు-విజయ్ భేటీ

-గోదావరి-కావేరి నదుల అనుసంధానంపై చర్చ -చెన్నై తాగునీటి అవసరాలు తీర్చాలని కోరిన తమిళనాడు సీఎం అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త: …