Breaking News

ఎండ తీవ్రత, వడగాలులు, ఉక్కపోత పట్ల ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి…

అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలో క్రమేపి పెరుగుతున్న ఎండ తీవ్రత, వడగాలులు, ఉక్కపోత పట్ల ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ సూచించారు. బుధవారం చిత్తూరు జిల్లా రాయలపేటలో 43.7డిగ్రీలు నమోదైందని తెలిపారు. అలాగే 28 జిల్లాలకు గాను 22 జిల్లాల పరిధిలోని 143 మండలాల్లో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు రికార్డు అయినట్లు ఆయన వెల్లడించారు.

గురువారం (14-05-26) రాష్ట్రంలో గరిష్ఠంగా 43-44°C మధ్య గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదైందుకు అవకాశం ఉందన్నారు. అల్లూరి జిల్లా జికే వీధి మండలం, పోలవరం జిల్లా చింతూరు, కూనవరం, గుర్తేడు మండలాల్లో(4) వడగాలులు వీచే అవకాశం ఉందన్నారు. శుక్రవారం 01 తీవ్ర, 15 మండలాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని పేర్కొన్నారు. మరోవైపు అల్పపీడనం ప్రభావంతో రేపు, ఎల్లుండి రాయలసీమ జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.

బుధవారం చిత్తూరు(జి) రాయలపేటలో 43.7°C, నంద్యాల(జి) దొర్నిపాడులో 42.6°C,కర్నూలు(జి) నగరడోనలో 42.5°C, వైఎస్సార్ కడప(జి) కలసపాడులో 42°C, మర్కాపురం(జి) కంభంలో 41.9°C, కృష్ణా(జి) ఉయ్యూరు, ఎన్టీఆర్(జి) తొర్రగుడిపాడులో 41.8°C, అనకాపల్లి(జి) దేవరపల్లిలో 41.3°C, అనంతపురం(జి) భట్టువానిపల్లి, పల్నాడు(జి) బెల్లంకొండ, శ్రీసత్యసాయి(జి) దాడితోటలో 41.2°C, నెల్లూరు(జి) మర్రిపాడులో 41 డిగ్రీల చొప్పున గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వెల్లడించారు.

ఎండలో బయటకు వెళ్లేటప్పుడు చెవుల్లోకి వేడిగాలి వెళ్ళకుండా జాగ్రత్త పడాలని, గుండె సంబంధిత వ్యాదులు, షుగర్, బీపీ ఉన్నవారు ఎండలో తిరగరాదని సూచించారు. నిమ్మకాయ నీరు, మజ్జిగ, కొబ్బరి నీరు,మంచినీరు ఎక్కువగా తీసుకోవాలని సూచించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

16 నెలలు… 16కు పైగా విజయాలు…

-స్పష్టమైన మార్పు చూపించిన ‘స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర’ కార్యక్రమం -ఇదే స్ఫూర్తితో పనిచేయాలని ప్రభుత్వ యంత్రాంగానికి సీఎం చంద్రబాబు పిలుపు -ప్రజల సహకారంపై …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *