Breaking News

అంబేద్కర్ పార్కు పరిశీలన

-పనులను త్వరితగతిన పూర్తి చేయవలసినదిగా ఆదేశాలు,
-కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఐ.ఏ.ఎస్.

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
నగరపాలక సంస్థ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఐ.ఏ.ఎస్‌ బుధువారం అధికారులతో కలిసి కృష్ణలంక జాతీయ రహదారి ప్రక్కన గల అంబేద్కర్ పార్కును క్షేత్ర స్థాయిలో పర్యటిస్తూ, పార్కులో జరుగుతున్నవంటివి పునరుద్ధరికరణ పనులను మరియు గ్రీనరీ పరిశీలించినారు. అదేవిధంగా ఫ్లోరింగ్ కి వేసిన గ్రానైట్ డిసైన్స్ ను పరిశీలించి వాటి యొక్క వివరాలను మరియు ఎటువంటి ఇబ్బందులు ఉన్నాయో అధికారులను అడిగి తెలుసుకొని మిగిలిన పనిని కాంట్రాక్టు వర్కర్లను మరియు యంత్రాలను పెట్టి పనులు త్వరితగతిన పూర్తి చేయవలసినదిగా అధికారులకు ఆదేశించడమైనది. విజయవాడ జాతీయ రహదారి ప్రక్కన ఉన్న అంబేద్కర్ పార్కును అభివృద్ధి చేస్తున్నామని, పార్క్ లో చిన్నారుల నుండి పెద్ద వాళ్ల వరకు ప్రతి ఒక్కరికి ఆహ్లాదాన్ని అందించేలా ప్రత్యేక దృష్టి సారించామన్నారు. పార్క్ లో ఆకర్షణీయంగా ఉండేలా ఏర్పాటు చేయనున్న కళాకృతులను మరింత సుందరంగా తీర్చిదిద్దాలన్నారు. వెంటనే నిర్దేశిత గడువు మేరకు కాంట్రాక్టర్ లు చేసేలా, అవసరమైతే షిఫ్ట్ ల వారిగా పనులు జరిగేలా ఇంజినీరింగ్ అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. పార్క్ లో లైటింగ్ పై ఈ.ఈ.కి తగు సూచనలు చేసి, వెంటనే చేపట్టాలన్నారు. పచ్చదనం పెంపు పై ఏ.డి.హెచ్. మరింత దృష్టి సారించాలన్నారు. ఈ పర్యటనలో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఏ.ఎస్.ఎన్ ప్రసాద్, ఏ.డి.హెచ్ శ్రీనివాసు శానిటరీ ఇన్స్ పెక్టర్లు మరియు ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

16 నెలలు… 16కు పైగా విజయాలు…

-స్పష్టమైన మార్పు చూపించిన ‘స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర’ కార్యక్రమం -ఇదే స్ఫూర్తితో పనిచేయాలని ప్రభుత్వ యంత్రాంగానికి సీఎం చంద్రబాబు పిలుపు -ప్రజల సహకారంపై …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *