విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : గ్రామ వార్డు సచివాలయ ఎంప్లాయిస్ ఫెడరేషన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు ఎం.డి.జాని పాషా ఆధ్వర్యంలో గ్రామ వార్డు సచివాలయ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అజయ్ జైన్ ను కలిసి ఎటువంటి పరీక్షలతో సంభందం లేకుండా అక్టోబర్2న సచివాలయ ఉద్యోగులందరికీ ప్రొబేషన్ డిక్లేర్ చేయాలని కోరుతూ వినతిపత్రం సమర్పించారు. గ్రామ వార్డు సచివాలయ ఎంప్లాయిస్ ఫెడరేషన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు ఎం.డి.జాని పాషా ఆధ్వర్యంలో రాష్ట్ర కమిటీ గ్రామ వార్డు సచివాలయాల శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అజయ్ …
Read More »Latest News
ప్రజారోగ్యం కోసం తీసుకున్న నిర్ణయంపై రాజకీయమా..? :
-రాజ్ భవన్ కు ఎందుకు వెళ్లాలో..? గవర్నర్ ను ఎప్పుడు కలవాలో బీజేపీ నాయకులు తెలుసుకోవాలి… -గోబెల్స్ ప్రచారాలను మానుకోవాలి: మల్లాది విష్ణు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కరోనా వ్యాప్తిని అరికట్టడానికి జాతీయ అంతర్జాతీయ ప్రమాణాలను పాటిస్తుంటే కొందరు వ్యక్తులు, సంస్థలు ప్రభుత్వాన్ని అకారణంగా అప్రతిష్టపాలు చేసేందుకు ప్రయత్నిస్తున్నాయి. బిజెపి, విశ్వహిందూ పరిషత్ తదితర సంస్థలు రాష్ట్రంలో హిందూ సమాజానికి ముప్పు వచ్చినట్టు దుష్ప్రచారాన్ని సాగిస్తూ ప్రజల్ని భయాందోళనలకు గురిచేస్తున్నాయి. కరోనా నిరోధక …
Read More »వర్షపునీరు నిల్వలేకుండా చర్యలు చేపట్టాలి… : కమిషనర్ ప్రసన్న వెంకటేష్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రస్తుతం సీజనల్ వ్యాధుల కాలం కావడంతో మరియు వర్షాలు కురుస్తున్న తరుణంలో ప్రజలు అనారోగ్యానికి గురికాకుండా చేపట్టాల్సిన పారిశుద్ధ్య పనుల్లో జాప్యం లేకుండా, రహదారులు, ఖాళీస్థలాల్లో వర్షపునీరు నిల్వ లేకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని నగర పాలక సంస్థ కమిషనర్ ప్రసన్న వెంకటేష్ ఆదేశించారు. రోజువారీ పర్యటనలో భాగంగా మంగళవారం కమిషనర్ బందరురోడ్డు, ఏలూరు రోడ్డు, బెసెంట్ రోడ్డు, సిద్దార్థ కాలేజి రోడ్డు, మదర్ ధేరిసా జంక్షన్, పి.పి.క్లినిక్ రోడ్, మహానాడు రోడ్డు తదితర ప్రాంతాలలో విస్తృతంగా …
Read More »జగనన్న కాలనీల్లో గృహనిర్మాణ బాధ్యత స్థానిక ప్రజాప్రతినిధులదే… : మంత్రి పేర్ని నాని
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో జగనన్న కాలనీల్లో చేపడుతున్న గృహనిర్మాణ బాధ్యత స్థానిక ప్రజాప్రతినిధులదేనని, నిర్మాణ తీరుతెన్నులు మీరే స్వయంగా పర్యవేక్షించాలని ఖరీదైన లేఅవుట్లో పేదలకు గృహాలు మంజూరు చేశామని రాష్ట్ర రవాణా, సమాచార పౌర సంబంధాల శాఖల మంత్రి పేర్ని వెంకట్రామయ్య(నాని) సంతృప్తి వ్యక్తం చేసారు. సోమవారం స్థానిక జెడ్ పి కన్వెన్షన్ హాలులో నిర్మాణాల ప్రగతిని వేగవంతం చేసేందుకు జిల్లా కలెక్టర్ జె.నివాస్ గ్రామ సర్పంచ్ లు, కార్పొరేటర్లు, హ సింగ్ శాఖ ఏజలు, పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ సిబ్బందితో …
Read More »ప్రతి గ్రామానికి బ్రాడ్ బ్యాండ్ సేవలందించేదుకు కృషి… : సిఎస్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలోని పట్టణాలతోపాటు ప్రతి గ్రామానికి మెరుగైన బ్రాడ్ బ్యాండ్ సేవలను అందుబాటులోకి తెచ్చేందుకు ప్రభుత్వం అవసరమైన చర్యలు తీసుకుంటోందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యా నాధ్ దాస్ పేర్కొన్నారు.సోమవారం విజయవాడ సిఎస్ క్యాంపు కార్యాలయంలో ద్వితీయ స్టేట్ బ్రాడ్ బ్యాండ్ కమిటీ సమావేశం ఆయన అధ్యక్షతన జరిగింది.ఈసమావేశంలో ప్రధానంగా ఇండియన్ టెలిగ్రాఫ్ రైట్ అఫ్ వే రూల్స్ 2016 ప్రకారం ఆర్ఓడబ్ల్యు పాలసీ నోటిఫై చేయడం, స్టేట్ ఆర్ ఓడబ్ల్యు పోర్టల్ అమలు, నేషనల్ బిల్డింగ్ కోడ్ …
Read More »దళారీ వ్యవస్థ నియంత్రణకే చేపల చెరువుల వేలం…
-రాష్ట్ర పశుసంవర్థక, పాడిపరిశ్రమ అభివృద్ది, మత్స్య శాఖ మంత్రి డా.సీదిరి అప్పలరాజు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో పలు చేపల చెరువులు దళారీల కబంధ హస్తాల్లో చిక్కుకున్నాయని, అటు వంటి చేపల చెరువులకు దళారీ వ్యవస్థ నుండి విముక్తి కలిగించి మత్స్యకారులకు నిఖరమైన ఆదాయాన్ని కల్పించాలనే లక్ష్యంతోనే చేపల చెరువుల వేలానికి కార్యాచరణ మార్గదర్శకాలతో జి.ఓ.ఆర్టి.నెం.217 ను జారీచేయడం జరిగిందని రాష్ట్ర పశుసంవర్థక, పాడిపరిశ్రమ అభివృద్ది, మత్స్య శాఖ మంత్రి డా. సీదిరి అప్పలరాజు స్పష్టం చేశారు. సోమవారం సచివాలయంలోని పబ్లిసిటీ …
Read More »పాడిపరిశ్రమ అభివృద్దికి రుణసాయం అందజేయండి…
-రాష్ట్ర పశుసంవర్థక, పాడిపరిశ్రమ అభివృద్ది, మత్స్య శాఖ మంత్రి డా.సీదిరి అప్పలరాజు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో అమలవుతున్న ఏ.పి. అమూల్ ప్రాజెక్టుని మరింత సమర్థవంతంగా అమలు చేయడానికి, పది వేల పైచిలుకు మహిళా పాల ఉత్పత్తి సంఘాల బలోపేతానికి జాతీయ సహకార అభివృద్ది సంస్థ (NCDC) ద్వారా రూ.1,362 కోట్ల రుణ సహాయాన్ని త్వరితగతిన అందజేయాలని రాష్ట్ర పశుసంవర్థక, పాడిపరిశ్రమ అభివృద్ది, మత్స్య శాఖ మంత్రి డా. సీదిరి అప్పలరాజు కేంద్రప్రభుత్వాన్ని కోరారు. కేంద్ర మత్స్య, పశుసంవర్థక, పాడిపరిశ్రమ అభివృద్ది …
Read More »బందరు పోర్టు పనులు త్వరలో ప్రారంభించుటకు అన్ని చర్యలు తీసుకుంటున్నాం… : మంత్రి పేర్నీ
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ముడా పరిధిలో కైకలూరు, కృత్తివెన్ను, నాగాయలంక వంటి దూరప్రాంతాల ప్రజలు ఇళ్ల ప్లాన్ల కోసం పడుతున్న ఇబ్బందులు దృష్టిలో ఉంచుకుని 300 గజాలు లోపు మరియు జీ+2010 మీటర్ల ఎత్తు) గృహల నిర్మాణానికి ప్లానుల అనుమతులు ఆయా గ్రామ పంచాయితీ పరిధిలోకి తేవడానికి తీర్మాణం చేయుటకు ఈ సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి తెలిపారు. బందరు పోర్టుకు రైలు రోడ్డు కనెక్టివిటి కోసం అవసరమైన 224 ఎకరాలు భూమి సేకరించుటకు సత్వర చర్యలు తీసుకోవాలని మంత్రి అదేశించారు. …
Read More »రాష్ట్రంలో రోడ్లు, పోర్టులు, విమానాశ్రయాలపై సమీక్ష…
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో రోడ్లు, పోర్టులు, విమానాశ్రయాలపై రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి క్యాంప్ కార్యాలయంలో సోమవారం సమీక్షించారు. ఈ సమీక్షా సమావేశంలో సీఎం వైయస్ జగన్ మాట్లాడుతూ… అక్టోబరు మాసానికల్లా వర్షాలు తగ్గుముఖం పడతాయి: సీఎం తర్వాత పనుల కాలం మొదలవుతుంది : ముందుగా రోడ్లను బాగుచేయడంపై దృష్టిపెట్టండి: మళ్లీ వర్షాకాలం వచ్చేలోగా రోడ్లన్నింటినీ బాగుచేయాలి: అధికారులకు సీఎం ఆదేశం మన ప్రభుత్వం వచ్చిన తర్వాత రోడ్లపై ప్రత్యేక దృష్టిపెట్టాం: గత ప్రభుత్వంలో రోడ్లను పూర్తిగా విడిచిపెట్టారు: మనం …
Read More »ఈనెల 11న జరిగే జాతీయ లోక్ అదాలత్ సద్వినియోగం చేసుకోవాలి – జిల్లా జడ్డి ఏ.నరశింహమూర్తి
-గత ఏప్రిల్ లో జాతీయ లోక్ అదాలత్ లో కేసుల పరిష్కారంలో రాష్ట్రంలో కృష్ణాజిల్లా మొదటి స్థానం. మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ఈనెల 11వ తేదీ శనివారం జిల్లాలో కోర్టులు గల 13 ప్రదేశాల్లో జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు జిల్లా జడ్డి ఏ.నరశింహమూర్తి వెల్లడించారు. సోమవారం జిల్లా కోర్టు ఆవరణలో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో జిల్లా జడ్డి మాట్లాడుతూ సుప్రీంకోర్టు, హైకోర్టు ఆదేశాల మేరకు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ఈ నెల 11వ తేదీన జాతీయ లోక్ …
Read More »