-హజ్రత్ సయ్యద్ షాఋఖారి ఆస్థాన లో రంజాన్ పండుగ సంబరాలు
కొండపల్లి, నేటి పత్రిక ప్రజావార్త :
ముస్లిం సోదరులకు పెద్ద పండుగ అయినటువంటి రంజాన్ సందర్భంగా హజరత్ సయ్యద్ షా బుఖారి ఆస్థాన లో రంజాన్ సంబరాలు ఘనంగా నిర్వహించారు. పండగ సందర్భంగా ప్రత్యేక ఈద్ నమాజ్ నిర్వహించారు. అనంతరం అందరికీ అన్నదాన కార్యక్రమం తో పాటు, రంజాన్ ప్రత్యేక సేమియా ఖీర్ ను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా అల్తాఫ్ బాబా మాట్లాడుతూ ప్రతి పేదవాడి ఆకలి తెలుసుకోవడమే రంజాన్ మాసం యొక్క ముఖ్య ఉద్దేశం అని, అన్నసమారాధన ద్వారా ఆకలి తీర్చే భాగ్యం కల్పించినందుకు అల్లా కు రుణపడి ఉంటానని తెలిపారు. ఈ కార్యక్రమంలో వంశపారంపర్య ప్రభుత్వ ఖాజీ హబీబుల్లా హుసేని మరియు తెలుగు దేశం పార్టీ సీనియర్ నాయకులు జంపాల సీతారామయ్య పాల్గొని ముస్లిం సోదరులకు ఈద్- శుభాకాంక్షలు తెలిపారు.
Prajavartha Online Telugu News