– పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా నిరుద్యోగ యువతకు శిక్షణ -స్కిల్ డెవలప్మెంట్ పార్ట్ నర్స్ గా ప్రముఖ పరిశ్రమలు -ఏపి విధానానికి నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఎన్ఎస్డిసి) నుంచి అభినందనలు -స్కిల్ ఎకోసిస్టమ్ ను అభివృద్ధి చేయడంలో భాగంగా ఐబిఎం, టెక్ మహీంద్రా, దాల్మియా, డెల్, హెచ్. సి.ఎల్ తదితర 13 ప్రముఖ సంస్థలతో ఒప్పందం -రూ.460 కోట్లతో ఏపీఎస్‌ఎస్‌డీసీ ఆధ్వర్యంలో 23 నైపుణ్య కళాశాలలు -ఇప్పటికే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా పులివెందులలో ఒక స్కిల్ ఇనిస్టిట్యూట్ కు …
Read More »Latest News
బెహ్రాయిన్ లో వలస కార్మికులు ధైర్యంగా ఉండండి…
-బాధితులతో మాట్లాడిన రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్యశాఖ, పాడిపరిశ్రమాభివృద్ది శాఖా మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు -అక్కడి పరిస్థితులు పోన్ లో మాట్లాడి తెలుసుకున్న మంత్రి పలాస, నేటి పత్రిక ప్రజావార్త : గత రెండు రోజులుగా బెహ్రాయిన్ దేశంలో శ్రీకాకుళం నుండి వెల్లిన వలస కూలీల వీడియోలు సామాజిక మాధ్యమాల్లో, సమాచార మాధ్యమాల్లో ప్రచారం అవుతున్న విషయం తెలిసిందే ఆదివారం రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్యశాఖ, పాడి పరిశ్రమాభివృద్ది శాఖా మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు బాదితులతో మాట్లాడారు. బెహ్రాయిన్ దేశంలో పనులకు వెల్లిన వారి …
Read More »పర్యావరణ హితంగా నిమజ్జన కార్యక్రమాలు… : ఎమ్మెల్యే మల్లాది విష్ణు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : వినాయక చవితి వేడుకలను సెంట్రల్ నియోజకవర్గ పరిధిలోని ప్రజలు అత్యంత భక్తి శ్రద్ధలతో ప్రభుత్వ మార్గదర్శకాలను పాటిస్తూ జరుపుకున్నారు. బావాజీ పేట, అయోధ్యనగర్, గులాబీతోట, మధురానగర్, సింగ్ నగర్ సహా పలు ప్రాంతాలలో ఆదివారం జరిగిన వేడుకలలో శాసనసభ్యులు మల్లాది విష్ణు పాల్గొని స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. నియోజకవర్గ ప్రజలందరికీ విఘ్నాలు తొలగి మంచి జరగాలని వినాయకున్ని ప్రార్థించారు. ఉదయాన్నే వినాయకుడిని దర్శించినా, స్మరించినా, పూజించినా ఆ రోజున పనులన్నీ ఎలాంటి ఆటంకాలు లేకుండా …
Read More »ప్రతి కంటిలో వెలుగు ఉండాలనేది జగనన్న ప్రభుత్వ లక్ష్యం… : ఎమ్మెల్యే మల్లాది విష్ణు
-ఉచిత కంటి పరీక్ష శిబిరం ప్రారంభోత్సవంలో ఎమ్మెల్యే మల్లాది విష్ణు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో ఏ ఒక్కరూ కంటి సమస్యలతో బాధపడకూడదన్నదే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ లక్ష్యమని సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు మల్లాది విష్ణు అన్నారు. ఎల్బీఎస్ నగర్ లోని పుచ్చలపల్లి సుందరయ్య ప్రభుత్వ పాఠశాలలో సంధ్య కంటి ఆస్పత్రి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత కంటి వైద్య శిబిరాన్ని డివిజన్ కార్పొరేటర్ అలంపూర్ విజయలక్ష్మి తో కలిసి శాసనసభ్యులు ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. మేనిఫెస్టోలో చెప్పకపోయినప్పటికీ డాక్టర్ …
Read More »‘పవర్ ఫుల్’ విద్యుత్తు రంగమే లక్ష్యం!
