Breaking News

Andhra Pradesh

జూన్ 1న ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా వినతుల స్వీకరణ..

-జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జూన్ 1వ తేదీ సోమవారం కలెక్టరేట్ లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక (మీకోసం … పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెసల్ సిస్టం) కార్యక్రమం ద్వారా ప్రజల నుండి వినతులు స్వీకరించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రజా సమస్యల పరిష్కారానికి పీజీఆర్ఎస్ ద్వారా అర్జీల స్వీకరణ చేపట్టనున్నట్టు తెలిపారు. కలెక్టరేట్ శ్రీ పింగళి వెంకయ్య సమావేశ మందిరంతో పాటు డివిజన్, మునిసిపల్, …

Read More »

గిరి ప్రదక్షిణ భక్తులకు మజ్జిగ పంపిణీ

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : శ్రీ దుర్గా మల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానం వారు ఆదివారం  అధిక జేష్ఠ మాస పౌర్ణమి పురస్కరించుకుని శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్లను ఉత్సవ మూర్తులుగా భక్తులకు రథంపై ఊరేగింపుగా వెళ్తూ దర్శనం ఇచ్చే విధంగా ‘ఇంద్రకీలాద్రి గిరి ప్రదక్షిణ’ కార్యక్రమం నిర్వహించింది. ఈరోజున శ్రీ దుర్గా మల్లేశ్వరులు, శ్రీ విఘ్నేశ్వరుడు, శ్రీ సుబ్రహ్మణ్యస్వామి, శ్రీ ఆంజనేయస్వామి వంటి సకల దేవతలు కొలువైన ఇంద్రకీలాద్రి చుట్టూ గిరి ప్రదక్షిణ చేయడం వలన కోరిన కోరికలు తీరుతాయని అందుకే …

Read More »

భూములు ఇచ్చిన రైతులకు పరిహా పరిహారపు నిధులు విడుదల

-గుంటూరు ఛానల్ విస్తరణకు భూములు ఇచ్చిన ఏడు గ్రామాల రైతుల ఖాతాల్లో జమ -7 గ్రామాల రైతులకు రెండో దఫా చెల్లింపుగా రూ.17.58 కోట్ల విడుదల -తొలి దఫా పరిహారంగా ఇప్పటికే రూ.10.54 కోట్లతో వెరసి రూ. 28.12 కోట్లు చెల్లింపు -సహకరించిన సీఎం చంద్రబాబు నాయుడుకి పెమ్మసాని కృతజ్ఞతలు గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు ఛానల్ అభివృద్ధి పనులోని పలు దశలను, సమస్యలను కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని ఒక్కోటిగా పరిష్కరిస్తూ ముందుకు సాగుతున్నారు. ఛానల్ ఆధునికీకరణ, విస్తరణ పనులకుగానూ …

Read More »

ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక…

-కమిషనర్ కె.మయూర్ అశోక్ గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : జూన్ 1వ తేది సోమవారం గుంటూరు నగర ప్రజల స్థానిక సమస్యల పరిష్కారానికి 10:30 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు గుంటూరు నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశ మందిరంలో “ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక” (పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెస్సల్ సిస్టం) కార్యక్రమం ద్వారా జిఎంసి విభాగాధిపతులతో కలిసి ప్రజల నుండి నేరుగా అర్జీలు, ఫిర్యాదులు తీసుకుంటామని నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.

Read More »

“యాంటీ మలేరియా మాసం – జూన్ 2026”

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజారోగ్య పరిరక్షణలో భాగంగా ప్రతి సంవత్సరంలాగే ఈ ఏడాది కూడా జూన్ నెలను “యాంటీ మలేరియా మాసం – జూన్ 2026” గా నిర్వహిస్తున్నట్లు గుంటూరు నగరపాలక సంస్థ కమిషనర్ కె.మయూర్ అశోక్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో మలేరియా, డెంగ్యూ, చికున్‌గున్యా వంటి దోమల ద్వారా వ్యాపించే వ్యాధుల నివారణకు ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్దేశించిన “మలేరియా నిర్మూలన వైపు …

Read More »

జూన్ 1 నుంచి సెమీ-మెకనైజ్డ్ రీచ్‌లు, పట్టా భూముల్లో ఇసుక తీత నిలిపివేత

-మాన్సూన్ స్టాక్ పాయింట్ల ద్వారా ఇసుక సరఫరా కొనసాగింపు రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : పర్యావరణ, అటవీ మరియు వాతావరణ మార్పు మంత్రిత్వ శాఖ (MOEF&CC) మార్గదర్శకాల ప్రకారం ప్రతి సంవత్సరం జూన్ 1వ తేదీ నుండి అక్టోబర్ 15వ తేదీ వరకు వర్షాకాలం (మాన్సూన్ సీజన్)గా పరిగణించబడుతున్నందున, ఈ కాలంలో నదీ పరీవాహక ప్రాంతాల్లో ఇసుక తవ్వకాల కార్యకలాపాలు నిలిపివేయబడతాయని జిల్లా గనులు మరియు భూగర్భశాఖ అధికారి డి. ఫణి భూషణ్ రెడ్డి తెలిపారు. ఈ నేపథ్యంలో తూర్పు గోదావరి జిల్లాలోని …

Read More »

గోదావరి డెల్టాకు ఖరీఫ్ సాగునీటి విడుదల

-రైతు సంక్షేమమే లక్ష్యంగా ముందస్తు నీటి విడుదల. -సీఎం చంద్రబాబు ఆదేశాలతో బ్యారేజీ మరమ్మతులకు రూ.148 కోట్లు – మంత్రి కందుల దుర్గేష్ రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : స్థానిక సర్ ఆర్థర్ కాటన్ బ్యారేజ్ వద్ద ఆదివారం ఖరీఫ్ సీజన్ సాగునీటి విడుదల కార్యక్రమం పండుగ వాతావరణంలో ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్, రాజ్యసభ సభ్యుడు సానా సతీష్, కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్, అమలాపురం ఎంపీ గంటి హరీష్ మాధుర్, …

Read More »

సమిశ్రగూడెం చెరువు సరికొత్త లుక్..రూ.50 లక్షలతో చెరువు సుందరీకరణ

-రూ.50 లక్షల నిధులతో సాంప్రదాయ నీటి వనరుల పునరుద్ధరణ కార్యక్రమానికి శంకుస్థాపన చేసిన మంత్రి కందుల దుర్గేష్ -సమిశ్రగూడెం చెరువు చెంతన వాకింగ్ ట్రాక్, ఓపెన్ జిమ్‌తో పర్యాటక శోభ..నిడదవోలులో మారనున్న చెరువుల రూపురేఖలు -పశు సంపద రక్షణకు ఇప్పటికే గోకులం షెడ్డులు ఏర్పాటు..త్వరలోనే నిడదవోలు రూరల్ పరిధిలో ‘కాటిల్ హాస్టల్’ నిర్మాణం చేపడతామని వెల్లడి -కూటమి ప్రభుత్వంతోనే సంక్షేమం, అభివృద్ధి సాధ్యం..నియోజకవర్గ సంక్షేమం, అభివృద్ధి నా బాధ్యత..మంత్రి కందుల దుర్గేష్ హామీ -సీఎం చంద్రబాబునాయుడు సూచనలతో ‘హెల్దీ, వెల్దీ, హ్యాపీ ఆంధ్రప్రదేశ్’ దిశగా …

Read More »

సూపర్ స్టార్ కృష్ణ జయంతి సందర్భంగా కేక్ కట్ చేసి మజ్జిగ పంపిణీ చేసిన ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : తెలుగు సినీ పరిశ్రమలో తనదైన ముద్ర వేసిన నటశేఖర, సూపర్ స్టార్ కృష్ణ జయంతి సందర్భంగా పడమట దర్శిపేట సర్కిల్ నందు అభిమానులు ఏర్పాటు చేసిన పుట్టినరోజు కార్యక్రమంలో ఎన్టీఆర్ జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు,తూర్పు నియోజకవర్గ ఇన్‌చార్జ్ దేవినేని అవినాష్ గారు పాల్గొని అభిమానులతో కలిసి కేక్ కట్ చేసి ఘనంగా నివాళులర్పించారు.ఈ సందర్భంగా వేసవి తీవ్రతను దృష్టిలో ఉంచుకుని ప్రజలకు మజ్జిగ పంపిణీ చేశారు. సూపర్ స్టార్ కృష్ణ గారు తెలుగు సినీ …

Read More »

గతంలో మోసం… ఇప్పుడు నిర్లక్ష్యం ముస్లింల చిరకాల స్వప్నం ‘షాదీ ఖానా’పై టీడీపీ వైఖరి ఎండగట్టిన ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు దేవినేని అవినాష్

-వైఎస్ జగన్ హయాంలో రూ. 2.5 కోట్లతో నిర్మించిన షాదీ ఖానా తాళాలు వెంటనే తెరవాలి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : తూర్పు నియోజకవర్గంలోని మైనారిటీ సోదర సోదరీమణుల చిరకాల కోరిక అయిన షాదీ ఖానా నిర్మాణాన్ని కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడాన్ని నిరసిస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆందోళన చేశారు. ఈ సందర్భంగా దేవినేని అవినాష్ మాట్లాడుతూ, గతంలో ముఖ్యంగా 2014 నుండి 2019 మధ్య అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ (వెన్నుపోటు పార్టీ) మైనారిటీలను ఐదేళ్లపాటు మోసం చేసిందని …

Read More »