Breaking News

గాంధీ హిల్ ను పర్యాటక ప్రదేశంగా రూపొందించడం పై అధికారులకు పలు సూచనలు

-నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి
-కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఐ.ఏ.ఎస్.

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, కమిషనర్  స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఐ.ఏ.ఎస్ బుధువారం అధికారులతో కలిసి క్షేత్ర స్థాయిలో పర్యటిస్తూ గాంధీ హిల్ ను పర్యాటక ప్రదేశంగా రూపొందించడం పై ప్రత్యేక దృష్టి సారించేందుకు అధికారులకు పలు సూచనలు చేశారు. విజయవాడ నగర ప్రజలు ఈ వేసవి కాలంలో సాయంత్రం వేళలు గాంధీ హిల్ కు వచ్చే విధంగా ప్రణాళికలను సిద్దాం చేయాలనీ అధికారులకు ఆదేశించారు. విజయవాడ నగరానికే తలమానికంగా అభివృద్ధి చేస్తున్నామని గాంధీ హిల్ కు చిన్నారుల నుండి పెద్ద వాళ్ల వరకు ప్రతి ఒక్కరికి ఆహ్లాదాన్ని అందించేలా ప్రత్యేక దృష్టి సారించామన్నారు. గాంధీ హిల్ లో ఆకర్షణీయంగా ఉండేలా ఏర్పాటు చేయనున్న కళాకృతులను మరింత సుందరంగా తీర్చిదిద్దాలన్నారు. అదేవిధంగా ప్లానిటేరియం పర్యటించి ఖాళీగా ఉన్న ప్రదేశాములో ఆటపరికరాలు ఏర్పాటుకు తగిన ఏర్పాట్లు సిద్దం చేయాలని సంబందిత అధికారులను ఆదేశించారు. గాంధీ హిల్ కాంపౌండ్ వాల్ మరియు కొండపైకి వెళ్లు దారిలో గల వాల్ తగిన మరమ్మత్తులు నిర్వహించుటతో పాటుగా మెట్ల మార్గమునకు ఇరువైపులా చెట్ల కొమ్మలను ట్రిమ్మింగ్ నిర్వహించాలని సూచిస్తూ, ఇంపుగా పెరిగిన చెట్ల గుబురు తొలగించి పరిసరాలు అన్నియు పరిశుభ్రంగా తీర్చిదిద్దాలని అన్నారు. పర్యటనలో కార్పొరేటర్ అబ్దుల్ అకీమ్ అర్షద్, డిప్యూటీ సిటి ప్లానర్ (ప్లానింగ్ ) జుబిన్ శిరన్ రాయ్, ఎగ్జీక్యూటివ్ ఇంజనీర్లు నారాయణమూర్తి, ఏ.ఎస్.ఎన్ ప్రసాద్, ఏ.డి.హెచ్ శ్రీనివాస్, మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

16 నెలలు… 16కు పైగా విజయాలు…

-స్పష్టమైన మార్పు చూపించిన ‘స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర’ కార్యక్రమం -ఇదే స్ఫూర్తితో పనిచేయాలని ప్రభుత్వ యంత్రాంగానికి సీఎం చంద్రబాబు పిలుపు -ప్రజల సహకారంపై …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *