అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
రాజధాని అమరావతి నిర్మాణాలలో పనిచేస్తున్నకార్మికులకు రాయపూడిలోని మెగా ఇంజినీరింగ్ కంపెనీలో వైద్య పరీక్షలు నిర్వహించారు. మణిపాల్ హాస్పిటల్ వైద్యులు, సిబ్బంది కంటి పరీక్షలు, ఈసీజీ, పీఎఫ్‌టీ(పల్మనాలజి), రక్తపోటు, మధుమేహం పరీక్షలు చేశారు. హాస్పిటల్ వైద్యులు డాక్టర్ కె. ఇమ్మానుయేల్ ఈ వైద్య శిబిరంలో పాల్గొని పరీక్షల అనంతరం కార్మికులు వైద్య సలహాలు, సూచనాలు చేశారు.
మెగా ఇంజినీరింగ్ కంపెనీ చేపడుతున్న ఎల్పీఎస్ జోన్-3బి, జోన్-6 ప్రాజెక్టుల్లో పనిచేస్తున్న సుమారు 160 మంది కార్మికులు, ఆపరేటర్లు, సంస్థ ఉద్యోగులు విరివిగా వైద్య శిబిరంలో పాల్గొన్నారు. కార్మికుల సౌలభ్యం దృష్టిలో ఉంచుకొని రెండు రోజుల పాటు వైద్య శిబిరం జరుపుతామని మెగా సంస్థ ఓహెచ్ఎస్ ప్రాంతీయ మేనేజర్ సీహెచ్. మోహన వంశీ తెలిపారు. ఈ శిబిరంలో ఏపీ సీఆర్డీఏ, ఏడీసీఎల్ ఎన్విరాన్మెంట్ అండ్ సోషల్ మేనేజ్మెంట్ విభాగం ప్రతినిధులు, మెగా ప్రాజెక్టు మేనేజర్లు ఎస్.సురేష్, కె.కిరణ్‌లు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News