Breaking News

సోమవారం ఎం.ఎల్.సి. ఎన్నికల పోలింగ్ నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి

-నిర్భయంగా ఓటు హక్కు వినియోగానికి అన్నిచర్యలు చేపట్టాం.
-పోలింగ్ సమయం ఉదయం 8.00 గంటల నుండి సా 4.00 వరకు.
-జిల్లాలోని 4 రెవెన్యూ డివిజన్ కేంద్రాల నుండి పోలింగ్ సామాగ్రి పంపిణీ పూర్తి .
-దొంగ ఓటు వేయడానికి ప్రయత్నించినా, వేసినా చర్యలు తప్పవు.
-ఓటరు సిల్ప్ తో పాటు ఫోటో గుర్తింపు కార్డు తప్పనిసరి : జిల్లా కలెక్టర్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
ఎం.ఎల్.సి. పట్టబద్రుల, ఉపాద్యాయ నియోజకవర్గ ఎన్నికల పోలింగ్ ప్రక్రియకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసి, జిల్లాలోని జిల్లాలోని 4 రెవెన్యూ డివిజన్ కేంద్రాల నుండి పోలింగ్ సామాగ్రి పంపిణీ పూర్తి చేసినట్లు , నిర్భయంగా ఓటు హక్కు వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్ కె.వెంకటరమణా రెడ్డి అన్నారు. ఆదివారం ఉదయం స్థానిక శ్రీపద్మావతి మహిళా డిగ్రీ మరియు పిజి కళాశాల బ్లాక్ 1 లో పోలింగ్ సామగ్రి పంపిణీ విధానం పరిశీలించి జాగ్రత్తలు సూచించారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పి.ఓ., ఎపిఒలు, ఇతర పోలింగ్ సిబ్బంది డిస్ట్రిబ్యూషణ్ సెంటర్ లో చెక్ లిస్టు జాగ్రత్తగా మేరకు సరిచూసుకోవాలి బ్యాలెట్ బ్యాక్స్ , పేపర్ సీఎల్ , బ్యాలెట్ పేపర్ సీరియల్ నెంబర్లు ఇప్పటికే పూర్తిగా పరిశీలించాము, అయిన తప్పనిసరి ప్రతి సీరియల్ చెక్ చేసుకోవాలి , పి.ఓ.డైరీ. , పోలింగ్ నిర్వహణలో పూరించాల్సిన ఫారమ్స్ , ఓటరు వేలికి వేయనున్న గుర్తింపు ఇంక్ , ఓటరు ఓటు వేయడానికి వైలెట్ స్కెచ్ పెన్ , వంటివి తీసుకు వెళ్ళాలని , పోలింగ్ విధులు కేటాయించిన వారు నేటి రాత్రి పోలింగ్ కేంద్రాల్లో బసచేయాలని సూచించారు. ప్రతి పోలింగ్ కేంద్రంలో వెబ్ క్యాస్టింగ్ ఏర్పాటు, ప్రతి పోలింగ్ కేంద్రాన్ని రాష్ట్ర ఎన్నికల అధికారి, రిటర్నింగ్ అధికారి ,జిల్లా ఎన్నికల అధికారి వీక్షించే విధంగా ఏర్పాటు కలెక్టరేట్ లో కంట్రోల్ రూమ్ కు అనుసందానం చేశామని అన్నారు. పోలింగ్ రోజు తేది.13 న సోమవారం ఉదయం 6.00 గంటలకు అందరు సిద్దంగా వుండి , 7.00 గంటలకు అభ్యర్థి లెటర్ ఆధారంగా పోలింగ్ ఏజెంట్ల పాసుల జారీ , 7.30 గంటలకు ఏజెంట్ల సమక్షంలో బ్యాలెట్ బాక్స్ సీల్ , పోలింగ్ ప్రక్రియ డిక్లరేషన్ చదివి 8.00 గంటలకు ఓటింగ్ కు అనుమతి ఇవ్వాలి , బ్యాలెట్ ఓటింగ్ విధానం ఆలస్యం కారాదని ఎన్నికల కమిషన్ రెండు ఓటింగ్ కంపార్ట్ మెంట్లు అనుమతి మేరకు ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. ఎ.ఎస్.డి.లిస్టు పి.ఓ.లవద్ద అందుబాటులో వుంది ఓటింగ్ సమయంలో వారి గుర్తింపు ఆధారాలు క్షుణ్ణంగా పరిశీలించి అనుమతించాలి, బ్యాలెట్ కౌంటర్ పేపర్ లో సంతకంతో వీరి వేలిముద్రలు తప్పనిసరి అన్నారు. దొంగ ఓటు కు ప్రయత్నిస్తే వెంటనే పి.ఓ. అక్కడే వున్న పోలీసులకు కంప్లైంట్ ఫారం నింపి అప్పగించాలి అన్నారు. పోలింగ్ అనతరం బ్యాలెట్ సీలింగ్ ఏజెంట్ల సమక్షంలో పూర్తిచేసి సంబందిత డివిజన్ కేంద్రం మధ్యంతర స్ట్రాంగ్ రూమ్ పి.ఓ., ఎపిఒ లు పి.ఓ. డైరీ, ఇతర ఫారమ్స్ అప్పజెప్పాల్సి ఉంటుందని వివరించారు. ఆపై పోలిస్ బందోబస్త్ తో , ఏజెంట్ల కూడా బ్యాలెట్ బాక్సుల చిత్తూరు ప్రధాన స్ట్రాంగ్ రూమ్ కు తరలించడం జరుగుతుందని తెలిపారు. ప్రతి పోలింగ్ కేంద్రానికి మైక్రో అబ్జర్వర్లు ఏర్పాటు, వారు పోలింగ్ రోజు రిపోర్ట్ ఎన్నికల పరిశీలకులకు అందిస్తారని తెలిపారు. జిల్లా కలెక్టర్ పర్యటనలో తిరుపతి రెవెన్యూ డివిజనల్ అధికారి కనకనరసా రెడ్డి , నగరపాలక అసిస్టెంట్ కమిషనర్ పోలింగ్ సునీత , శిక్షణ కు నియమించిన రిటైర్ జెసి చంద్రమౌళి , విధులు కేటాయించిన పి.ఓ., ఎపిఒ లు, పోలింగ్ సిబ్బంది , అధికారులు వున్నారు.