-విద్యుత్తు రంగం బలోపేతానికి అత్యుత్తుమ విధానాలు -రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం -వినియోగదారుల ప్రయోజనాల పరిరక్షణకే ప్రాధాన్యం -సరఫరా, పంపిణీ నెట్వర్క్ బలోపేతంపై ప్రత్యేకంగా దృష్టి సారించాలి -విద్యుత్తు సంస్థలకు ప్రభుత్వం ఆదేశం -రూ.3669 కోట్ల ట్రూ అప్ ఛార్జీల వసూలుకు ఏపీఈఆర్సీ అనుమతి -రాష్ట్ర ఇంధన శాఖ కార్యదర్శికి తెలిపిన డిస్కంల సీఎండీలు -విద్యుత్తు కొనుగోలు బకాయిలు, నిర్వహణ వ్యయం రూ.32 వేల కోట్లు! -విద్యుత్తు సంస్థలను ఆదుకునేందుకు 2019-21 మధ్య రూ.28,166 కోట్లు విడుదల -2019-21 మధ్య విద్యుదుత్పత్తి సంస్థలకు రూ.64 వేల …
Read More »క్రమం తప్పకుండా స్నాతకోత్సవాలు…
-విశ్వవిద్యాలయాలకు గవర్నర్ ఆదేశం విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలోని కొన్ని విశ్వవిద్యాలయాలు నిబంధనల మేరకు క్రమబద్దంగా స్నాతకోత్సవాలు నిర్వహించకపోవడంపై ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషన్ హారిచందన్ ఆందోళన వ్యక్తం చేసారు. నియమబద్ధంగా స్నాతకోత్సవ కార్యక్రమాలు నిర్వహించకపోవడం వల్ల విద్యార్థుల భవిష్యత్తు ప్రమాదంలో పడుతుందన్నారు. కోవిడ్ మహమ్మారికి ముందు, 3-4 సంవత్సరాలకు ఒకసారి సమావేశాలు నిర్వహించటం గమనించానన్నారు. అయితే ఇప్పటికే రాజ్ భవన్‌లో జరిగిన ఉపకులపతుల సదస్సుల సందర్భంగా స్నాతకోత్సవాలు ప్రతి సంవత్సరం నిర్వహించి విద్యార్థులకు డిగ్రీలను అందించాలని గవర్నర్ ఆదేశించారు. దీనిని అమలు …
Read More »బ్లాక్ ఫంగస్ సోకకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి… : మంత్రి పేర్ని నాని
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : కోవిద్ వైరస్ సోకి చికిత్స తీసుకుని కోలుకున్న అనంతరం బ్లాక్ ఫంగస్ సోకకుండా తగిన జాగ్రత్తలు తీసుకుని కోవిడ్ పట్ల ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర రవాణా, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) తెలిపారు. ఆదివారం ఉదయం 7 గంటల సమయంలో ఆయన తన కార్యాలయం వద్దకు వివిధ సమస్యల పరిష్కారం కోరుతూ పలు ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలను కలుసుకొని ముఖాముఖిగా వారితో సంభాషించారు. ప్రజలు పడుతున్న ఇబ్బందులను …
Read More »వైద్య ఆరోగ్య శాఖలో తాత్కాలిక పద్ధతిలో వైద్యుల పోస్టులు భర్తీ – డి.ఎం.హెచ్.ఓ డా.సుహాసిని
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : వైద్య ఆరోగ్య శాఖలో తాత్కాలిక పద్ధతిలో వైద్యుల పోస్టులు భర్తీ చేయుటకు దరఖాస్తులు కోరుతున్నట్లు వైద్య ఆరోగ్య శాఖాధికారి డా. ఎం. సుహాసిని ఒక ప్రకటనలో తెలిపారు. జాతీయ ఆరోగ్య మిషన్ కింద ఒక సంవత్సర కాల పరిమితితో చిన్న పిల్లల వైద్య నిపుణులు 1, స్త్రీ వైద్య నిపుణులు 8, మత్తు ఇచ్చు వైద్య నిపుణులు 2 పోస్టులకు ఈనెల 20వ తేదీ లోగా దరఖాస్తు చేసుకోవాలన్నారు. పైన తెలిపిన పోస్టులకు నెలకు రూ.1,10,000/-లు జీతం …
Read More »వీరంకి ప్రభునగర్ లో నివశిస్తున్న యానాదు కుటుంబాలకు ఆదార్, రేషన్, కులధృవీకరణ పత్రాలను అందించాలి… : కలెక్టరు జె. నివాస్
-గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నవజీవన్ బాల భవన్ ఏన్ జివో ద్వారా రూ. 2 వేలు ఆర్థిక సహాయం, నిత్యావసర వస్తువులు పంపిణీ… -బడి ఈడు పిల్లలందరినీ వెంటనే బడి లో చేర్పించే విధంగా చర్యలు చేపట్టాలి… -గిరిజన సంక్షేమ శాఖ ద్వారా అమలు చేసే ప్రభుత్వ పథకాలను వారికి అందించే విధంగా అధికారులు చర్యలు చేప్టటాలి… విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : వీరంకి ప్రభునగర్ లో నివశిస్తున్న గిరిజన తెగలకు చెందిన యానాది కులస్తులకు ఆదార్, రేషన్ కార్డులతో పాటు …
Read More »స్పందనను వినియోగించుకోండి… : కమిషనర్ ప్రసన్న వెంకటేష్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నగర ప్రజల సమస్యల పరిష్కార వేదికగా ప్రతి సోమవారం నగర పాలక సంస్థ ప్రధాన కార్యాలయం, సర్కిల్ కార్యాలయములలో “స్పందన” కార్యక్రమము జరుగుతుందని కమిషనర్ ప్రసన్న వెంకటేష్ ఐ. ఏ. ఎస్. తెలిపారు. 13.09.2021 సోమవారం ఉదయం 10.30 ని.ల నుంచి మధ్యాహ్నం 1.00 గంట వరకు నగర పాలక సంస్థ ప్రధాన కార్యాలయంలోను, మూడు సర్కిల్ కార్యాలయములలో “స్పందన ” కార్యక్రమం నిర్వహించబడుతుందన్నారు. ఈ కార్యక్రమాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని కమిషనర్ తెలిపారు.
Read More »