విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ముఖ ఆధారిత హాజరు పద్దతి నుండి మినహా ఇవ్వాలని శుక్రవారం ఏపి రెవిన్యూ అసోషియేషన్ అలాగే ఏపి గ్రామ రెవెన్యూ సహాయకుల రాష్ట్ర సంఘాల పక్షాన స్పెషల్ చీఫ్ సెక్రటరీ, చీఫ్ కమీషనర్ ఆఫ్ లాండ్ అడ్మినిస్ట్రేషన్ వారిని మంగళగిరిలోని వారి కార్యాలయంలో కలిసి వినతిపత్రాన్ని అందజేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రభుత్వ ఉద్యోగులందరికీ ముఖఆదారిత హాజరు ఉండాలనే నూతన పద్ధతి ప్రవేశ పెట్టిన విషయం విదితమే. ఈ పద్దతిని గ్రామ రెవెన్యూ సహాయకులు (విఆర్ఏ)లకు కూడా వర్తింప చేయాలని జిల్లా అధికారులు అదేశిస్తుండడం వలన రాష్ట్రంలోని విఆర్ఏలు అందరూ తీవ్రమైన ఆందోళణకు గురి అయ్యారని తెలిపారు. అయితే గ్రామ రెవెన్యూ సహాయకులు (విఆర్ఏ)లు పార్ట్‌టైమ్ వృత్తిగా పనిచేసే ఉద్యోగులు. వీరికి ఇచ్చే జీతభత్యాలు గౌరవ వేతనము మాత్రమేనన్నారు. అంతే కాకుండా వీరికి వచ్చే అతి తక్కువ జీతముతో స్మార్ట్ ఫోన్ కాదు కదా, అసలు ఏఫోన్ కూడా కొనుక్కోలేని ఆర్దికపరిస్దితి ఈ ఉద్యోగులదన్నారు. అంతేకాకుండా దశాబ్దాల క్రితం నుండి పనిచేసే వీరిలో ఎక్కవ మంది చదువురానివారు, అసలు సెల్‌ఫోన్ వాడకం తేలియని వారు కూడా ఉన్నందున వీరందరికి ముఖ ఆధారిత హాజరు పద్దతి నుండి మినహా ఇవ్వాలని కోరారు. దీనిపై స్పెషల్ చీఫ్ సెక్రటరీ మరియు చీఫ్ కమీషనర్ ఆఫ్ లాండ్ అడ్మినిస్ట్రేషన్ వారు సానుకూలంగా స్పందించి, తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారని ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎపి గ్రామ రెవెన్యూ సహాయకుల సంఘం ప్రెసిడెంట్ బొప్పరాజు వెంకటేశ్వర్లు, నాయకులు జి.జయరాజ్, వెంకట్రావు, సత్యనారాయణ, చేబ్రోలు కృష్టమూర్తి తదితరులు పాల్గొన్నారు.
Tags vijayawada
Check Also
16 నెలలు… 16కు పైగా విజయాలు…
-స్పష్టమైన మార్పు చూపించిన ‘స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర’ కార్యక్రమం -ఇదే స్ఫూర్తితో పనిచేయాలని ప్రభుత్వ యంత్రాంగానికి సీఎం చంద్రబాబు పిలుపు -ప్రజల సహకారంపై …
Prajavartha Online Telugu News