తిరుపతి జిల్లా పట్టభద్రుల – ఉపాద్యాయ ఓటర్ల వివరాలు :
1. గూడూరు డివిజన్ డిస్ట్రిబ్యూషణ్ , రిసిప్షన్ కేంద్రం :
జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాటశాల
పట్టభద్రుల పోలింగ్ కేంద్రాలు 11, ఓటర్లు 18,761
ఉపాద్యాయ పోలింగ్ కేంద్రాలు 8, ఓటర్లు 1345

2. సూళ్ళురుపేట డివిజన్, డిస్ట్రిబ్యూషణ్ , రిసిప్షన్ కేంద్రం
: ప్రభుత్వ జూనియర్ కళాశాల
పట్టభద్రుల పోలింగ్ కేంద్రాలు 11, ఓటర్లు 15,238
ఉపాద్యాయ పోలింగ్ కేంద్రాలు 9, ఓటర్లు 893

3.శ్రీకాళహస్తి డివిజన్, డిస్ట్రిబ్యూషణ్ , రిసిప్షన్ కేంద్రం : స్కిట్ కళాశాల
పట్టభద్రుల పోలింగ్ కేంద్రాలు 11, ఓటర్లు 15,043
ఉపాద్యాయ పోలింగ్ కేంద్రాలు 8, ఓటర్లు 811

4.తిరుపతి డివిజన్, శ్రీపద్మావతి మహిళల డిగ్రీ మరియు పి.జి.కళాశాల
పట్టభద్రుల పోలింగ్ కేంద్రాలు 29, ఓటర్లు 37,899 ,
ఉపాద్యాయ పోలింగ్ కేంద్రాలు 12, ఓటర్లు 3083,

తిరుపతి జిల్లా మొత్తం పట్టభద్రుల ఓటర్లు: 86,941 , మొత్తం ఉపాధ్యాయ ఓటర్లు:6132

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

16 నెలలు… 16కు పైగా విజయాలు…

-స్పష్టమైన మార్పు చూపించిన ‘స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర’ కార్యక్రమం -ఇదే స్ఫూర్తితో పనిచేయాలని ప్రభుత్వ యంత్రాంగానికి సీఎం చంద్రబాబు పిలుపు -ప్రజల సహకారంపై …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *