మైలవరం, నేటి పత్రిక ప్రజావార్త :
మైలవరం నియోజకవర్గ ప్రజలారా మీరు నాపట్ల చూపిస్తున్న ప్రేమ, అభిమానం జీవితాంతం గుండెల్లో పెట్టుకుంటాను. మైలవరం నియోజకవర్గ ఎన్డీఏ బలపరిచిన ఉమ్మడి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి వసంత కృష్ణ ప్రసాదు. సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం రాత్రి మైలవరం మండల పరిధిలోని చండ్రగూడెం తో పాటు శివారు ప్రాంతాలైన సజ్జపాడు, జంగాలపల్లి, బోర్రగూడెం గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా తెదేపా కూటమి అభ్యర్థి వసంత కృష్ణప్రసాద్ మాట్లాడుతూ ఇక్కడ జరుగుతున్న పోటీ సామాన్యుడు… నామధ్య కాదు. సాక్షాత్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి మధ్య నామధ్య జరుగుతున్న పోటీ. అందుకే ఇప్పటికే ఇద్దరు సమన్వయకర్తలను నియమించిన జగన్ కోత్తగా మరో కృష్ణుడిని కూడా రంగంలోకి దింపారు. ఎంతమంది వచ్చిన ప్రజలంతా జగన్మోహనరెడ్డి ని తరిమి తరిమి కోట్టేందుకు సిద్దంగా ఉన్నారని అన్నారు. రాష్ట్రంలో యువత ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కోసం టీడీపీ మహాకూటమికి ఓటు వేయాలని పిలుపునిచ్చారు. అందరూ సైకిల్ గుర్తుకు ఓట్లు వేసి ఎమ్మెల్యే గా మీ అందరివాడినైన వసంత కృష్ణ ప్రసాదు అనే నాకు యంపి గా కేశినేని శివనాథ్గారికి ఓట్లు వేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో బిజెపి, జనసేన, తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News