Breaking News

Konduri Srinivasa Rao

పర్యాటక రంగం మరింత అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు

-తిరుపతిలో రూ. 1,000 కోట్లతో ఐకానిక్ పర్యాటక కేంద్రాల అభివృద్ధి -రాష్ట్రంలో 2029 నాటికి 50 వేల గదుల (keys) లక్ష్యంగా ప్రణాళికలు -తిరుపతిలో ‘రిజెంటా దేవరాయ’ ఫోర్ స్టార్ హోటల్‌ ప్రారంభోత్సవంలో రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ -రాష్ట్రంలో పర్యాటక రంగానికి పారిశ్రామిక హోదా కల్పిస్తున్న ప్రభుత్వం -జిల్లా కలెక్టర్ డా.ఎస్.వెంకటేశ్వర్ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో పర్యాటక రంగాన్ని ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పటిష్టమైన చర్యలు చేపడుతోందని రాష్ట్ర పర్యాటక శాఖ …

Read More »

తిరుపతి, విశాఖపట్నంలు ‘ఐకానిక్ టూరిజం హబ్స్’గా అభివృద్ధి: మంత్రి కందుల దుర్గేష్

-తిరుమల శ్రీవారిని దర్శనం చేసుకున్న మంత్రి కందుల దుర్గేష్.. కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వరుని కృపతో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ప్రార్థన -ఏపీలో కొత్త పర్యాటక పాలసీ 2024-29 ద్వారా ప్రైవేట్ పెట్టుబడులకు పెద్దపీట..పారిశ్రామిక హోదాతో పర్యాటకానికి ఊతం..ఏపీని ప్రపంచ స్థాయి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని ప్రకటన -తిరుపతిలో 6 భారీ స్టార్ హోటళ్ల నిర్మాణానికి ప్రతిపాదనలు…ఎకో,అడ్వెంచర్ టూరిజం అభివృద్ధికి ప్రణాళికలు.. -తిరుపతి, రాయలసీమను పర్యాటక హబ్‌గా మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం సహకారం -తిరుపతి రీజియన్‌లోని పర్యాటక ప్రాంతాల స్థితిగతులపై నేడు జిల్లా పర్యాటక …

Read More »

పూర్వ వైద్య విద్యార్థుల ఔదార్యం

-కాకినాడ జీజీహెచ్‌లో రూ.98 కోట్ల‌తో త‌ల్లీబిడ్డ‌ల ఆరోగ్యం కోసం సిద్ధమైన 5 అంతస్థుల భవనo -త్వరలో ప్రారoభం అమ‌రావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఉత్తర అమెరికాలోని రంగారాయ వైద్య కళాశాల పూర్వ వైద్య విద్యార్థుల ఔదార్యం, ప్రభుత్వ భాగస్వామ్యంతో కాకినాడ సర్వజన ఆసుపత్రి(జీజీహెచ్‌)లో రూ.98 కోట్ల వ్యయంతో నిర్మించిన తల్లీబిడ్డల (మాతా, శిశు) ఆరోగ్య భవనం సేవలు త్వరలో ప్రారంభం కాబోతున్నాయి. 465 పడకలతో 5 అంతస్తులతో అత్యాధునిక వసతులతో నిర్మితమైన ఈ భవనం ప్రారంభోత్సవo వచ్చేనెల 18వ తేదీ జరగబోతుందని, ఈ …

Read More »

గుంటూరు జీజీహెచ్ లో అత్యాధునిక పెట్ స్కాన్’ సిద్ధం

-అమెరికా నుంచి తెప్పించిన దీని వ్యయం రూ. 18 కోట్లు -క్యాన్సర్ గుట్టును పసిగట్టే ఈ స్కాన్ ప్రభుత్వాసుపత్రుల్లో ఏర్పాటుకావడం ఇదే తొలిసారి -పేదల ఆరోగ్య సంరక్షణ కోసం కూటమి ప్రభుత్వం కృషి -రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడి అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : ప్రైవేట్ కార్పొరేట్‌ అసుపత్రులకు మాత్రమే పరిమితమైన అత్యాధునిక పెట్ స్కాన్ (క్యాన్సర్ గుట్టును పసిగట్టే) గుంటూరులోని ప్రభుత్వ బోధనాసుపత్రిలో సిద్ధమైంది. పేద, మధ్యతరగతి రోగులకు క్యాన్సర్ వ్యాధికి సంబంధించిన అత్యుత్తమ వైద్యాన్ని …

Read More »

ఆసుపత్రులు, కార్యాలయాల్లో ఫైర్ ఆడిట్

-ప్రజల సురక్షిత ప్రథమ ప్రాధాన్యత గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : ఆసుపత్రులు, కార్యాలయాల్లో ఫైర్ ఆడిట్ నిర్వహించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ సి.యం.సాయి కాంత్ వర్మ తెలిపారు. మంగళ, బుధవారాలలో జరిగిన అగ్ని ప్రమాదాలు దృష్ట్యా బుధవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా ప్రతినిధుల సమావేశంలో జిల్లా కలెక్టర్ పలు విషయాలను వెల్లడించారు. ఫైర్ ఆడిట్ తో పాటు ఆసుపత్రిలో సంబంధిత విద్యుత్ శాఖ అధికారులు విద్యుత్ ఆడిట్ నిర్వహించాలని ఆదేశించినట్లు తెలిపారు. ప్రతి నెల ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులలో …

Read More »

బాణాసంచా తయారీ, విక్రయ కేంద్రాల్లో భద్రతా ప్రమాణాలు తప్పనిసరిగా పాటించాలి

-ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలి -జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : బాణాసంచా తయారీ మరియు విక్రయ దుకాణాల్లో ఎటువంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా అన్ని భద్రతా ప్రమాణాలను కచ్చితంగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి సూచించారు. రాష్ట్రవ్యాప్తంగా ఇటీవల చోటుచేసుకున్న అగ్ని ప్రమాదాల నేపథ్యంలో ప్రభుత్వం తాత్కాలికంగా బాణాసంచా తయారీ మరియు విక్రయ కేంద్రాలను మూసివేసిన విషయం తెలిసిందే అన్నారు. ఈ నేపథ్యంలో దుకాణాల పునఃప్రారంభానికి అనుమతులు ఇవ్వాలని …

Read More »

జిఎంసి అధికారులతో సమీక్షా సమావేశం

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరానికి కీలకమైన ప్రాజెక్ట్ లను రోజువారీ, నెలవారీ లక్ష్యాలను నిర్దేశించుకొని, అందుకు తగిన విధంగా వేగంగా చేపట్టడానికి సదరు శాఖల అధికారులు సమన్వయంతో కృషి చేయాలని నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ స్పష్టం చేశారు. బుధవారం నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలోని కమిషనర్ చాంబర్ లో ఇన్నర్ రింగ్ రోడ్ ఫేజ్3, మిర్చి యార్డ్ దగ్గర ఫ్లైఓవర్ నిర్మాణం, శంకర్ విలాస్ ఆర్ఓబీ నిర్మాణ పనుల పురోగతిపై ఆయా విభాగాలు, జిఎంసి అధికారులతో సమీక్షా సమావేశం …

Read More »

రాజకీయ పార్టీల ప్రతినిధుల సమావేశం

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్)లో భాగంగా ఎలక్ట్రోల్ మ్యాపింగ్ 95 గుంటూరు తూర్పు, 94 పశ్చిమ నియోజకవర్గాల్లో 61 శాతంకి పైగా మ్యాపింగ్ జరిగిందని గుంటూరు తూర్పు నియోజకవర్గ ఏఈఆర్ఓ, డిప్యూటీ కమిషనర్ సిహెచ్. శ్రీనివాస్ రాజకీయ పార్టీల ప్రతినిధులకు తెలిపారు. బుధవారం నగర కమిషనర్, గుంటూరు తూర్పు నియోజకవర్గ ఈఆర్ఓ కె. మయూర్ అశోక్ ఆదేశాల మేరకు జిఎంసి ప్రధాన కార్యాలయంలోని అదనపు కమిషనర్ చాంబర్ లో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధుల సమావేశం …

Read More »

నిర్మాణ వ్యర్ధాలను ప్రజలకు ఇబ్బంది లేకుండా తొలగించాలి…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరంలో వార్డుల వారీగా జరుగుతున్న అభివృద్ధి పనులు పూర్తైన ప్రాంతాల్లో నిర్మాణ వ్యర్ధాలను ప్రజలకు ఇబ్బంది లేకుండా తొలగించాలని, నిర్మాణానికి ముందే పట్టణ ప్రణాళిక విభాగ సిబ్బందితో సమన్వయం చేసుకోవాలని నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ ఇంజినీరింగ్ అధికారులకు స్పష్టం చేశారు. బుధవారం ఇన్నర్ రింగ్ రోడ్, గాయత్రి నగర్, ఆటో నగర్ తదితర ప్రాంతాల్లో అధికారులతో కలిసి పర్యటించి, పనుల వేగవంతంపై తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ తొలుత ఇన్నర్ …

Read More »

విజయకిలాద్రిపై ఆస్ట్రేలియా బృందం

తాడేపల్లి, నేటి పత్రిక ప్రజావార్త : ఆస్ట్రేలియాన్ కౌన్సిల్ జనరల్ ఈ సెలై జాకీ, హై కమీషనర్ ఈ ఫిలిప్స్ ఓం వారి బృందం తో సీతానగరంలోని విజయ కిలాద్రికి విచ్చేశారు. విజయకీలాద్రి ఫై ఉన్నట్టు వంటి అన్ని ఆలయాలను, మరియు క్షేత్రపాలుకుడైన 27 అడుగుల ఏకశిలా మూర్తి శ్రీ శ్రీవిఘ్నవిమోచక హనుమాన్ ను దర్శించుకున్నారు. హనుమాన్ యొక్క మూర్తిని చూసి వారు ఎంతో ఆశ్చర్యానికి, ఆనందానికి గురయ్యారు, ఈ విజయ కిలాద్రి దివ్య క్షేత్ర వాతావరణం ఎంతగానో వారికి ఆనందాన్ని కలుగ చేస్తుందని, …

Read More »