Breaking News

Konduri Srinivasa Rao

ఎండ తీవ్రత, వడగాలులు, ఉక్కపోత పట్ల ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి…

అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో క్రమేపి పెరుగుతున్న ఎండ తీవ్రత, వడగాలులు, ఉక్కపోత పట్ల ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ సూచించారు. బుధవారం చిత్తూరు జిల్లా రాయలపేటలో 43.7డిగ్రీలు నమోదైందని తెలిపారు. అలాగే 28 జిల్లాలకు గాను 22 జిల్లాల పరిధిలోని 143 మండలాల్లో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు రికార్డు అయినట్లు ఆయన వెల్లడించారు. గురువారం (14-05-26) రాష్ట్రంలో గరిష్ఠంగా 43-44°C మధ్య గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదైందుకు అవకాశం ఉందన్నారు. …

Read More »

ఖరీఫ్ రైతులకు శుభవార్త.. పంటల కనీస మద్దతు ధరలు పెంపు

– రైతుల ఆదాయం పెంచే దిశగా కేంద్రం కీలక నిర్ణయం – కేంద్ర ప్రభుత్వానికి మంత్రి అచ్చెన్నాయుడు కృతజ్ఞతలు అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : దేశ రైతాంగ సంక్షేమానికి కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజ‌రాపు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. 2026-27 ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్‌కు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధరలు (MSP) రైతులకు భారీ ఊరటనిచ్చే నిర్ణయమని ఆయన అభినందించారు. ప్రధాన మంత్రి న‌రేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం రైతుల …

Read More »

రొయ్యల ఫీడ్ ధరల పెంపు నిలిపివేత.. మంత్రి అచ్చెన్నాయుడు జోక్యంతో కీలక నిర్ణయం

– రైతుల కష్టాలపై వ్యాపారం చేయొద్దు : ఫీడ్ కంపెనీలకు మంత్రి గట్టి హెచ్చరిక – ఏకపక్ష ధరల పెంపు అంగీకరించం – రైతుల ప్రయోజనాలకే తొలి ప్రాధాన్యం : మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : ఆక్వా రైతుల ప్రయోజనాలకు విఘాతం కలిగించే ఏ నిర్ణయాన్నీ కూటమి ప్రభుత్వం సహించదని రాష్ట్ర వ్యవసాయ, మత్స్యశాఖల మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. రొయ్యల ఫీడ్ ధరలను ఒక్కసారిగా పెంచడం వల్ల రాష్ట్రంలోని వేలాది ఆక్వా రైతులపై తీవ్ర ఆర్థిక …

Read More »

సెర్ప్‌లో సంస్క‌ర‌ణ‌ల‌పై మంత్రి కొండ‌ప‌ల్లి స‌మీక్ష‌

– మ‌హిళ పారిశ్రామిక‌వేత్త‌ల ప్రోత్సాహానికి ప‌లు అంశాల‌పై చ‌ర్చ‌ అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో 5 ల‌క్ష‌ల మంది మ‌హిళా పారిశ్రామిక‌వేత్త‌ల‌ను త‌యారు చేసే క్ర‌మంలో ఎప్ప‌టిక‌ప్పుడు వారికి కావాల్సిన స‌హాయ స‌హ‌కారాలు అందించ‌డంతో పాటు స‌మ‌న్వ‌యం చేసుకోవాల‌ని రాష్ట్ర సూక్ష్మ, చిన్న, మధ్యతరహ పరిశ్రమలు, గ్రామీణ పేదరిక నిర్మూలన, ప్రవాసాంధ్రుల సాధికారత సంబంధాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు. బుధ‌వారం మంత్రి విజ‌య‌వాడ‌లోని త‌న క్యాంప్ కార్యాల‌యంలో సెర్ప్ అధికారుల‌తో స‌మీక్ష నిర్వ‌హించారు. ఈ క్ర‌మంలోనే ప‌లు అంశాల‌పై …

Read More »

తిరుపతి ట్రాఫిక్‌ కష్టాలకు పరిష్కారం

-ఎంపీ గురుమూర్తి కృషితో అందుబాటులోకి రానున్న రైల్వే అండర్ బ్రిడ్జి తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : తిరుపతి నగరంలో ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి కీలకమైన ఎల్సీ నం.107 పాత హీరో హోండా షోరూం వద్ద నిర్మాణంలో ఉన్న రైల్వే అండర్ బ్రిడ్జ్ పనులు దాదాపు పూర్తి కాస్తున్నాయి. త్వరలోనే ప్రజలకు అందుబాటులోకి రానున్న ఈ అండర్ బ్రిడ్జ్ ద్వారా నగర ట్రాఫిక్‌కు భారీ ఉపశమనం కలగనుంది. ఇదే సమయంలో కొత్తగా మంజూరు అయిన అప్రోచ్ రోడ్డు పనులు కూడా ప్రారంభం కానున్నాయి. ఈ …

Read More »

భారతదేశంలో హరిత విధానాల అభివృద్ధికి దిశానిర్దేశం చేస్తోన్న అమరావతి

-స్థిరమైన కొనుగోలు విధానాలపై APCRDA కార్యాచరణ ప్రణాళిక అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : అమరావతిని పర్యావరణహిత నగరంగా అభివృద్ధి చేసే దిశగా APCRDA మరో కీలక ముందడుగు వేసింది. ఈ కార్యాచరణలో భాగంగా స్థిరమైన & హరిత ప్రొక్యూర్‌మెంట్ మార్గదర్శకాల ముసాయిదాపై 2026 మే 13న రాయపూడిలో APCRDA ప్రాజెక్టు కార్యాలయంలో ఉన్నత స్థాయి సంప్రదింపుల సమావేశం నిర్వహించారు. ప్రపంచ బ్యాంక్ మద్దతుతో అమరావతిలో అమలవుతున్న కార్యక్రమంలో భాగంగా ఈ సమావేశం జరిగింది. నగర నిర్మాణం & మౌలిక వసతుల అభివృద్ధిలో పర్యావరణ …

Read More »

నెక్కల్లులో గ్రామసభ నిర్వహించిన APCRDA..హాజరైన కమిషనర్ వి.విజయరామరాజు

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజారాజధాని అమరావతి నగర నిర్మాణం నిమిత్తం భూసేకరణ కార్యకలాపాలకై నెక్కల్లులో APCRDA ఆధ్వర్యంలో బుధవారం గ్రామసభ జరిగింది. నేడు జరిగిన గ్రామసభలో కమిషనర్ వి.విజయరామరాజు ఐఏఎస్, అడిషనల్ కమిషనర్లు ఏ.భార్గవతేజ ఐఏఎస్, కె.కార్తీక్ ఐఏఎస్, ప్లానింగ్ విభాగ డైరెక్టర్ బి.సురేష్ కుమార్(FAC) ఇతర అధికారులు హాజరయ్యారు. రాజధాని నగరంలో నిర్మిస్తున్న రహదారులు, LPS జోన్లు, తదితర అభివృద్ధి ప్రాజెక్టుల నిమిత్తం భూసమీకరణ(ల్యాండ్ పూలింగ్- LPS) చేపట్టామని.. సమీకరణకు కొందరు రైతులు, భూయజమానులు ముందుకు రానందున..రైతులతో పలుమార్లు చర్చించిన …

Read More »

కార్మికుల‌కు వైద్య ప‌రీక్ష‌లు

అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : రాజ‌ధాని అమ‌రావ‌తి నిర్మాణాల‌లో ప‌నిచేస్తున్నకార్మికుల‌కు రాయ‌పూడిలోని మెగా ఇంజినీరింగ్ కంపెనీలో వైద్య ప‌రీక్ష‌లు నిర్వ‌హించారు. మ‌ణిపాల్ హాస్పిట‌ల్ వైద్యులు, సిబ్బంది కంటి ప‌రీక్ష‌లు, ఈసీజీ, పీఎఫ్‌టీ(ప‌ల్మ‌నాల‌జి), ర‌క్త‌పోటు, మ‌ధుమేహం ప‌రీక్ష‌లు చేశారు. హాస్పిట‌ల్ వైద్యులు డాక్ట‌ర్ కె. ఇమ్మానుయేల్ ఈ వైద్య శిబిరంలో పాల్గొని ప‌రీక్ష‌ల అనంత‌రం కార్మికులు వైద్య స‌ల‌హాలు, సూచ‌నాలు చేశారు. మెగా ఇంజినీరింగ్ కంపెనీ చేప‌డుతున్న ఎల్పీఎస్ జోన్‌-3బి, జోన్‌-6 ప్రాజెక్టుల్లో ప‌నిచేస్తున్న సుమారు 160 మంది కార్మికులు, ఆప‌రేటర్లు, సంస్థ ఉద్యోగులు …

Read More »

దామినేడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ జి.వీర పాండ్యన్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : తిరుపతి పర్యటనలో భాగంగా ఈరోజు మధ్యాహ్నం దామినేడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని రాష్ట్రఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ శ్రీ జి వీర పాండ్యన్ గారు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ల్యాబ్, ఫార్మసీ రిజిస్టర్లు, మరియు ఇతర ఆసుపత్రి రికార్డులను పరిశీలించారు.సిబ్బంది యొక్క ముఖ ఆధారిత హాజరును ఆన్లైన్లో తనిఖీ చేశారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నిర్వహించే అన్ని కార్యక్రమాల పనితీరు మరియు ప్రగతిని వైద్యాధికారి మరియు సిబ్బందితో సమీక్షించి ఆన్లైన్లో తనిఖీ చేశారు. కార్యక్రమాల అమలు …

Read More »

తిరుపతిని ‘గ్లోబల్ టూరిస్ట్ హబ్’గా తీర్చిదిద్దుతాం: పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్

-చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య, శ్రీపొట్టిశ్రీరాములు జిల్లలా పర్యాటక ప్రాజెక్టులపై అధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష..ఇకపై ప్రతి మూడు నెలలకోసారి పర్యాటక శాఖపై సమీక్షా సమావేశాలు నిర్వహిస్తామని వెల్లడి -తిరుపతి సమీప ప్రాంతాలతో కొత్తగా ‘టూరిజం సర్క్యూట్స్’ ఏర్పాటు చేయాలని ఆదేశం.. అన్నమయ్య జిల్లాను ‘ఎకనామిక్ డిస్ట్రిక్ట్’గా మార్చడమే లక్ష్యం.. నెల్లూరు తీరంలో అంతర్జాతీయ స్థాయి స్టార్ హోటళ్ల ఏర్పాటుకు సన్నాహాలు -హార్సిలీహిల్స్ ఫెస్టివల్ నిర్వహణకు చర్యలు..జూలైలో మైపాడు బీచ్ ఫెస్టివల్ ను నిర్వహించాలని ఆదేశాలు జారీ.. మైపాడు బీచ్ కు బ్లూఫ్లాగ్ గుర్తింపు వచ్చేందుకు …

Read More »