Breaking News

రిటైనింగ్ బ్యూటిఫికేషన్ పార్కు పరిశీలన…

-కమీషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ఐ.ఏ.ఎస్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
కృష్ణలంక, వారధి ప్రక్కన రాణిగారి తోట రిటైనింగ్ వాల్ దగ్గర నగరపాలక సంస్థ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ఐ.ఏ.ఎస్ బుధువారం క్షేత్ర స్థాయిలో పర్యటిస్తూ పార్కులలో జరుగుతున్నవంటివి ఆధునికకరణ పనులను పరిశీలించి అధికారులను వివరాలు అడిగితెలుసుకొని పలు ఆదేశాలు ఇచ్చారు. విజయవాడ నగరానికి తలమానికంగా అన్ని వర్గాల ప్రజలకు ఆహ్లాదాన్ని అందించేలా రిటైనింగ్ బ్యూటిఫికేషన్ పార్కును అభివృద్ధి చేస్తున్నామని, పనులను ఇంజినీరింగ్ అధికారులు వేగంగా పూర్తీ చేయాలని నగర కమీషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఆదేశించారు. అదేవిధంగా ఇళ్ళ ప్రక్కన గల డ్రైనేజి నిర్మాణ పనులను మెదలు పెట్టాలని, రోడ్లు మరియు బెస్మెంట్ పనులను పరిశీలించి నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ పనులు త్వరితగతిన పూర్తి చేయవలసినదిగా ఇంజనీరింగ్ అధికారులకు పలు ఆదేశాలు ఇచ్చారు. ఈ పర్యటనలో చీఫ్ ఇంజనీర్ యం.ప్రభాకర రావు, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు ఏ.ఎస్.ఎన్ ప్రసాద్, వి.చంద్ర శేఖర్, డిప్యూటీ ఎగ్జీక్యూటివ్ ఇంజనీర్ కరిముల్లా, ఏ.డి.హెచ్ శ్రీనివాసు శానిటరీ ఇన్స్ పెక్టర్లు మరియు ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *