పాట్నా, నేటి పత్రిక ప్రజావార్త : బీహార్ రాష్ట్రం పాట్నాలో జరుగుతున్న 85వ అఖిల భారత సభాపతుల మహాసభలో స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు ప్రసంగించారు. తన ప్రసంగాన్ని స్వయంగా తెలుగులో చేయడం గొప్ప ప్రాధాన్యతను సంతరించుకుంది. ఆయన ప్రసంగం ద్వారా తెలుగు భాష గొప్పతనాన్ని, దాని చారిత్రక ప్రాధాన్యతను, ఆత్మగౌరవాన్ని చాటిచెప్పారు. స్పీకర్ తెలుగులో మాట్లాడటం వల్ల మహాసభలో ప్రత్యేకమైన ప్రశంసలు అందుకున్నారు. తెలుగు భాష, సంస్కృతి, సంప్రదాయాలను ప్రశంసిస్తూ, దేశవ్యాప్తంగా తెలుగువారి గౌరవాన్ని నిలబెట్టే విధంగా ఆయన ప్రసంగం సాగింది. 75 ఏళ్ల …
Read More »Daily Archives: January 20, 2025
పోర్టుల అభివృద్ధి – పురోగతిపై ఆ శాఖ ఉన్నతాధికారులతో మంత్రి సమీక్ష సమావేశం
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : సుదీర్ఘ తీర ప్రాంత కలిగిన ఆంధ్రప్రదేశ్ ఆర్థికాభివృద్ధికి భవిష్యత్తులో పోర్టులు కీలక పాత్ర పోషిస్తాయని రాష్ట్ర రోడ్లు & భవనాలు, పెట్టుబడులు, మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బీ.సీ జనార్థన్ రెడ్డి అన్నారు. నేడు మంగళగిరిలోని ఏపీ మారిటైమ్ బోర్డు కార్యాలయంలో పోర్టుల అభివృద్ధి – పురోగతిపై ఆ శాఖ ఉన్నతాధికారులతో మంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు. రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో సీ పోర్టుల పాత్ర కీలకమని.. కాబట్టి త్వరితగతిన వాటిని పూర్తి చేయాల్సిన …
Read More »రాష్ట్రమంత్రి కొలుసు పార్థసారథి ఆధ్వర్యంలో ఆగిరిపల్లిలో మెగా జాబ్ మేళా
-మెగా జాబ్ మేళాకు అపూర్వ స్పందన -ఐదేళ్లలో యువతకు 20 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యం ఏలూరు/ఆగిరిపల్లి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో రానున్న ఐదేళ్లలో యువతకు 20 లక్షల ఉద్యోగాలు కల్పించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖల మంత్రి కొలుసు పార్థసారథి పేర్కొన్నారు.సోమవారం నూజివీడు నియోజకవర్గ పరిధిలోని యువతి యువకులకు అమరరాజా కంపెనీలో ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ఆగిరిపల్లి సమీపంలోని గోపాలపురం ఎన్ ఆర్ ఐ కళాశాలలో ఏర్పాటు చేసిన మెగా జాబ్ …
Read More »ఉత్సాహంగా సీఎం చంద్రబాబు దావోస్ పర్యటన
-తొలిరోజే పెట్టుబడిదారులతో వరుస సమావేశాలు -ఘన స్వాగతం పలికిన ప్రవాసాంధ్రులు -స్విస్ కంపెనీలతో భేటీ – పెట్టుబడులకు ఆహ్వానం జ్యూరిచ్, నేటి పత్రిక ప్రజావార్త : వరల్డ్ ఎకనమిక్ ఫోరం సదస్సుకు దావోస్ వెళ్లిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోమవారం తొలిరోజు పర్యటనలో వరుసగా పెట్టుబడిదారులతో సమావేశాలు నిర్వహించారు. ముందుగా జ్యూరిచ్‌లోని హిల్టన్ హోటల్‌లో స్విట్జర్లాండ్‌లోని భారత అంబాసిడర్ మృధుల్ కుమార్‌తో సమావేశమై రాష్ట్రానికి స్విట్జర్లాండ్ నుంచి పెట్టుబడులకు ఉన్న అవకాశాలపై చర్చించారు. నెస్ట్లే, ఏబీబీ, నోవార్టీస్ వంటి దిగ్గజ కంపెనీలతో సహా …
Read More »త్వరలో జరిగే 31వ సదరన్ జోనల్ కౌన్సిల్ ముసాయిదా అజెండా అంశాలపై సిఎస్ సమీక్ష
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : త్వరలో జరగనున్న సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశానికి సంబంధించిన ముసాయిదా అజెండా అంశాలపై సోమవారం రాష్ట్ర సచివాలయంలో సంబంధిత శాఖల అధికారులతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ సమీక్షించారు. ప్రధానంగా రాష్ట్ర విభజన సంబంధించి వివిధ పెండింగ్ అంశాలపై జోనల్ కౌన్సిల్ సమావేశం దృష్టికి తీసుకువెళ్ళి చర్చించేందుకు వీలుగా తీసుకోవాల్సిన చర్యలపై ఆయన అధికారులతో సమీక్షించారు.ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన చట్టంలోని షెడ్యూల్ 13లో పేర్కొన్న విశాఖపట్నృం-చెన్నె పారిశ్రామిక కారిడార్, విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి విమానాశ్రయాల విస్తరణ,అంతర్జాతీయ …
Read More »త్వరలో వాట్సాప్ ద్వారా జనన, మరణ ధృవీకరణ పత్రాలు
-ముందుగా తెనాలీలో ప్రయోగాత్మక పరిశీలన -డేటా ఇంటిగ్రేషన్ సహా సాంకేతిక సవాళ్లను పరిశీలించండి -దీని ఫలితాలను బట్టి త్వరలో రాష్ట్ర వ్యాపంగా అమలు -ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. విజయానంద్ -వాట్సాప్ గవర్నెన్స్, ఏపీ సీఆర్ఎస్ అమలుపై ఆర్టీజీఎస్‌లో సమీక్ష అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆశయాలకనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే ప్రజలకు వాట్సాప్ గవర్నెన్స్ సేవలు అందించనుందని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. విజయానంద్ తెలిపారు. ఇందులో భాగంగా వాట్సాప్ ద్వారా ప్రజలకు త్వరలోనే …
Read More »తక్షణమే ప్రజా సమస్యలను పరిష్కరించాలి
-త్వరలో అన్ని చెరువులకు నీటి నింపుతాం -రాష్ట్ర బీసీ సంక్షేమ చేనేత జౌళి శాఖ మంత్రి సవిత -పెనుకొండ నియోజకవర్గం సోమందేపల్లి మండలం తహసీల్దార్ కార్యాలయంలో ప్రజాదర్బార్ ను నిర్వహించిన మంత్రి సవిత -ప్రజాదర్బార్ లో వచ్చిన సమస్యలకు వెంటనే పరిష్కారం చూపించాలి.. అధికారులకు మంత్రి సవితమ్మ ఆదేశాలు సోమందేపల్లి, నేటి పత్రిక ప్రజావార్త : తక్షణమే ప్రజా సమస్యలను పరిష్కరించాలని రాష్ట్ర బీసీ సంక్షేమ చేనేత జౌళి శాఖ మంత్రి సవితమ్మ సంబంధిత శాఖల అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.సోమందేపల్లి మండల కేంద్రంలో …
Read More »గ్రామ పంచాయతీ క్లస్టర్ వ్యవస్థకు కొత్త రూపు
-ఆదాయ ప్రాతిపదికతతోపాటు జనాభా ప్రాతిపదికనను జోడించి కొత్త గ్రేడ్లు -గ్రేడ్లు ఆధారంగా సిబ్బంది కేటాయింపు… గ్రామ పంచాయతీ, సచివాలయ సిబ్బందితో సమన్వయం -అధ్యయనం చేసి సిఫార్సులు చేసేందుకు కమిటీ ఏర్పాటు -ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పవన్ కల్యాణ్ సమీక్షలో నిర్ణయం విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : గ్రామీణ ప్రజలకు నిరంతరాయంగా పంచాయతీ సేవలు అందేలా చూడాలని, దీనికోసం సిబ్బంది లేమి సమస్యను అధిగమించాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పంచాయతీరాజ్ అధికారులకు స్పష్టం చేశారు. పంచాయతీరాజ్ శాఖ పరిధిలోని …
Read More »స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడుకు సాధర ఆహ్వానం
పాట్నా, నేటి పత్రిక ప్రజావార్త : స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు జనవరి 20, 21 తేదీలలో బీహార్ రాష్ట్రం పాట్నాలో జరుగుతున్న 85వ అఖిల భారత సభాపతుల మహాసభలో పాల్గొనడానికి విచ్చేసిన సందర్భంలో, లోక్ సబ స్పీకర్ ఓం బిర్లా, తెలంగాణ శాసనసభ స్పీకర్ గెడ్డం ప్రసాద్ కుమార్ కలిసి ఆయనకు సాధర ఆహ్వానం అందజేశారు. ఈ కార్యక్రమానికి స్పీకర్ తో పాటు ఆయన సతీమణి చింతకాయల పద్మావతి హాజరుకాగా, డిప్యూటీ స్పీకర్ రఘురామరాజు, ఆయన సతీమణి, అలాగే ఏపీ శాసన వ్యవస్థ సెక్రటరీ …
Read More »ఎస్సీల ఉప వర్గీకరణ ఏకసభ్య కమిషన్ రాజీవ్ రంజన్ మిశ్రా ఐ.ఏ.ఎస్ కు ఘన స్వాగతం
అనంతపురం, నేటి పత్రిక ప్రజావార్త : ఎస్సీల ఉప వర్గీకరణ ఏకసభ్య కమిషన్ (ONE MAN COMMISSION ON SUB CLASSIFICATION OF SCs) రాజీవ్ రంజన్ మిశ్రా ఐ.ఏ.ఎస్ (రిటైర్డ్) జిల్లా పర్యటనకు విచ్చేశారు. సోమవారం అనంతపురం నగరంలోని ఆర్.అండ్.బి అతిథి గృహంలో ఎస్సీల ఉప వర్గీకరణ ఏకసభ్య కమిషన్ రాజీవ్ రంజన్ మిశ్రా ఐ.ఏ.ఎస్ (రిటైర్డ్) ని శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ టీఎస్.చేతన్, మర్యాద పూర్వకంగా కలిసి పూలమొక్కలు, పుష్పగుచ్చాలు అందించి ఘన స్వాగతం పలికారు.
Read More »