యడ్లపల్లి, నేటి పత్రిక ప్రజావార్త :
ఈనెల 21వ తేదీన చుండూరు మండలం యడ్లపల్లి గ్రామంలో జరగనున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పర్యటనను విజయవంతం చేయాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మరియు జిల్లా ఇన్ ఛార్జి మంత్రి కొట్టు సత్యనారాయణ ప్రజలకు పిలుపునిచ్చారు. సోమవారం చుండూరు మండలం యడ్లపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రాంగణంలో జరగనున్న రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా జరుగుతున్న ఏర్పాట్ల ను రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ, రాష్ట్ర సాంఘీక సంక్షేమ శాఖ మంత్రి మేరుగు నాగార్జున, జిల్లా కలెక్టర్ విజయ కృష్ణన్,జిల్లా ఎస్.పి వకుల్ జిందాల్ పరిశీలించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఈ నెల21 వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి 8వ తరగతి విద్యార్థులకు రాష్ట్రవ్యాప్తంగా ఇక్కడ నుంచే శాంసంగ్ టాబ్ లు బైజూస్ సాప్ట్ వేర్ తో పంపిణీ ప్రారంభించనున్నారు. ఈ నెల 21వ తేదీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జన్మదినం సందర్భంగా ముఖ్యమంత్రి పర్యటనకుప్రత్యేక ప్రాతినిధ్యత ఉన్నదన్నారు. ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా కార్యక్రమానికి వచ్చే విద్యార్థులు, తల్లిదండ్రులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవాలని అధికారులను ఆయన సూచించారు. ముఖ్యమంత్రి పర్యటనకు అవసరమైన ఏర్పాట్లు యుద్దప్రాతి పై పూర్తి చేయాలని ఆయన చెప్పారు. ఈ సందర్భంగా యడ్లపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన హెలీ ప్యాడ్ ను ఎ.వి.ఆర్ . జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన సభా వేదికను మంత్రులు, జిల్లా కలెక్టర్ ,జిల్లా ఎస్.పి.పరిశీలించారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్ రావు, జిల్లా కలెక్టర్ విజయ కృష్ణన్,జిల్లా ఎస్.పి వకుల్ జిందాల్, జాయింట్ కలెక్టర్ కె.శ్రీనివాసులు, ఆదనపు ఎస్. పి మహేష్,రేపల్లె ఆర్.డి.ఓ పార్థసారథి, చీరాల ఆర్. డి.ఓ సరోజిని ,బాపట్ల ఆర్.డి.ఓ రవీంద్ర, పౌర సరఫరాల శాఖ డి.ఎస్. ఓ విలీమ్స్, డి.ఎం శ్రీలక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News