విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
కళాశాలలో జాతీయ చేనేత దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. కళాశాల ప్రిన్సిపాల్ dr సిస్టర్ జె సింత క్వాడ్రాస్ చేనేత సుహృద్భావ ర్యాలీ నీ ప్రారంభించారు. ఆమె మాట్లాడుతూ చేనేతలు భారత దేశ గర్వ కారణమైన కళా సంపద అని చేనేత రంగాన్ని ప్రోత్సహించాలని తెలిపారు. ముఖ్య అతిథి గా లయోలా కళాశాల ఏవియేషన్ విభాగ అధ్యపకురాలు T.నిష విచ్చేశారు. ఆమె చేనేత రంగం ప్రాధాన్యతను మరియు ప్రపంచీకరణ వల్ల మచనిసేషన్ వల్ల ఆ రంగం ఎదుర్కొంటున్న సమస్యలు,ప్రభుత్వ. ఐదనలను గురించి తెలియపరచారు. అనంతరం విద్యార్థినులు హాండ్లూమ్ వస్త్ర ధారణ లో ఫ్యాషన్ న్ షో ను నిర్వహించారు కళాశాల అధ్యాపకులు కూడా చేనేత వస్త్రాలు ధరించి చేనేత రంగం యొక్క ప్రాధాన్యతను తెలియపర్చారు. హిస్టరీ మరియు టూరిజం విభాగాధిపతి dr బ్యుల నోయల్ మరియు అధ్యాపకులు,కెప్టెన్ శైలజ, అంజనీ సింహ, మాధవి, డిగ్రీ వైస్ ప్రిన్సిపల్ ఉష కుమారి ఇంటర్ వైస్ ప్రిన్సిపల్ స్వప్న వున్నాం డాక్టర్ సిస్టర్ ఇన్నసియా డాక్టర్ సిస్టర్ లావణ్య పాల్గొన్నారు విద్యార్థినులు చేసిన ఫ్యాషన్ షో ఆకట్టుకుంది. ర్యాలీ నీ కళాశాల నుండి ఇండోర్ స్టేడియం వరకు కొనసాగించి చేనేత కార్మికుల కు మద్దతును ప్రకటించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎలాక్యూషన్ పోటీలు నిర్వహించారు.
Tags vijayawada
Check Also
మస్టర్ పాయింట్లను ఆకస్మిక తనిఖీ
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : వార్డ్ సచివాలయ శానిటేషన్ కార్యదర్శులు మస్టర్ సమయంలో తప్పనిసరిగా ప్రజారోగ్య కార్మికుల హాజరు …