తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
తిరుపతి పర్యటనలో భాగంగా ఈరోజు మధ్యాహ్నం దామినేడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని రాష్ట్రఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ శ్రీ జి వీర పాండ్యన్ గారు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ల్యాబ్, ఫార్మసీ రిజిస్టర్లు, మరియు ఇతర ఆసుపత్రి రికార్డులను పరిశీలించారు.సిబ్బంది యొక్క ముఖ ఆధారిత హాజరును ఆన్లైన్లో తనిఖీ చేశారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నిర్వహించే అన్ని కార్యక్రమాల పనితీరు మరియు ప్రగతిని వైద్యాధికారి మరియు సిబ్బందితో సమీక్షించి ఆన్లైన్లో తనిఖీ చేశారు. కార్యక్రమాల అమలు మరియు రికార్డుల నిర్వహణ పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. సిబ్బంది అందరూ అంకితభావంతో పనిచేసి డేటానంతటిని ఎప్పటికప్పుడు ఆన్లైన్ అప్లికేషన్లలో ఎంటర్ చేయాలని ఆదేశించారు.ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ బాలకృష్ణ నాయక్, అడిషనల్ డి ఎం హెచ్ ఓ డాక్టర్ సెల్వియా , డిపిఎమ్ఓ డాక్టర్ చత్ర ప్రకాష్ రెడ్డి, సి హెచ్ ఓ రత్నాకర్,డిపిఓ ప్రకాష్,దామినేడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి ఉదయశ్రీ మరియుసిబ్బంది పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News