టీడీపీలో మైల‌వ‌రానికి బీసీకి సీటు ద‌క్కేనా..?

-టీడీపీలో ఉన్న ఓ మ‌హిళే బీసీల‌కు కేటాయించాల‌ని కోరుతున్న వైనం
-అధికారంలో ఉన్నా.. లేకున్నా పార్టీ కోసం క‌ష్ట‌ప‌డిన మ‌హిళ‌గా మైల‌వ‌రంలో గుర్తింపు
-ప్ర‌జాధ‌ర‌ణ‌తో ఎమ్మెల్యే అభ్య‌ర్థిగా పోటీచేసేందుకు సిద్ధం
-చివ‌రి క్ష‌ణం వ‌ర‌కు అధిష్టానం పిలుపు కోసం వేచి చూస్తా, లేనిప‌క్షంలో ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తా

మైల‌వ‌రం, నేటి పత్రిక ప్రజావార్త :
ఎన్టీఆర్ జిల్లా మైల‌వ‌రం నియోజ‌క‌వ‌ర్గంలో అధికార వైసీపీతో పాటు అటు టీడీపీ, బీజేపీ పార్టీల్లో ఎమ్మెల్యే అభ్య‌ర్థులు ఎవ‌ర‌నేది నాయ‌కుల్లో చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ఈ నేప‌ధ్యంలో రోజురోజుకు ఇరుపార్టీల త‌ర‌ఫున ముఖ్య నాయ‌కుల‌తో పాటు పోటీ చేయాల‌ని ఆస‌క్తి ఉన్న మ‌రికొంద‌రు త‌మ‌దైన శైలిలో పావులు క‌దుపుతున్నారు. అదేవిధంగా మ‌రోవైపు వీరి ప్ర‌చారానికి సోష‌ల్ మీడియా ప్ర‌ధాన వేదిక‌గా మారింది. ఇప్ప‌టివ‌ర‌కు మైల‌వ‌రం నియోజ‌క‌వ‌ర్గానికి సంబంధించి ఏ పార్టీ త‌ర‌ఫున అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టించ‌క‌పోవ‌డంతో అస‌లు ప్ర‌చారంలో ఉన్నారా.. ఉంటారా.. ఉండ‌రా…? అనే ప్ర‌చారం కూడా జోరుగా కొన‌సాగుతుంది. ప్ర‌స్తుతం ఉన్న ప‌రిస్థితుల్లో వైసీపీకి గాని తెలుగుదేశం పార్టీకి గాని ఆ పార్టీలో ఉన్న నాయ‌కులే వ్య‌క్తిరేకం కావ‌డం గ‌మ‌నార్హం. ఈ నేప‌ధ్యంలో తెలుగుదేశం పార్టీ నుండి ఇబ్ర‌హింప‌ట్న కొండ‌ప‌ల్లి మున్సిపాలిటి 17వార్డు కౌన్సిల‌ర్ ముప్పాసాని భూల‌క్ష్మి మాజీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు బీసీల‌కు పెద్ద‌పీట వేస్తాన‌ని వారికి న్యాయం చేస్తాన‌ని అనేక‌సార్లు బ‌హిరంగ స‌భ‌లు వేదిక‌గా ప్ర‌క‌టించిన నేప‌ధ్యంలో బీసీ త‌ర‌ఫున మైల‌వ‌రం నియోజ‌క‌వ‌ర్గంలో త‌న‌కు సీటు కేటాయించాల‌ని మీడియా స‌ముఖంగా గ‌తంలో అనేక‌సార్లు ఆమె కోరారు. త‌న‌కు ప్ర‌జ‌ల్లో ఉన్న ఆద‌ర‌ణ‌, ప్ర‌జ‌లు చూపిస్తున్న ఆప్యాయ‌త మైల‌వ‌రం నియోజ‌క‌వ‌ర్గంలో ఉన్న ప‌ట్టుతో ప్ర‌జ‌లు త‌న‌ను ఆహ్వానిస్తున్న‌ట్లు భూల‌క్ష్మి తెలిపారు. టీడీపీ త‌ర‌ఫున సీటు క‌నుక బీసీ వ‌ర్గానికి చెందిన త‌న‌కు కేటాఇస్తే గెలుపొంది తీరుతాన‌ని, లేనిప‌క్షంలో ఇండిపెండెంట్‌గా పోటీ చేసి విజ‌యం సాధిస్తాన‌ని భూల‌క్ష్మి ధీమా వ్య‌క్తం చేశారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *