విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
పారిశ్రామిక రంగంలో అడుగుపెట్టి వ్యాపార రంగంలో నేను సైతం అంటూ ముందుకొచ్చే ఔత్సాహికులకు అరుదైన అవకాశాన్ని వాసవ్య మహిళా మండలి
కల్పిస్తుందని సంస్థ అధ్యక్ష్యులు డాక్టర్ బి. కీర్తి ఒక ప్రకటనలో తెలియజేశారు. స్టార్టప్ లు హబ్ మీ ఆలోచనలను పంచుకోవడానికి ఒక వేదికను అందిస్తుందని, స్టార్టప్ ప్రారంభానికి స్థిరమైన హ్యాండ్ హోల్డింగ్ సహకారంతో నైపుణ్యాన్ని పెంపొందించేందుకు ఇది ఉపయోగ పడుతుందని ఆమె అన్నారు. అంతేకాకుండా వాసవ్య మహిళా మండలి స్టార్టప్ లకు పెట్టుబడిదారులు, వ్యాపార సంస్థలు, మీడియా ద్వారా మీకు ఒక విజిబులిటి ని తెస్తుందని, ఇందుకు గాను అభ్యర్ధులు ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలని మహిళలు, మగవారు, మూడవ జెండర్ అని వయస్సు 22 నుండి 35 సంవత్సరాల లోపు ఉండాలని వీరు యన్.టి.ఆర్ లేదా కృష్ణా జిల్లాల వాసులై ఉండాలని ఆమె తెలిపారు ఇతర వివరాలకు 08662470966/9573404319 గాని అప్లికేషన్ల కొరకు లింక్ (https://forms.gle/BDKdNkPZvGYGUSH2A) TO లేదా రెస్యూమ్ ను మెయిల్ ఐడి vasavyamm@vasavya.org ఫిబ్రవరి 15 లోగా పంపవలసిందిగా ఆమె తెలిపారు. ఎంపిక చేసిన అభ్యర్థులకు శిక్షణ ఇవ్వడం జరుగుతుందని అభ్యర్థులకు బూత్ క్యాంపు లను నిర్వహిస్తామన్నారు, సొంతంగా వ్యాపార రంగంలో అవకాశం కల్పించేటట్లు వీలుగా ప్రభుత్వ పధకాలతో పాటు ఇతర సహాయ సహకారాలు అందించి మీయొక్క సృజనాత్మకత, మేధస్సును గుర్తించి తద్వారా మీవ్యాపారాన్ని నిర్మించేందుకు మరియు అభివృద్ధి అంతేకాకుండా మీద్వారా ఇతరులకు ఉద్యోగ ఉపాది అవకాశాలు కల్పించే విధంగా ఈ కార్యక్రమం రూపకల్పణ చేయబడిందని ఆమె తెలిపారు.
Prajavartha Online Telugu News